Telangana: నాగోల్‌ బండ్లగూడ ప్రభుత్వ బడి స్థలం కబ్జాకు యత్నం.. ఎదురుతిరిగిన విద్యార్ధులు! రోడ్డెక్కి రచ్చ..

ఆ ఊరికి ఉన్న ఏకైక ప్రభుత్వ పాఠశాల అది. ఎన్నో తరాలు అందులోనే చదువుకున్నాయి. మరో ఏడాది గడిస్తే 75 ఏళ్లు నిండుతాయి ఆ బడికి. ఇంతలో ఓ దుర్మార్గుడి కన్ను కోట్ల విలువ చేసే ఆ బడి స్థలంపై పడింది. అంతే దసరా సెలవుల్లో గుట్టు చప్పుడు కాకుండా బడి కాంపౌండ్ గోడను కూలగొట్టాడు. విషయం తెలుసుకున్న బడి పిల్లలు సైన్యంలా కదిలి వచ్చారు. రోడ్డెక్కి కదం తొక్కారు..

Telangana: నాగోల్‌ బండ్లగూడ ప్రభుత్వ బడి స్థలం కబ్జాకు యత్నం.. ఎదురుతిరిగిన విద్యార్ధులు! రోడ్డెక్కి రచ్చ..
Govt Primary School In Bandlaguda
Follow us

|

Updated on: Nov 07, 2024 | 6:47 AM

నాగోల్, నవంబర్ 7: గుడినే కాదూ.. గుడిలో లింగాన్ని మాయం చేస్తోన్న జమానా ఇది. ఇక బడి ఓ లెక్కా. అవును.. హైదరాబాద్‌ నాగోల్‌లోని ఓ స్కూల్ జాగాపై కన్నేసిన కబ్జాకోరు.. గజాల చొప్పున లెక్కగట్టి ఆక్రమణకు స్క్రీన్ ప్లే రచించాడు. అనుకున్నట్టే ప్రహారీ గోడను కూల్చేశాడు. అంతలోనే బడి పిల్లలంతా ఎదురు తిరిగారు. మా స్కూల్ మాగ్గావాలి అంటూ కదం తొక్కారు. క్లాస్‌లోకి ఎలుకలు వస్తున్నాయ్.. కళ్లల్లో దుమ్ము పడుతుంది.. ఇబ్బంది అవుతుంది సార్ అంటూ టీవీ9కు కష్టాలను ఏకరువు పెట్టారీ బంగారు తల్లులు. ఇంతకీ ఎవరా చిట్టి సోల్జర్స్‌? ఏంటా కబ్జా కహానీ?

దసరా సెలవుల్లో కాంపౌండ్ వాల్ కూల్చివేత

నాగోల్‌ బండ్లగూడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు 74ఏళ్ల చరిత్ర ఉంది. మరో ఏడాదైతే వజ్రోత్సవ సంబరాలు జరుపుకోవాల్సిన సమయం. కానీ ఏం లాభం? ఓ ప్రైవేట్ వ్యక్తి ఈ సర్కార్ స్కూల్‌పై కన్నేశాడు. దసరా సెలవుల్లో పోలీస్ ప్రొటెక్షన్‌తో వచ్చి కాంపౌండ్‌ వాల్‌ని కూల్చేశాడు. కూలిన గోడల్ని చూసి విద్యార్థులంతా భోరుమన్నారు. మా స్కూల్‌ మాక్కావాలంటూ రోడ్డెక్కారు. ప్లేట్లను చేతుల్లోకి తీసుకుని నినదించారు. కళ్లకు గంతలు కట్టుకుని న్యాయం చేయాలని వేడుకున్నారు. ఏళ్ల తరబడి ఈ స్కూల్‌కి సొంత భవనం లేదు. ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా అందుకు తగ్గ వసతులు లేవు. రేకులతో కూడిన రెండు షెడ్లు.. ఓ వరండాలోనే క్లాస్‌లు జరుగుతున్నాయి. స్కూల్ దీనస్థితిని గమనించిన అధికారులు.. 1998లో బండ్లగూడ సర్వే నంబర్ 36/6లోని ప్రభుత్వ స్థలంలో 1.09 ఎకరాలను కేటాయించారు. తల్లిదండ్రుల కమిటీ ఆధ్వర్యంలో పాఠశాల భవన నిర్మాణ పనుుల ప్రారంభించారు. గోడలు నిర్మిస్తుండగానే 2000లో కొందరు వ్యక్తులు అది తమ ఆస్తిగా పేర్కొంటూ కోర్టుకెళ్లారు.

