Viral Video: ‘బాప్‌రే బ్రో.. అచ్చం అలాగే ఉన్నావ్’ క్యాంటీన్‌లో టీ కప్పులు కడుగుతున్న స్టార్ క్రికెటర్లు! వీడియో

ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటుంటారు. ఏడుగురు కాదు గానీ కళ్లెదుట ఒక వ్యక్తి పోలికలతో ఎవరైనా తారసపడితే మాత్రం మైండ్‌ బ్లాంక్‌ అవ్వడం ఖాయం. అలాంటి ఏకంగా స్టార్ క్రికెటర్ల పోలికలతో బయట ఎవరైనా తారసపడితే ఇంకేం ఉంది.. వీళ్లు అసలా, నకిళీయా అనే డౌట్‌ వెంటాడుతుంది. తాజాగా కొంతమంది భారత స్టార్ క్రికెటర్ల డోపెల్‌గేంజర్‌లకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది..

Viral Video: 'బాప్‌రే బ్రో.. అచ్చం అలాగే ఉన్నావ్' క్యాంటీన్‌లో టీ కప్పులు కడుగుతున్న స్టార్ క్రికెటర్లు! వీడియో
Doppelgangers Of Cricketers
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 19, 2024 | 10:30 AM

ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటుంటారు. ఏడుగురు కాదు గానీ కళ్లెదుట ఒక వ్యక్తి పోలికలతో ఎవరైనా తారసపడితే మాత్రం మైండ్‌ బ్లాంక్‌ అవ్వడం ఖాయం. అలాంటి ఏకంగా స్టార్ క్రికెటర్ల పోలికలతో బయట ఎవరైనా తారసపడితే ఇంకేం ఉంది.. వీళ్లు అసలా, నకిళీయా అనే డౌట్‌ వెంటాడుతుంది. తాజాగా కొంతమంది భారత స్టార్ క్రికెటర్ల డోపెల్‌గేంజర్‌లకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రెటీలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పలుమార్లు చక్కర్లు కొట్టాయి. వీరిలో బిగ్‌బీ అమితావ్ బచ్చన్, షారూఖ్ ఖాన్‌తో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు. తాజాగా శుభమాన్ గిల్, ఇషాన్ కిషన్, జస్‌ప్రీత్ బుమ్రా వంటి స్టార్‌ క్రికెటర్ల పోలికలు ఉన్న వ్యక్తుల వీడియోలను ఓ క్రికెట్‌ అభిమాని సేకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వైరల్ క్లిప్‌లో ఆస్ట్రేలియన్ స్పిన్నర్ ఆడమ్ జంపా, డోపెల్‌గేంజర్ కూడా ఉన్నారు.

ఈ వీడియోలో ఓ వ్యక్తి నవ్వుతూ కనిపిస్తాడు. అతడు చూసేందుకు అచ్చంగా శుభమాన్ గిల్ మాదిరి ఉన్నాడు. ఇక ఇషాన్ కిషన్‌ పోలి ఉన్న మరో వ్యక్తి క్రికెటర్‌ ఎలుక తోక హెయిర్‌స్టైల్‌తో సహా అచ్చుగుద్దినట్లు అలాగే ఉన్నాడు. కాకపోతే అతడు ఓ టీ వ్యాపారి. ఇంతలో జస్ప్రీత్ బుమ్రా మాదిరి ఉన్న మరో వ్యక్తి రెస్టారెంట్‌లో భోజనం తింటూ కనిపించాడు. ఆ తర్వాత ఆడమ్ జంపా ముఖ పోలికలతో ఉన్న మరో కుర్రాడు కూడా వీడియోలో కనిపించాడు. హెయిర్‌ స్టైల్‌తో సహా అచ్చం క్రికెటర్లకు జిరాక్స్‌ తీసినట్లు ఉన్న ఈ ముగ్గురికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పలువరు క్రికెట్ అభిమానులు కామెంట్‌ సెక్షన్‌లో భిన్నరీతిలో స్పందిస్తున్నారు. ‘డూప్లికేట్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ అవాస్తవం. ఇప్పుడు, నిజమైన విరాట్‌ను ఊహించుకోండి’ అని ఒక యూజర్‌, ‘ఆడమ్ జంపాకు మన దేశంలో కూడా డోపెల్‌గేంజర్ ఉంది’ అని మరో యూజర్‌ ఫన్నీ మీమ్‌లను కామెంట్‌ సెక్షన్‌ షేర్‌ చేశాడు.

ఇవి కూడా చదవండి

క్రికెట్‌ గురించి చెప్పాలంటే.. భారత్‌ టీ20 కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఇటీవలే తన మొదటి సిరీస్‌ను ముగించాడు. జింబాబ్వేతో జరిగిన ఐదు మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు. మెన్ ఇన్ బ్లూ ఓపెనింగ్ T20Iలో ఓడిపోయింది. కానీ ఆ తర్వాత మ్యాచ్‌లలో తిరిగి పుంజుకుని ఎవే సిరీస్‌లో భారత జట్టు 4-1తో విజయం సాధించింది. ఇక జింబాబ్వే పర్యటనలో జస్ప్రీత్ బుమ్రా పాల్గొనలేదు. T20I ప్రపంచ కప్‌లో బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఐసీసీ టోర్నీలో బుమ్రా 15 వికెట్లు పడగొట్టి, 17 ఏళ్ల తర్వాత భారత్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే, ఇషాన్ కిషన్ గతేడాది నవంబర్ నుంచి బ్లూ జెర్సీని ధరించింది లేదు. అతను ఇటీవల BCCI సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కూడా కోల్పోయిన సంగతి తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..