Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రిటైర్‌మెంటా! తూచ్.. మళ్లీ పోటీకి సై అంటున్న జానారెడ్డి.. యూ టర్న్‌ వెనుక అసలు టర్న్‌ ఏంటి?

రిటైర్‌మెంట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించేశారు. అవును, ఆ పెద్దాయన ఫస్ట్‌ రిటైర్‌మెంట్‌ అన్నారు. ఇప్పుడు తూచ్‌ అంటున్నారట. పైగా రివర్స్‌ రిటైర్‌మెంట్‌ ప్రకటిస్తారట. త్వరలో రాజకీయాల్లోకి మళ్లీ దిగి అసెంబ్లీకి పోటీ చేయాలని తహతహలాడుతున్నారట. అసలు ఆయన యూ టర్న్‌ వెనుక ఉన్న టర్నింగ్‌ పాయింట్‌ ఏంటి?

Telangana: రిటైర్‌మెంటా! తూచ్.. మళ్లీ పోటీకి సై అంటున్న జానారెడ్డి.. యూ టర్న్‌ వెనుక అసలు టర్న్‌ ఏంటి?
K Jana Reddy
Follow us
M Revan Reddy

| Edited By: Shiva Prajapati

Updated on: Jul 10, 2023 | 7:50 PM

రిటైర్‌మెంట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించేశారు. అవును, ఆ పెద్దాయన ఫస్ట్‌ రిటైర్‌మెంట్‌ అన్నారు. ఇప్పుడు తూచ్‌ అంటున్నారట. పైగా రివర్స్‌ రిటైర్‌మెంట్‌ ప్రకటిస్తారట. త్వరలో రాజకీయాల్లోకి మళ్లీ దిగి అసెంబ్లీకి పోటీ చేయాలని తహతహలాడుతున్నారట. అసలు ఆయన యూ టర్న్‌ వెనుక ఉన్న టర్నింగ్‌ పాయింట్‌ ఏంటి? ఎందుకు సడెన్‌గా మనసు మార్చుకున్నారు? ఎందుకంటే ఆ సీటంటే ఆయనకు ప్రేమంట! అది అంత ముఖ్యమైన సీటా? ఇంతకీ ఏంటా సీటు? ఎవరా పెద్దాయన? ఇంట్రస్టింగ్ స్టోరీ మీకోసం..

కుందూరు జానారెడ్డి.. తెలంగాణ రాజకీయాల్లో తలపండిన నేత. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజకీయ దిగ్గజం. ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన రికార్డు ఆయన సొంతం. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన ఘనాపాఠి. వయోభారంతో క్రియాశీలక రాజకీయాల నుంచి దూరంగా ఉండాలని భావించారు. రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటానన్న జానారెడ్డి.. తన వారసులు రఘువీర్ రెడ్డి, జైవీర్ రెడ్డిల రాజకీయ అరంగ్రేటం కోసం రంగం సిద్ధం చేశారు. ఇద్దరు వారసులను నాగార్జున సాగర్, మిర్యాలగూడలో ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. జానారెడ్డి ప్రాతినిధ్యం వహించిన నాగార్జునసాగర్‌లో ‘బ్రింగ్‌ బ్యాక్ కాంగ్రెస్’ పేరుతో జైవీర్ రెడ్డి గిరిజన చైతన్య యాత్ర చేశారు.

పెద్దకొడుక్కి మిర్యాలగూడ..

జానారెడ్డికి మంచి పట్టు ఉన్న మిర్యాలగూడలో పెద్ద కొడుకు రఘువీర్ రెడ్డి పోటీకి సిద్ధమవుతున్నారు. రఘువీర్ రాజకీయ భవిష్యత్తు కోసం ఇప్పటికే తన అనుచర గణంతో జానారెడ్డి సమావేశాలు కూడా నిర్వహించారు. మిర్యాలగూడ నుంచి రఘువీర్ ఎన్నికల కార్యాచరణను మొదలు పెట్టారు. ప్రతి ఎన్నికల్లో జానారెడ్డి విజయంలో వారసులే కీ రోల్ పోషించారు. జానారెడ్డి కుమారులకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో మంచి సంబంధాలు ఉండడం రాజకీయంగా మరింత బలాన్ని సమకూర్చింది.

ఇవి కూడా చదవండి

సీఎం కుర్చీపై జానా కర్చీఫ్‌!

అయితే కర్నాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త జోష్ వచ్చింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యమ్నాయం కాంగ్రెస్సేనని భావించిన వివిధ పార్టీల నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం లీడర్లు, కేడర్‌లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మళ్ళీ రాష్ట్ర అసెంబ్లీలో అడుగు పెట్టాలని జానారెడ్డి భావిస్తున్నారని సమాచారం. ఆయన సీఎం కుర్చీపై మనసు పారేసుకున్నారని సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ మెజార్టీ సీట్లను గెలిస్తే సీఎం అయ్యే ఛాన్స్ తనకు వస్తుందని జానారెడ్డి భావిస్తున్నారట. కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థుల మధ్య పోటీ ఎక్కువగా ఉంది. పార్టీ అధికారంలోకి వస్తే వివాదరహితుడిగా, అందరికి ఆమోదయోగ్యుడిగా అవకాశం వస్తుందని జానారెడ్డి అనుచరులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లో సీనియర్ నేతగా, విశేష రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిగా తనకు సీఎం అయ్యే అవకాశం, అర్హతలు ఉన్నాయని జానారెడ్డి భావిస్తున్నారట. దీంతో ఆయన తన రాజకీయ రిటైర్‌మెంట్‌కి రిటైర్‌మెంట్‌ ప్రకటించే ఆలోచన చేస్తున్నారట.

పోటీ విషయంలో యూ టర్న్‌..

అందుకే ఎన్నికల్లో పోటీ విషయమై జానారెడ్డి యూ టర్న్ తీసుకున్నారట. ఈసారి ఆయన ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు లేకపోలేదనే టాక్‌ పార్టీలో వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇప్పటివరకు జానారెడ్డి బహిరంగ ప్రకటన చేయనప్పటికీ.. ఆయన కన్ను మాత్రం సీఎం కుర్చీ పైనే ఉందంటున్నారు. అధికార బీఆర్ఎస్ ను ఢీ కొట్టాలంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని జానారెడ్డిని పార్టీ హైకమాండ్ ఆదేశించే అవకాశాలు కూడా లేకపోలేదట.

ఇదే సమయంలో జానారెడ్డిని అసెంబ్లీకి కాకుండా నల్లగొండ లోక్‌సభ నుంచి బరిలో నిలిపేతే ఎలా ఉంటుందా అని కూడా కాంగ్రెస్ ఆలోచిస్తోందట. ప్రస్తుత ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో లోక్‌సభకు జానారెడ్డి పోటీ చేస్తే గెలుపు ఖాయమని కాంగ్రెస్ భావిస్తోందట. రాజకీయ దిగ్గజం జానారెడ్డి.. సీఎం కుర్చీ కల నెరవేరుతుందో లేదో వేచి చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..