AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆమెనే సీఎం.. రేవంత్ రెడ్డి నయా స్ట్రాటజీ!?

తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు అంతా ఆమె గురించే చర్చ.. అధిష్టానానికి నమ్మిన బంటు.. రాహుల్ గాంధీతో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు అడుగులో అడుగులు వేసి అగ్రనేత మన్ననలు పొందిన నాయకురాలు.. తాజాగా సీఎం పదవిపై పీసీసీ చీఫ్ రేవంత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయంశంగా మారుతున్న నేపథ్యంలో ఆ మహిళా నేత ఎవరు..?

Telangana: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆమెనే సీఎం.. రేవంత్ రెడ్డి నయా స్ట్రాటజీ!?
Telangana Congress Leaders
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Jul 10, 2023 | 6:44 PM

Share

తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు అంతా ఆమె గురించే చర్చ.. అధిష్టానానికి నమ్మిన బంటు.. రాహుల్ గాంధీతో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు అడుగులో అడుగులు వేసి అగ్రనేత మన్ననలు పొందిన నాయకురాలు.. తాజాగా సీఎం పదవిపై పీసీసీ చీఫ్ రేవంత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయంశంగా మారుతున్న నేపథ్యంలో ఆ మహిళా నేత ఎవరు..? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం రెసులో ఉన్న నాయకురాలు ఆమేనా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

రేవంత్ ఎమ్మెల్యే సీతక్క ని ప్రమోట్ చేస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అమెరికాలోని తానా వేదికగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అవసరమైతే సీతక్కే మా సీఎం అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. అయితే, రేవంత్ మాటల వెనుక అంతర్యం ఏంటని చర్చించుకుంటున్నాయి. సీతక్క ఇమేజ్‌తో ఓట్లు రాబట్టాలని రేవంత్ భావిస్తున్నారని.. ఎస్టీ, మహిళా ఓట్లు లక్ష్యంగా రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసారంటూ విశ్లేషిస్తున్నారు. గతంలో ఒక్కటే సీట్ ఉంటే ముందు సీతక్కకే ఇస్తా అని రేవంత్ చెప్పడం.. ఆ మధ్య కాలంలో వారి మధ్య గ్యాప్ వచ్చిందని వార్తలు కూడా వచ్చాయి.. ఎన్నారై లు అడిగిన ప్రశ్నకు అవసరమైతే సీతక్కే సీఎం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం గాంధీ భవన్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

రాజకీయ వ్యూహంలో భాగంగానే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసారని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అవసరమైతే ఎమ్మెల్యే సీతక్క ముఖ్యమంత్రి అవుతారని రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ వాడారని చెబుతున్నారు. దళిత, గిరిజన, ఆదివాసీ లతో పాటు మహిళలు వన్ సైడ్ గా కాంగ్రెస్ కి అండగా ఉండేలా రాజకీయ ఎత్తుగడగా భావిస్తున్నారు. సీతక్క కి ఉన్న ఇమేజ్ కాంగ్రెస్ కి ఎంతగానో ఉపయోగపడుతుందని అటు అధికార పార్టీ, బీజేపీ నేతలు నేరుగా సీతక్క పై విమర్శలు చేసే పరిస్థితి ఉండదని భావిస్తున్నారు. వీటితో పాటు కాంగ్రెస్ లో జరుగుతున్న గ్రూప్ రాజకీయాలకు కూడా చెక్ పెట్టినట్లు ఉంటుందని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక పార్టీలో.. ఎన్నికలు రాకముందే నేను సీఎం అంటే నేను సీఎం అంటూ నేతలంతా దూసుకొస్తుంటారు. ఇక పీసీసీ గా రేవంత్‌ని వ్యతిరేకించిన కొంతమంది సీనియర్లు.. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డిని సీఎంగా ఒప్పుకునే అవకాశలు చాలా తక్కువనే చెప్పాలి. అలాంటి పక్షంలో ఇతర నేతలకు సీఎం పదవి వెళ్లకుండా సీతక్క పేరును రేవంత్ రెడ్డి ప్రతిపాదించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు పొలిటికల్ పండితులు. ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి వ్యూహత్మకంగా సీతక్కే సీఎం అంటూ కామెంట్స్ చేసారని అంటున్నారు.

మరి రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఎన్నికల నేపథ్యంలో వ్యూహత్మక రాజకీయ ఎత్తుగడేనా లేక సీఎం సీటు తనకు దక్కకపోతే తనకు ఆత్మీయురాలైన సీతక్కు దక్కేలా ముందునుంచే ప్రమోట్ చేస్తున్నారా? అనేది చూడాలి మరి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?