సెల్‌ఫోన్ దొంగిలించాడనే అనుమానంతో యువకుడిపై దాడి.. కళ్లకు గంతలు కట్టి అడవిలోకి తీసుకెళ్లి..
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్ మండలం అహ్మద్ నగర్ కు చెందిన సాయికుమార్ గత కొంతకాలంగా కౌడిపల్లిలోని ఓ హోటల్ లో పనిచేస్తున్నాడు. ఆదివారం మండల పరిధిలోని దేవులపల్లి రోడ్డు నిర్మాణం పనులు చేసేందుకు వచ్చిన వ్యక్తులు ఆ హోటల్‌కు వచ్చి టిఫిన్ చేసి వెళ్లారు.

మెదక్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సెల్ ఫోన్ దొంగలించాడనే నెపంతో యువకుడిపై దాడికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. సెల్ ఫోన్ దొంగిలించాడనే అనుమానంతో యువకుడిని పట్టుకుని కళ్లకు గంతలుకట్టి కొడుతూ అడవిలోకి తీసుకెళ్లారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు వచ్చింది..బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్ మండలం అహ్మద్ నగర్ కు చెందిన సాయికుమార్ గత కొంతకాలంగా కౌడిపల్లిలోని ఓ హోటల్ లో పనిచేస్తున్నాడు. ఆదివారం మండల పరిధిలోని దేవులపల్లి రోడ్డు నిర్మాణం పనులు చేసేందుకు వచ్చిన వ్యక్తులు ఆ హోటల్‌కు వచ్చి టిఫిన్ చేసి వెళ్లారు.
ఆ తర్వాత కొద్దిసేపటికి మళ్లి వచ్చి మీ హోటల్‌లో తమ సెల్ ఫోన్ మర్చిపోయామని, అది ఎక్కడ ఉందంటూ హోటల్ లో పనిచేస్తున్న సాయికుమార్ ను అడిగారు. అతను తనకు తెలియదనిచెప్పినా వారు వినిపించుకోలేదు. అతన్నిపట్టుకుని ఇద్దరు వ్యక్తులు బలవంతంగా బైక్ పై ఎక్కించుకుని సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లారు. అక్కడ సాయికుమార్ కళ్ళకు గంతలు కట్టి దాడి చేసి కొద్దిసేపటి తరువాత అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. దీంతో బాధిత యువకుడు సాయికుమార్ పోలీసులను ఆశ్రయించాడు. తను సెల్ ఫోన్ దొంగిలించలేదని ఎంత చెప్పిన వినిపించుకోలేదంటూ, అనుమానంతో తనను తీవ్రంగా కొట్టారని బాధితుడు సాయి కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు.




మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..