Hyderabad ప్రాణాలే పణంగా పెట్టిన ట్రాఫిక్ పోలిస్.. ఆయన చేసిన పనికి దక్కిన అరుదైన గౌరవం!
విధి నిర్వహణలో సమయ స్ఫూర్తిని ప్రదర్శించిన ఓ కానిస్టేబుల్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఇలాగే తెగువను కొనసాగించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సూచించారు. వ్యక్తి ప్రాణాలు కాపాడిన వనస్థలిపురం ట్రాఫిక్ సిబ్బందిని రాచకొండ కమిషనరేట్‌లో ఘనంగా సత్కరించారు సీపీ.

జూలై 15వ తేదీన మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లేలగుడా RCI రోడ్డు వద్ద అనుహ్య ఘటన చోటు చేసుకుంది. వెంకటేష్ అనే వ్యక్తి తన మహేంద్ర KUV కారులో కడ్తాల్ వెళ్తున్నారు. అదే సమయంలో ఏసీ నుండి అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. అది గమనించిన అక్కడే విధులు నిర్వహిస్తున్న వనస్థలిపురం ట్రాఫిక్ సిబ్బంది నర్సింగ్ రావు, కృష్ణ, సాయిరామ్ స్పందించారు. కారు నడుపుతున్న వ్యక్తిని అప్రమత్తం చేసి, కారు ఆపి అతని ప్రాణాలు కాపాడారు.
ఒకసారిగా కారు మొత్తం మంటలు వ్యాప్తి చెందడటంతో డ్రైవర్ వెంకటేష్‌ను కింది దించేశార. అటుగా వాహనాలు వెళ్లకుండా అప్రమత్తమయ్యారు. దీంతో ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు. వెంటనే ఫైర్ సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఆలస్యం చేయకుండా, అటుగా వెళుతున్న ఒక వాటర్ ట్యాంకర్ సహాయంతో మంటలు అదుపులోకి తీసుకువచ్చేదుకు శ్రమించారు. తక్షణమే స్పందించి, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా వ్యవహరించిన ట్రాఫిక్ సిబ్బంది సమయస్ఫూర్తిని పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అభినందించారు. ఇక ముందు కూడా విధి నిర్వహణలో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..