2012లో ప్రభుత్వ భూమిగా తేల్చిన తహశీల్దార్‌

2012లో అప్పటి తహశీల్దార్ సర్వే చేపట్టి.. ప్రభుత్వ భూమిగా నివేదిక సమర్పించడంతో కోర్టు ప్రభుత్వ భూమిగా తేల్చింది. ఆ తర్వాత సర్వశిక్ష అభయాన్ ఆధ్వర్యంలో స్థలం చుట్టూ ప్రహారీ గోడ నిర్మించారు. తరగతి గదుల నిర్మాణానికి పునాదుల దిమ్మెలు వేశారు. అంతలోనే మరోసారి ప్రైవేటు వ్యక్తులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో పనులు నిలిచిపోయాయి. అప్పటినుంచి ఎన్నో ఇబ్బందుల మధ్య విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాలకు ప్రభుత్వం కేటాయించిన 1.09ఎకరాల భూమి విలువ ప్రస్తుతం రూ.20కోట్ల వరకు ఉంటుంది. మూడు వైపుల ప్రభుత్వ స్థలం.. ఓ వైపు రోడ్డు ఉంటే అది ప్రైవేట్ వ్యక్తులది ఎలా అవుతుందని పిల్లల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇదే స్కూల్‌లో మేం చదువుకున్నాం.. మా పిల్లల్ని చదివిస్తున్నాం. అయినా కబ్జా పీడ మాత్రం వదలడం లేదంటున్నారు. స్కూల్‌కి సంబంధించిన హద్దులు, రికార్డులు పక్కాగా ఉన్నా.. అధికారుల నిర్లక్ష్యమే కబ్జాకోరులకి వరంగా మారుతుందనే ఆరోపణలు ఉన్నాయి. సాధ్యమైనంత త్వరగా స్కూల్‌ నిర్మాణం పూర్తి చేయాలంటున్నారు స్థానిక నేతలు. స్కూల్‌ని కాపాడే బాధ్యత తీసుకుంటామన్నారు లోకల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. పక్కా రికార్డులు కోర్టులో సమర్పించి.. ప్రైవేట్ వ్యక్తుల ఆర్డర్ రద్దయ్యేలా చూస్తామన్నారు.

అనూహ్యంగా పెరిగిన విద్యార్థుల సంఖ్య.. బడి స్థలాన్ని కాజేస్తుంటే చూస్తు ఉండిపోవాల్సిందేనా?

ఉప్పల్, నాగోల్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఈ మధ్య కాలంలో అనూహ్యంగా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఇదో శుభపరిణామం అనే చెప్పాలి. ఇలాంటి అవకాశాలను రెండు చేతులా ఒడిసిపట్టుకుని పిల్లలకు విద్యనందించాలి. కానీ పాఠాలు చెప్పే పరిస్థితి లేకుండా చేస్తే ఎలా? కబ్జాకోరులు దర్జాగా బడి స్థలాన్ని మింగేస్తుంటే చూస్తూ ఉండిపోవాల్సిందేనా? ఈ మధ్య ఎంట్రీ ఇచ్చిన హైడ్రా.. స్కూల్ ఆక్రమణపై దృష్టి సారించాలంటున్నారు స్థానికులు. ఎక్కడెక్కడో నిర్మాణాలను కూల్చేస్తున్నారు. కానీ ఇక్కడి కబ్జారాయుళ్లపై ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా జోక్యం చేసుకుని స్కూల్‌ నిర్మాణం వేగవంతం చేయాలంటున్నారు నాగోల్‌వాసులు. అక్రమార్కుల కన్ను మరోసారి స్కూల్‌పై పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలంటున్నారు.

బండ్లగూడ సర్కార్ బడి స్థలం కబ్జాకుయత్నం..ఎదురుతిరిగిన బడి పిల్లలు
బండ్లగూడ సర్కార్ బడి స్థలం కబ్జాకుయత్నం..ఎదురుతిరిగిన బడి పిల్లలు
పెరిగిన పసిడి ధర.. తగ్గిన సిల్వర్ రేటు..ప్రధాన నగరాల్లో నేటి ధరలు
పెరిగిన పసిడి ధర.. తగ్గిన సిల్వర్ రేటు..ప్రధాన నగరాల్లో నేటి ధరలు
హీరో దర్శన్ నుంచి ప్రాణహాని.. బిగ్ బాస్ కంటెస్టెంట్ ఫిర్యాదు
హీరో దర్శన్ నుంచి ప్రాణహాని.. బిగ్ బాస్ కంటెస్టెంట్ ఫిర్యాదు
JEE dvanced అటెమ్ట్‌ లిమిట్‌ పెరిగిందోచ్‌. ఇకపై మూడేళ్లు రాయొచ్చు
JEE dvanced అటెమ్ట్‌ లిమిట్‌ పెరిగిందోచ్‌. ఇకపై మూడేళ్లు రాయొచ్చు
బాల్యంలో చక్కెర తక్కువగా తింటే వృద్ధాప్యంలో మధుమేహం రాదా..?
బాల్యంలో చక్కెర తక్కువగా తింటే వృద్ధాప్యంలో మధుమేహం రాదా..?
Horoscope Today: వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది..
Horoscope Today: వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది..
అమెరికా ఉపాధ్యక్షుడు ఆంధ్రా అల్లుడే.. సెకండ్‌ లేడీ మన తెలుగమ్మాయే
అమెరికా ఉపాధ్యక్షుడు ఆంధ్రా అల్లుడే.. సెకండ్‌ లేడీ మన తెలుగమ్మాయే
తెలుగు టైటాన్స్‌ అదుర్స్‌.. తమిళ్‌ తలైవాస్‌పై ఉత్కంఠ విజయం
తెలుగు టైటాన్స్‌ అదుర్స్‌.. తమిళ్‌ తలైవాస్‌పై ఉత్కంఠ విజయం
థాంక్యూ సీఎం సార్‌..గురుకుల విద్యార్థులతో సీఎం రేవంత్‌ భేటి
థాంక్యూ సీఎం సార్‌..గురుకుల విద్యార్థులతో సీఎం రేవంత్‌ భేటి
ఉత్కంఠ పోరులో పట్నా పైరేట్స్‌పై యు ముంబా విజయం
ఉత్కంఠ పోరులో పట్నా పైరేట్స్‌పై యు ముంబా విజయం