Watch Video: రద్దీ బస్సులో RTC కండక్టర్ పశువాంఛ.. 21 ఏళ్ల యువతితో అసభ్య ప్రవర్తన! వీడియో

హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. బస్సురద్దీగా ఉండటంతో బస్సు కండక్లర్ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే బస్సు రద్దీగా ఉందికదా ఏదో పొరబాటున జరిగి ఉంటుందని యువతి తొలుత భావించింది. కానీ ఇదే అదనుగా రెచ్చిపోయిన కండక్టర్ మరోసారి ఆమెను అభ్యంతరకరంగా తాకడంతో యువతి ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. ఈ దారుణ ఘటన హిమాయత్‌నగర్‌కు వెళ్లే రూట్లో..

Watch Video: రద్దీ బస్సులో RTC కండక్టర్ పశువాంఛ.. 21 ఏళ్ల యువతితో అసభ్య ప్రవర్తన! వీడియో
TGSRTC Bus conductor misbehaviour
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 17, 2024 | 12:43 PM

హైదరాబాద్‌, జులై 17: హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. బస్సురద్దీగా ఉండటంతో బస్సు కండక్లర్ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే బస్సు రద్దీగా ఉందికదా ఏదో పొరబాటున జరిగి ఉంటుందని యువతి తొలుత భావించింది. కానీ ఇదే అదనుగా రెచ్చిపోయిన కండక్టర్ మరోసారి ఆమెను అభ్యంతరకరంగా తాకడంతో యువతి ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. ఈ దారుణ ఘటన హిమాయత్‌నగర్‌కు వెళ్లే రూట్లో టీజీఎస్‌ ఆర్టీసీ బస్సులో చోటు చేసుకుంది. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సదరు మహిళ ఎక్స్ ఖాతాలో ట్వీట్‌ చేయడంతో కండక్టర్‌ నీచ బుద్ధి వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..

హిమాయత్‌ నగర్‌కు వెళ్తున్న బస్సులో కండక్టర్ వల్ల తనకు ఎదురైన చేదు అనుభవాన్ని 21 ఏళ్ల యువతి ట్విట్టర్ ద్వారా పంచుకుంది. ఈ ట్వీట్‌ను సీఎం రేవంత్ రెడ్డికి, టీజీఎస్ ఆర్టీసీఎండీ సజ్జనార్‌కు, కేటీఆర్‌తో పాటు షీటీమ్స్‌కు ట్యాగ్ చేసింది. ఆమె తన ట్వీట్‌లో ఈ విధంగా రాసుకొచ్చింది.. నా వయసు 21 ఏళ్లు. నేను మణి కొండ నుంచి హిమాయత్‌ నగర్‌కు తిరిగి వెళ్తున్నాను. మెహిదీపట్నంలో 64M/123 బస్సు ఎక్కాను. బస్సు చాలా రద్దీగా ఉంది. ఇదే అదనుగా కండక్టర్‌ అవకాశం తీసుకున్నాడు. బస్సు రద్దీని అవకాశంగా తీసుకుని టిక్కెట్‌ కండక్టర్‌ నా చాతిని తాకాడు. పొరబాటున చేయి తగిలి ఉంటుందని తొలుత భావించాను. కానీ ఆ తర్వాత నా ప్రైవేట్‌ భాగాలను తాకడం ప్రారంభించాడు. నేను బిగ్గరగా అరిచాను. ఈ ఘటన ఉదయం 8 గంటలకు.. అందరి ముందే జరిగింది. ఏ అమ్మాయి కూడా మౌనంగా ఉండకూడదు. ఇలా ఆ కండక్టర్ వల్ల ఇంకెంత మంది టీనేజ్ అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నాడో. ప్రభుత్వం దీనిపై కచ్చితంగా స్పందించాలి. ఓ ఒక్క అమ్మాయి మౌనంగా ఇబ్బంది పడొద్దంటూ బాధితురాలు.. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ట్విట్టర్‌లో తెలిపింది. ట్వీట్‌తోపాటు ఆమె తీసిన ఓ వీడియోను, టికెట్‌ను కూడా ఆమె షేర్‌ చేసింది. ఈ ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరోవైపు యువతి ట్వీట్‌పై టీజీఆర్‌టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, వైస్‌ చైర్మన్‌ వీసీ సజ్జనార్‌ స్పందించారు. కండక్టర్‌పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగకుండా డ్రైవర్లు, కండక్టర్లకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు. TGSRTC అధికారుల చొరవతో సైబరాబాద్ కమిషనరేట్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో బాధిత యువతి కూడా ఫిర్యాదు చేసినట్లు TSRTC MD సజ్జనార్‌ ట్వీట్ చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.