iPhone: ఐఫోన్‌ యూజర్లకు హెచ్చరిక.! 91 దేశాల్లోని యూజర్లకు నోటిఫికేషన్‌..

iPhone: ఐఫోన్‌ యూజర్లకు హెచ్చరిక.! 91 దేశాల్లోని యూజర్లకు నోటిఫికేషన్‌..

Anil kumar poka

|

Updated on: Apr 13, 2024 | 8:00 PM

ఐఫోన్‌ తయారీ సంస్థ యాపిల్‌ తమ థ్రెట్‌ నోటిఫికేషన్‌ వ్యవస్థను అప్‌డేట్‌ చేసింది. కిరాయికి తీసుకున్న స్పైవేర్‌ ద్వారా లక్షిత సైబర్‌ దాడులు జరగొచ్చని తాజాగా హెచ్చరించింది. ఐఫోన్‌ సహా యాపిల్‌ ఉత్పత్తుల్లోకి అక్రమంగా చొరబడే అవకాశం ఉందని FAQs లో పేర్కొంది. ఈ మేరకు త్వరలో భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా 91 దేశాల్లోని యూజర్లకు నోటిఫికేషన్‌ పంపే అవకాశం ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.

ఐఫోన్‌ తయారీ సంస్థ యాపిల్‌ తమ థ్రెట్‌ నోటిఫికేషన్‌ వ్యవస్థను అప్‌డేట్‌ చేసింది. కిరాయికి తీసుకున్న స్పైవేర్‌ ద్వారా లక్షిత సైబర్‌ దాడులు జరగొచ్చని తాజాగా హెచ్చరించింది. ఐఫోన్‌ సహా యాపిల్‌ ఉత్పత్తుల్లోకి అక్రమంగా చొరబడే అవకాశం ఉందని FAQs లో పేర్కొంది. ఈ మేరకు త్వరలో భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా 91 దేశాల్లోని యూజర్లకు నోటిఫికేషన్‌ పంపే అవకాశం ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. NSO గ్రూప్‌ తయారు చేసిన పెగాసస్‌ వంటి వాటిని కిరాయి స్పైవేర్‌ గా వ్యవహరిస్తుంటారు. అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన వీటితో ప్రత్యేకంగా కొందరు వ్యక్తులను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటారు. సమాజంలో సదరు వ్యక్తుల పాత్ర, హోదా, స్థాయి ఆధారంగా ఎవరిని టార్గెట్‌ చేయాలనేది సైబర్‌ నేరగాళ్లు నిర్ణయిస్తారని యాపిల్‌ చివరిసారి నోటిఫికేషన్‌ జారీ చేసినప్పుడు వివరించింది. ఇప్పటి వరకు వీటిని ప్రభుత్వ మద్దతు ఉన్న సైబర్‌ దాడులుగా పేర్కొన్న సంస్థ.. వాటిని ఇప్పుడు కిరాయి స్పైవేర్‌ ముప్పుగా మార్చింది. ఇప్పటికే మెర్సినరీ స్పైవేర్‌ ద్వారా పలువురి ఐఫోన్‌ సహా ఇతర ఉత్పత్తుల్లోకి సైబర్‌ నేరగాళ్లు చొరబడినట్లు గుర్తించామని యాపిల్‌ పేర్కొంది. ఎప్పుడు, ఎవరిపై ఈ సైబర్‌ దాడులు చోటు చేసుకొంటాయనేది ముందుగా గుర్తించడం కష్టమనీ, దాడులు జరగడం మాత్రం ఖాయమని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు యూజర్లను అప్రమత్తం చేయటంతో పాటు తగిన జాగ్రత్తలు సూచిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..