Asaduddin Owaisi: UCC బిల్లు ముస్లింలకే కాదు.. హిందువులకు కూడా నష్టమే.. సీఎం కేసీఆర్ హామీఇచ్చారు..
Asaduddin Owaisi Meets CM KCR: ఉమ్మడి పౌరస్మృతి బిల్లు UCCని వ్యతిరేకిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ తమకు హామీ ఇచ్చారని మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. యూనిఫాం సివిల్ కోడ్‌తో ముస్లింలతో పాటు హిందువులకు కూడా నష్టం కలుగుతుందన్నారు.

Asaduddin Owaisi Meets CM KCR: ఉమ్మడి పౌరస్మృతి బిల్లు UCCని వ్యతిరేకిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ తమకు హామీ ఇచ్చారని మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. యూనిఫాం సివిల్ కోడ్‌తో ముస్లింలతో పాటు హిందువులకు కూడా నష్టం కలుగుతుందన్నారు. ఆదివాసీలకు కూడా ఈ బిల్లుతో అన్యాయం జరుగుతుందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును వ్యతిరేకించాలని కోరుతూ.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. సోమవారం సీఎం కేసీఆర్ ను కోరారు. ప్రగతి భవన్ లో తెలంగాణలోని ముస్లిం మత పెద్దలతో పాటు,ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అధ్యక్షుడు ఖాలిద్ సైఫుల్లా రెహ్మానీ, జమియతుల్ ఉలమా ఏ హింద్ ప్రతినిధులు ముఫ్తీ గయాజ్ అమ్మద్‌లతో కలిసి ఎంపీ అసద్ CM కేసిఆర్ను కలిసి యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుపై చర్చించారు.
తెలంగాణలో గత పదేళ్లుగా ఎలాంటి మతకలహాలు లేకుండా పూర్తి ప్రశాంతంగా ఉందని, మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ బిల్లుతో లౌకిక వాదాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని అసద్ అన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీ అంశంపై తెలంగాణ అసెంబ్లీలో మొదట తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశామని.. యూసీసీ ప్రజాస్వామ్యానికి మంచిది కాదని సీఎం కేసీఆర్ కు వివరించామని ఎంపీ అసద్ తెలిపారు. యూసీసీ కేవలం ముస్లింలకే పరిమితమైన అంశం కాదని క్రైస్తవులు, గిరిజనులు హిందువులకు కూడా మంచిది కాదని అసద్ పేర్కొన్నారు.

Cm Kcr
భారత ప్రధానికి లౌకికవాదం అంటే అలర్జీ అని.. ఆ పదం వినడానికి ఆయన ఇష్ట పడరని అందుకే యూసీసీ పేరిట ప్రధాని దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అసద్ తెలిపారు. యూసీసీ అమలు జరిగితే తెలంగాణ, ఛత్తీస్ గడ్ లోని గిరిజనులు ఏం కావాలి? అని ఆయన ప్రశ్నించారు. యూసీసీని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చారని అసద్ తెలిపారు. భావసారూప్యత కలిగిన పార్టీలతో ఈ అంశంపై చర్చిస్తామని కేసీఆర్ తో చెప్పామన్న ఎంపీ అసదుద్దీన్.. యూసీసీని వ్యతిరేకించాలని ఏపీ సీఎం జగన్ ను కూడా కోరుతున్నామన్నారు. సమయం ఇస్తే వెళ్లి ఏపీ సీఎం జగన్ ను కూడా కలుస్తామని అసదుద్దీన్ అన్నారు.





Asaduddin Owaisi
యూనిఫాం సివిల్ కోడ్ అంశంతో పాటు తెలంగాణలో వక్ఫ్ భూములు, పాతబస్తీ మెట్రో, మైనార్టీ రుణాలు, ఇతర సమస్యలపై కూడా చర్చించామని అసద్ అన్నారు. సచివాలయంలో మసీదులు, ఇతర ప్రార్ధనా మందిరాలు త్వరగా ప్రారంభించాలని కోరారు అసద్. యూసీసీ వ్యతిరేకించాలని బీఆర్ఎస్ లోక్ సభ, రాజ్యసభ నేతలకు కూడా స్పష్టంగా చెబుతానని సీఎం కేసీఆర్ తమకు హామీ ఇచ్చారని అసద్ చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..