AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ‘బ్రో.. డెత్ డ్రైవింగ్ అవసరమా?’ పుర్రె కారులో సిగరెట్‌ కాల్చుతూ.. రోడ్డుపై షికారు! వీడియో

మేధావులు కొత్తగా ఏమీ చెయ్యరు.. ఉన్న వాటినే కొత్తగా ఆవిష్కరిస్తారు.. అనే నానుడి వినే ఉంటారు. అచ్చం అలాంటి సీన్‌ మరోసారి రిపీట్‌ అయ్యింది. పాత వాహనాలకు కొన్ని మరమ్మత్తులు చేసి, కొత్తగా వినియోగించడమేకాకుండా అందులో ఓ అద్భుత సందేశాన్ని కూడా ఇస్తున్నారు ఈ తరం యువత. మూల చేరిన వాహనాలను పాత సామాన్లవారికి అమ్మేయకుండా.. సరికొత్త ట్రెండ్‌లను సృష్టిస్తున్నారు. పాత వాహనాలను కాస్త వైవిధ్యంగా మార్చి.. మళ్లీ వాడుకునేలా రూపొందిస్తున్నారు...

Viral Video: 'బ్రో.. డెత్ డ్రైవింగ్ అవసరమా?' పుర్రె కారులో సిగరెట్‌ కాల్చుతూ.. రోడ్డుపై షికారు! వీడియో
Human Skull Car
Srilakshmi C
|

Updated on: Jul 25, 2024 | 5:50 PM

Share

మేధావులు కొత్తగా ఏమీ చెయ్యరు.. ఉన్న వాటినే కొత్తగా ఆవిష్కరిస్తారు.. అనే నానుడి వినే ఉంటారు. అచ్చం అలాంటి సీన్‌ మరోసారి రిపీట్‌ అయ్యింది. పాత వాహనాలకు కొన్ని మరమ్మత్తులు చేసి, కొత్తగా వినియోగించడమేకాకుండా అందులో ఓ అద్భుత సందేశాన్ని కూడా ఇస్తున్నారు ఈ తరం యువత. మూల చేరిన వాహనాలను పాత సామాన్లవారికి అమ్మేయకుండా.. సరికొత్త ట్రెండ్‌లను సృష్టిస్తున్నారు. పాత వాహనాలను కాస్త వైవిధ్యంగా మార్చి.. మళ్లీ వాడుకునేలా రూపొందిస్తున్నారు. ఇలా పాత డొక్కు వాహనాలను మొబైల్‌ హోమ్‌లుగా మార్చడం నుంచి వెరైటీ డిజైన్లతో షోపీస్‌లను రూపొందించడం వరకు తమ ట్యాలెంట్‌కు ఆకాశమే హద్దుగా అద్భుతాలను సృష్టిస్తున్నారు. ఆ మధ్య ఓ వ్యక్తి పాత డొక్కు స్కూటర్‌ ముందు భాగానికి నవ్వుతున్న మనిషి పెయింటింగ్‌ వేసి.. కుక్క మొరుగుతున్నట్లుగా హారన్‌ సెట్ చేశాడు. అంతే.. అది రోడ్డు మీద వెళ్తుంటే అందరి చూపులూ దానివైపే సాగాయి.

ఇక తాజాగా మరొకరు తన షెడ్డులోని పాత బైకును ఏకంగా కారుగా మార్చేశాడు. అయితే అందుకు ఓ భారీ మనిషి పుర్రెను తయారు చేసి.. దాన్ని త్రీ వీలర్‌గా సెట్‌ చేసేశాడు. ఇలా పుర్రె కారును తయారు చేసి, రోడ్డుపై రయ్‌.. రయ్‌.. అంటూ పరుగులు పెట్టించాడు. అంతేకాదు.. ఈ పుర్రెకారు సిగరెట్‌ కూడా తాగుతుంది. అదేనండీ.. ప్రతి వాహనానికి వెనుక భాగంలో పొగగొట్టం ఉంటుంది కదా! కాకపోతే ఈ పుర్రెకారుకు మాత్రం కాస్త ముందుకు వచ్చింది. దాన్ని సిగరెట్‌ రూపంలో తయారు చేసి, సరిగ్గా పుర్రె నోట్లో కాలుతున్న సిగరెట్‌ మాదిరి మనోడు సెట్ చేసేశాడు. చూపరులకు మాత్రం మానవ పుర్రె రోడ్డుపూ వెళ్తూ.. సిగరెట్‌ తాగుతున్నట్లు, పొగ బాయటకు వదులుతున్నట్లు కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

‘పొగ ఎక్కడ నుండి వస్తోంది.. భయ్యా’. ‘నేను ఈ వాహనాన్ని నా పెళ్లికి తీసుకువెళ్తాను’, ‘బ్రో.. ఆల్రెడీ డెత్ డ్రైవింగ్ చేస్తున్నావ్’, ‘స్కల్‌వాలా’ అని ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు కామెంట్‌ సెక్షన్‌లో సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ఈ పుర్రె వాహనం చూస్తే.. మీకేం అనిపిస్తుంది?

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
మనం చేసిన మంచి ఎప్పుడూ వృధా కాదు.. నీతి కథ
మనం చేసిన మంచి ఎప్పుడూ వృధా కాదు.. నీతి కథ
ప్రముఖ హోటళ్లకు ఇలాంటి రొయ్యలు సప్లై చేస్తారట
ప్రముఖ హోటళ్లకు ఇలాంటి రొయ్యలు సప్లై చేస్తారట
Video: 6, 4, 6, 6.. ఇంగ్లాండ్‌లో వైభవ్ రచ్చ మాములుగా లేదుగా..!
Video: 6, 4, 6, 6.. ఇంగ్లాండ్‌లో వైభవ్ రచ్చ మాములుగా లేదుగా..!
ఫ్యాటీ లివర్ సమస్యలు.. ఏం తినాలి? ఏం తినకూడదో తెలుసా?
ఫ్యాటీ లివర్ సమస్యలు.. ఏం తినాలి? ఏం తినకూడదో తెలుసా?
ఓటీటీలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్.. ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు
ఓటీటీలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్.. ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత