JNTU Hyderabad: జేఎన్‌టీయూ హాస్టల్‌ ఫుడ్‌లో మొన్న ఎలుక.. నిన్న పిల్లి.. నేడు పురుగులు! ఇలాగైతే ఎలా చదివేది?

జేఎన్‌టీయూ హైదరాబాద్‌ హాస్టళ్లలో విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చణీయాంశంగా మారింది. మొన్నటికి మొన్న విద్యార్ధుల భోజనంలో ఎలుక ఈత కొడుతూ దర్శనమిచ్చింది. ఇక నిన్నేమో విద్యార్థులకు వడ్డించాల్సిన భోజనం పాత్రల్లోకి వెళ్లి పిల్లి ఒక్కో ఐటెం ను రుచి చూస్తోంది. ఈ రోజు భోజనంలో పురుగులు ప్రత్యక్ష మయ్యాయి. ఇలా రోజుకో వివాదం తెరపైకి రావడంతో జేఎన్‌టీయే హాస్టల్‌ విద్యార్ధులు..

JNTU Hyderabad: జేఎన్‌టీయూ హాస్టల్‌ ఫుడ్‌లో మొన్న ఎలుక.. నిన్న పిల్లి.. నేడు పురుగులు! ఇలాగైతే ఎలా చదివేది?
Jntu Hyderacd Hostel Food
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 18, 2024 | 9:21 AM

కూకట్‌పల్లి, జులై 18: జేఎన్‌టీయూ హైదరాబాద్‌ హాస్టళ్లలో విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చణీయాంశంగా మారింది. మొన్నటికి మొన్న విద్యార్ధుల భోజనంలో ఎలుక ఈత కొడుతూ దర్శనమిచ్చింది. ఇక నిన్నేమో విద్యార్థులకు వడ్డించాల్సిన భోజనం పాత్రల్లోకి వెళ్లి పిల్లి ఒక్కో ఐటెం ను రుచి చూస్తోంది. ఈ రోజు భోజనంలో పురుగులు ప్రత్యక్ష మయ్యాయి. ఇలా రోజుకో వివాదం తెరపైకి రావడంతో జేఎన్‌టీయే హాస్టల్‌ విద్యార్ధులు అష్టకష్టాలు పడుతున్నారు.తాజాగా గౌతమి వసతిగృహంలో బుధవారం భోజనంలో పురుగులు కనిపించడం తీవ్ర కలకలం సృష్టించింది. ఇద్దరు విద్యార్థుల ప్లేట్లలో రెండు పురుగులు కనిపించాయి. దీంతో ఆ భోజనం చేసేందుకు విద్యార్థులు భయపడ్డారు. జూన్‌ 15న అన్నం, మజ్జిగ పాత్రల్లో పిల్లి మూతిపెట్టిన వీడియో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.

విద్యార్థులకు అందించాల్సిన భోజనం విషయంలో ఇంత నిర్లక్ష్యమా అంటూ జేఎన్టీయూ విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టళ్లలో పరిసరాలు పరిశుభ్రత, హాస్టల్ క్యాంటీన్ల నిర్వహణలో లోపాలు రోజుకొకటి బయటికి వస్తున్నా.. జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో హాస్టల్ మెయింటెనెన్స్‌పై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఎన్నోసార్లు హాస్టల్‌ ఫుడ్‌లో పురుగులు కనిపించాయి. మెస్‌ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతపై విద్యార్ధులు పలుమార్లు యాజమన్యానికి ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదంటూ వాపోతున్నారు.

తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు జేఎన్టీయూ కూకట్‌పల్లి హాస్టల్‌లో తనిఖీలు చేయగా.. అక్కడి క్యాంటీన్ నిర్వహణ పరమ చెత్తగా ఉందని తేల్చారు. వంటగదిలో ఎక్కడిపడితే అక్కడ కూరగాయల వ్యర్థాలు ఉన్నట్లు గుర్తించారు. విద్యార్ధులకు నాణ్యతలేని ఆహారం ఇవ్వడంలేదనీ, హాస్టల్ గదుల్లోకి క్రిమి కీటకాలు రాకుండా నిరోధించే ఎలాంటి ఏర్పాట్లు లేవని గుర్తించారు. FSSAI లేకుండా క్యాంటీన్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నిత్యం ఇలాంటి సంఘటనలు ఎన్ని వెలుగు చూస్తున్నా అధికారుల్లో మాత్రం ఇసుమంతైనా మార్పురాకపోవడం విశేషం. దీంతో ఆధికారులు తమ గోడు వినే నాథుడులేక, పురుగుల భోజనం తినలేక నానాయాతన పడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.