Andhra Pradesh: బడి నుంచి వెళ్లిన ఏడో తరగతి బాలిక అనుమానాస్పద మృతి.. గ్యాస్‌ డెలివరీ బాయ్‌ ఇంట్లో మృతదేహం!

గుంటూరు జిల్లా చేబ్రోలులోని కొత్తరెడ్డిపాలేనికి చెందిన బాలిక శైలజ (13) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కొత్త రెడ్డిపాలెంలోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న బాలిక.. రోజు మాదిరిగానే ఉదయం స్కూల్ కి వెళ్లి అనారోగ్యంగా ఉందంటూ స్కూల్ నుండి వెళ్లిపోయింది. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. స్కూల్ టైం గడిచిపోయినా బాలిక తిరిగిరాకపోవడంతో బంధువులు, తల్లిదండ్రులు గ్రామంలో పలుచోట్ల వెదకగా..

Andhra Pradesh: బడి నుంచి వెళ్లిన ఏడో తరగతి బాలిక అనుమానాస్పద మృతి.. గ్యాస్‌ డెలివరీ బాయ్‌ ఇంట్లో మృతదేహం!
7th Class Student Suspecious Death In Chebrolu
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 16, 2024 | 9:21 AM

చేబ్రోలు, జులై 15: గుంటూరు జిల్లా చేబ్రోలులోని కొత్తరెడ్డిపాలేనికి చెందిన బాలిక శైలజ (13) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కొత్త రెడ్డిపాలెంలోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న బాలిక.. రోజు మాదిరిగానే ఉదయం స్కూల్ కి వెళ్లి అనారోగ్యంగా ఉందంటూ స్కూల్ నుండి వెళ్లిపోయింది. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. స్కూల్ టైం గడిచిపోయినా బాలిక తిరిగిరాకపోవడంతో బంధువులు, తల్లిదండ్రులు గ్రామంలో పలుచోట్ల వెదకగా.. అదే గ్రామంలోని గ్యాస్‌ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో అనుమానాస్పద రీతిలో విగతజీవిగా పడివుంది. కూతురు మరణాన్ని తట్టుకోలేక కుటుంబీకులు తల్లడిల్లిపోయారు. ఆమె మెడపై గాయాలు కనబడటంతో అత్యాచారం, హత్యగా స్థానికులు భావిస్తున్నారు. మరోవైపు అదే ఇంట్లో ఉంటున్న నాగరాజు పరారీలో ఉన్నాడు. అసలేం జరిగిందంటే..

కొత్తరెడ్డిపాలేనికి చెందిన ఎస్సీ బాలిక శైలజ, ఆమె అన్నయ్య సోమవారం ఉదయం రోజు మాదిరిగానే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లారు. బడి ముగియగానే బాలుడొక్కడే ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చిన బాలుడిని చెల్లి ఏదని తల్లి ప్రశ్నింయింది. దీంతో ఆ బాలుడు వెంటనే పాఠశాలకు వెళ్లి, ఉపాధ్యాయులను అడిగాడు. ఒంట్లో బాగోలేదని శైలజ మధ్యాహ్నం వెళ్లిపోయినట్లు వారు చెప్పారు. దీంతో తల్లీ కుమారుడు ఊరంతా వెతికారు. ఆ క్రమంలో గ్యాస్‌ డెలివరీ బాయ్‌ నాగరాజు ఇంటి వద్ద శైలజ కాలి చెప్పులు ఉండటాన్ని వారు గమనించారు. కిటికీలో నుంచి చూడగా శైలజ గదిలో విగతజీవిగా కనిపించింది.

ఈ విషయాన్ని బాలుడు, తల్లి తమ కుటుంబసభ్యులకు తెలిపారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని, ఇంటి తాళం పగలగొట్టి, బాలికను బయటకు తీసుకొచ్చారు. దీనిపో పోలీసులకు సమాచారం అందించగా.. అక్కడికి చేరుకున్న పోలీసులు బాలికను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అయితే అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో తీవ్ర ఆవేధనకు గురైన మృతురాలి బంధువులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. బాలికను హత్య చేసిన నిందితుడు నాగరాజును కఠినంగా శిక్షించాలని, ఆమెను ఒంటరిగా బడి నుంచి బయటకు పంపిన ఉపాధ్యాయులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాగా నిందితుడు నాగరాజుకు అప్పటికై పెళ్లైంది. అయితే భార్యతో విభేదాల కారణంగా గత మూడేళ్లుగా ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడని స్థానికులు తెలిపారు. బాలిక తల్లిదండ్రులు నాగరాజుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేబ్రోలు పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. తెనాలి డిఎస్పి రమేష్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. పరారీలో ఉన్న నిందితుడిని త్వరలోనే పట్టుకుని అరెస్ట్‌ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.