అమ్మ బాబోయ్.. ! కీసర బంగారం షాపు దోపిడీ కేసులో వెలుగులోకి సంచలనాలు..!
మల్కాజిగిరి జిల్లాలో కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన జువెలరీ షాప్ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. జనవరి రెండోవ తేదీ సాయంత్రం నాగారం ప్రాంతంలోని బాలాజీ జువెలరీ షాప్‌లో దోపిడీకి పాల్పడ్డ ముఠాను మల్కాజిగిరి ఎస్ఓటి టీమ్, కీసర పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ మీడియాకు కేసు వివరాలను వెల్లడించారు.

మల్కాజిగిరి జిల్లాలో కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన జువెలరీ షాప్ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. జనవరి రెండోవ తేదీ సాయంత్రం నాగారం ప్రాంతంలోని బాలాజీ జువెలరీ షాప్‌లో దోపిడీకి పాల్పడ్డ ముఠాను మల్కాజిగిరి ఎస్ఓటి టీమ్, కీసర పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ మీడియాకు కేసు వివరాలను వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన నజీమ్ కోటాడియా, రామకోటి నివాసి ఏకేందర్ సింగ్ ఇద్దరూ గతంలో చర్లపల్లి జైలులో శిక్ష అనుభవించే సమయంలో పరిచయమయ్యారు. అనంతరం మొహమ్మద్ సైఫ్ అలీ, రాజేందర్ సింగ్‌తో కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. హైదరాబాద్ మహానగరంలోని పలు జువెలరీ షాపులను లక్ష్యంగా చేసుకుని రెక్కీ నిర్వహించారు.
ఈ క్రమంలో కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం ప్రాంతంలో ఉన్న బాలాజీ జువెలరీ షాప్‌ను ఎంచుకున్నారు. పథకం ప్రకారం జనవరి 2వ తేదీ సాయంత్రం దోపిడీకి ఫ్లాన్ చేశారు. షాప్‌లోకి ప్రవేశించిన నిందితులు నకిలీ పిస్టల్‌తో షాప్ యజమానిని బెదిరించారు. అంతేకాకుండా, తమ వద్ద ఉన్న గొడ్డలితో దాడి చేసి భయభ్రాంతులకు గురిచేశారు. షాప్‌లోని బంగారం మొత్తం ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా, యజమాని ప్రతిఘటించడంతో.. కేవలం ఒక ప్యాకెట్ బంగారాన్ని మాత్రమే తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై షాప్ యజమాని ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. మల్కాజిగిరి ఎస్ఓటి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి.. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, నిందితుల కదలికలను విశ్లేషిస్తూ గాలింపు చర్యలు చేపట్టారు. కొద్ది రోజుల్లోనే దోపిడీకి పాల్పడ్డ ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ శ్రీధర్ వెల్లడించారు.
అరెస్టైన నిందితుల్లో నజీమ్ కోటాడియా, ఏకేందర్ సింగ్, సైఫ్ అలీపై గతంలో కూడా ఇదే తరహా దోపిడీ కేసులు నమోదయ్యాయని డీసీపీ తెలిపారు. అలాగే రతన్ సింగ్ గుడి మల్కాపూర్‌కు చెందిన రౌడీషీటర్‌గా గుర్తించామని డీసీపీ స్పష్టం చేశారు. జువెలరీ షాపుల యజమానులు భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీసీపీ శ్రీధర్ సూచించారు. ఈ కేసును వేగంగా ఛేదించిన పోలీసు బృందాన్ని ఆయన అభినందించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
