AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mobile Phone Charging: మొబైల్‌ ఫోన్‌కు ఛార్జింగ్‌ పెడుతుండగా విద్యుత్‌ షాక్‌.. నాలుగో తరగతి బాలిక మృతి

నేటి సాంకేతిక యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్లు కనిపిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అలవోకగా ప్రతి ఒక్కరూ వీటిని వాడేస్తున్నారు. అయితే కొందరు స్మార్ట్‌ ఫోన్ల వినియోగంలో అవగాహన లోపం వల్ల ప్రమాదాల బారీన పడుతున్నారు. తాజాగా ఓ బాలిక తడి చేతులతో సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ పెడుతూ విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో శుక్రవారం (జులై 26) చోటు చేసుకుంది..

Mobile Phone Charging: మొబైల్‌ ఫోన్‌కు ఛార్జింగ్‌ పెడుతుండగా విద్యుత్‌ షాక్‌.. నాలుగో తరగతి బాలిక మృతి
Electric Shock While Charging Mobile Phone
Srilakshmi C
|

Updated on: Jul 26, 2024 | 6:57 PM

Share

ఖమ్మం, జులై 26: నేటి సాంకేతిక యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్లు కనిపిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అలవోకగా ప్రతి ఒక్కరూ వీటిని వాడేస్తున్నారు. అయితే కొందరు స్మార్ట్‌ ఫోన్ల వినియోగంలో అవగాహన లోపం వల్ల ప్రమాదాల బారీన పడుతున్నారు. తాజాగా ఓ బాలిక తడి చేతులతో సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ పెడుతూ విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో శుక్రవారం (జులై 26) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి నామవరం గ్రామానికి చెందిన కటికాల రామకృష్ణ దంపతులకు కుమార్తె అంజలి కార్తీక( 9), కుమారుడు వెంకట గణేశ్‌ ఉన్నారు. ఈ రోజు ఉదయం అంజలి తండ్రి వద్ద నుంచి సెల్‌ ఫోన్‌ తీసుకుని కాసేపు అందులో వీడియోలు చూసింది. ఇంతలో దానికి చార్జింగ్‌ లేకపోవడంతో ఛార్జింగ్‌ పెట్టేందుకు వెళ్లింది. తడి చేతులతో చార్జింగ్‌ పెట్టేందుకు యత్నించింది. ఇంతలో ఒక్కసారిగా విద్యుత్‌ షాక్‌ తగలడంతో బాలిక విలవిల్లాడుతూ కుప్పకూలింది.

కొద్ది సేపటి తర్వాత గమనించిన తల్లిదండ్రులు బాలికను అదే గ్రామంలోని ఓ ప్రైవేటు డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లారు. ఆయన పరీక్షించి, బాలిక అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించాడు. దీంతో కళ్లముందే అప్పటి వరకూ ఆడుతూ పాడుతూ గెంతులు వేసిన తమ గారాలపట్టి.. క్షణాల వ్యవధిలోనే అనంతలోకాలకు తరలివెళ్లడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కాగా మృతి చెందిన బాలిక అంజలి అదే గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతుంది. తండ్రి రామకృష్ణ ఫిర్యాదు మేరకు ఎస్సై నాగుల్‌మీరా కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.