Viral Video: నీ కష్టం పగోడికి కూడా రాకూడదు.. బ్రో! చోరీకి వెళ్తే ఏమీ దొరకలేదనీ.. ఏం చేశాడో చూడండి

అదొక పేద హోటల్‌. అరకొర కస్టమర్లు వచ్చే ఆ హోటల్‌కి ఓ దొంగ గారు రాత్రికి చోరీ చేసేందుకు వచ్చాడు. అయితే హోటలంతా వెతికినా అతగాడికి చిల్లిగవ్వ కూడా దొరకలేదు. చోరీకి వచ్చిన చోట ఏమీ దొరక్కపోవడంతో జాలితో.. తన జేబులో నుంచి పర్సు తీసి, అక్కడ ఉన్న టేబుల్‌ మీద రూ.20 పెట్టి వెళ్లి పోయాడు. ఈ సంఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో జులై 18న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..

Viral Video: నీ కష్టం పగోడికి కూడా రాకూడదు.. బ్రో! చోరీకి వెళ్తే ఏమీ దొరకలేదనీ.. ఏం చేశాడో చూడండి
Theft Intelangana Hotel
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 26, 2024 | 7:34 PM

రంగారెడ్డి, జులై 26: అదొక పేద హోటల్‌. అరకొర కస్టమర్లు వచ్చే ఆ హోటల్‌కి ఓ దొంగ గారు రాత్రికి చోరీ చేసేందుకు వచ్చాడు. అయితే హోటలంతా వెతికినా అతగాడికి చిల్లిగవ్వ కూడా దొరకలేదు. చోరీకి వచ్చిన చోట ఏమీ దొరక్కపోవడంతో జాలితో.. తన జేబులో నుంచి పర్సు తీసి, అక్కడ ఉన్న టేబుల్‌ మీద రూ.20 పెట్టి వెళ్లి పోయాడు. ఈ సంఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో జులై 18న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..

తెలంగాణాలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో స్థానికంగా ఎమ్మార్వో ఆఫీసు ముందు ఉన్న ఓ పెద్ద హోటల్‌లో దొంగతనానికి ఓ దొంగ చోరీకి స్కెచ్‌ వేశాడు. అనుకన్నట్లుగానే రాత్రి వేళ అందరూ నిద్రపోయాక గుట్టు చప్పుడు చేయకుండా హోటల్‌లోకి చొరబడ్డాడు. దొంగతనం చేస్తే వేలి ముద్రలు దొరకకూడదని చేతులకు గ్లౌజులు, కాళ్లకు బూట్లు, ముఖానికి మాస్క్‌ కూడా ధరించి పక్కాగా వచ్చాడు. లోపలికి వచ్చీరాగానే హోటల్‌ మొత్తం కలియతిరిగాడు. కానీ ఎక్కడా ఏమీ దొరకలేదు. దీంతో దొంగ మనసు తరుక్కుపోయింది. బిల్‌ కౌంటర్‌ను ఎన్నిసార్లు వెతికినా చిల్లిగవ్వ కూడా రాలలేదు. ఎంత వెతికినా లాభం లేదనుకుని బయటకు వెళ్లడానికి నిశ్చయించుకున్నాడు.

ఇవి కూడా చదవండి

వెళ్తూ వెళ్తూ అక్కడ ఉన్న ఫ్రిజ్‌ దగ్గరికి వెళ్లి కనీకసం తినడానికైనా ఏమైనా దొరుకుతుందేమోనని చూశాడు. అక్కడా ఏం లేకపోవడంతో.. ఓ వాటర్‌ బాటిల్‌ను తీసుకున్నాడు. నేరుగా బిల్‌కౌంటర్‌ దగ్గర ఉన్న సీసీ కెమెరా వద్దకు వచ్చి.. దూకుడు మువీలో బ్రహ్మనందం పెన్‌ కెమెరాలో నాగార్జునతో మాట్లాడినట్టుగా ఇలా మాట్లాడాడు. ‘మీ హోటల్‌లో వాటర్‌ బాటిల్ తప్ప ఇంకేం దొరకలేదు. మీ కష్టం నాకొద్దు. రూ. 20 ఇక్కడ పెట్టిపోతున్నా. ఎంజాయ్‌..’ అని చెప్పుకుంటూ వచ్చిన దారిలోనే ఈసురోమంటు వెళ్లిపోయాడు. హోటల్‌లోని సీసీ టీవీలో రికార్డు అయిన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్‌ అయింది. దీంతో సదరు మంచిదొంగ మానవత్వం వెలుగుచూసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లతో చెలరేగి పోతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే