AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అమ్మో.. మళ్లీ ఆ ప్రాంతంలో బయట పడ్డ తీవ్రవాద లింకులు.. సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఏ

జగిత్యాల జిల్లాకి చెందిన ఓ వ్యక్తి ని అదుపులో తీసుకొని విచారించారు. ఆయన ఇచ్చిన సమాచారంతో మళ్ళీ సొదాలు నిర్వహించినట్లు తెలుస్తుంది. తఫ్రిజ్ మస్కట్ లో ఉండటానికి కారణాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఉపాధి నిమిత్తం వెళ్ళారా.. లేదంటే. పీఎఫ్‌ఐ కార్యకలాపాల విస్తరణ కోసం వెళ్ళారా అనే కోణం లో విచారణ చేపట్టారు. అయితే.. ఇక్కడి నుంచి చాలా మంది మస్కట్ కు వెళ్లిన నేపథ్యంలో తాఫ్రిజ్.. ఫోన్ పై ఆరా తీశారు. రోజుకు ఎన్ని కాల్స్ చేస్తారు.. ఎవరితో మాట్లాడుతున్నారు.. అనే అంశం పై దృష్టి పెట్టారు.

Telangana: అమ్మో.. మళ్లీ ఆ ప్రాంతంలో బయట పడ్డ తీవ్రవాద లింకులు.. సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఏ
National Investigation Agency
G Sampath Kumar
| Edited By: |

Updated on: Aug 10, 2023 | 6:50 PM

Share

ఉత్తర తెలంగాణకు కేంద్రబిందువుగా ఉన్న కరీంనగర్ లో ఏదో ఒక రకంగా ఉగ్రమూలాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. సద్దుమణిగిపోయిందనుకున్న తరుణంలో మరోసారి ఉగ్ర లింకులు బయటపడుతుండడం ఆందోళన కల్గిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిషేధించిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యకలాపాలు కూడా కరీంనగర్ లో బయటపడ్డాయి. దీనితో స్థానిక పోలీసులు కూడా అలెర్ట్ అయ్యారు. కరీంనగర్ లో హుస్సేన్ పురా కు చెందిన తఫ్రీజ్ ఖాన్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. ఈయన ఆరు నెలల క్రితం మస్కట్ కీ వెళ్లారు. అక్కడే ఉంటున్నారు గతంలో పీఎఫ్ఐ ఇంఛార్జిగా వ్యవహరించిన తఫ్రీజ్ ఖాన్‌కు.. వివిధ వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయి. గతంలో కూడా కరీంనగర్ లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు.

జగిత్యాల జిల్లాకి చెందిన ఓ వ్యక్తి ని అదుపులో తీసుకొని విచారించారు. ఆయన ఇచ్చిన సమాచారంతో మళ్ళీ సొదాలు నిర్వహించినట్లు తెలుస్తుంది. తఫ్రిజ్ మస్కట్ లో ఉండటానికి కారణాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఉపాధి నిమిత్తం వెళ్ళారా.. లేదంటే. పీఎఫ్‌ఐ కార్యకలాపాల విస్తరణ కోసం వెళ్ళారా అనే కోణం లో విచారణ చేపట్టారు. అయితే.. ఇక్కడి నుంచి చాలా మంది మస్కట్ కు వెళ్లిన నేపథ్యంలో తాఫ్రిజ్.. ఫోన్ పై ఆరా తీశారు. రోజుకు ఎన్ని కాల్స్ చేస్తారు.. ఎవరితో మాట్లాడుతున్నారు.. అనే అంశం పై దృష్టి పెట్టారు. ఇంట్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టిన ఎన్ఐఏ అధికారులు కొన్ని డాక్యూమెంట్లు, బ్యాంకు అకౌంట్లతో పాటు ఇంటి నెంబర్లకు సంబంధించిన వివరాలను సేకరించారు. అయితే ఈ సందర్భంగా ఎన్ఐఏ అధికారులు తఫ్రీజ్ ఖాన్ కుటుంబ సభ్యుల నుండి కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెల్లవారు జామున 3.30 గంటల ప్రాంతంలో కరీంనగర్ లోని తఫ్రీజ్ ఇంటికి చేరుకున్న పోలీసు అధికారులు ఉదయం 8.30 గంటల వరకు అక్కడే ఉండడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా కరీంనగర్ ఏసీపీ నరేందర్ తో కూడా ప్రత్యేకంగా మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముందస్తుగానే స్థానిక పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చిన ఎన్ఐఏ ఆఫీసర్లు బందోబస్తు నడుమ సోదాలు చేపట్టారు. ఇంటి ఆవరణలోకి ఎవ్వరిని కూడా అనుమతించకుండా తనిఖీలు చేపట్టడం గమనార్హం. అయితే తఫ్రీజ్ గతంలో పీఎఫ్ఐతో సంబంధాలు పెట్టుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు పూర్తి వివరాలను సేకరించేందుకే ఎన్ఐఏ అధికారులు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇతని కాంటాక్టులో ఎవరెవరు ఉన్నారు..? వారి నేపథ్యం ఏంటీ అన్న కోణంలో కూడా ఆరా తీసేందుకే వీరు రంగంలోకి దిగినట్టుగా భావిస్తున్నారు.

పీఎఫ్ఐతో జరిగిన ఆర్థిక లావాదేవీలతో పాటు ఆయన ఏ క్యాడర్ లీడర్స్ తో టచ్ లో ఉండేవాడు..? ప్రత్యేకంగా శిక్షణ కోసం వెళ్లాడా..? మస్కట్ లో ఆయన చేస్తున్న కార్యకలాపాలు తదితర అంశాలపై వివరాలు సేకరించే పనిలో నిమగ్నం అయినట్టుగా తెలుస్తోంది. పీఎఫ్ఐ మూలాలను సమూలంగా క్లోజ్ చేయడంతో పాటు ఈ సంస్థను నిషేధించిన తరువాత ఉగ్రవాదులు కొత్త సంస్థలను ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని పీఎఫ్ఐతో అనుబంధం ఉన్నవారిపై నిఘా కట్టుదిట్టం చేస్తున్నట్టు సమాచారం. ఇతని దగ్గర ఉన్న వ్యక్తుల సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. మస్కట్ లో ఉండి ఏమైనా నిధులు సేకరిస్తున్నారా అనే విషయం లో దర్యాప్తు చేశారు. ఈ ఎన్‌ఐఏ దాడులతో కరీంనగర్ లో కలకలం రేగింది. ముక్యంగా.. జగిత్యాలలో గతం లో పీఎఫ్ఐ కార్యక్రమాలు ఎక్కవగా ఉండేవి. అప్పుడు కూడా జగిత్యాల లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించి.. కీలక సమాచారం రాబట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..