Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: తెల్లారేసరికి గుడికొచ్చిన పూజారి ఎదుట మైండ్ బ్లాంక్ అయ్యే సీన్.. తలుపు తెరిచి చూడగా

AP News: తెల్లారేసరికి గుడికొచ్చిన పూజారి ఎదుట మైండ్ బ్లాంక్ అయ్యే సీన్.. తలుపు తెరిచి చూడగా

Ravi Kiran

|

Updated on: Jul 16, 2024 | 9:51 AM

తెనాలి మండలం పెదరావూరులోని శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో భారీ చోరీ జరిగింది. గత రాత్రి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు.. గర్భాలయంలోకి ప్రవేశించి సుమారు రూ. 2 లక్షలు విలువైన అమ్మవారి బంగారు అభయ హస్తాలు..

తెనాలి మండలం పెదరావూరులోని శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో భారీ చోరీ జరిగింది. గత రాత్రి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు.. గర్భాలయంలోకి ప్రవేశించి సుమారు రూ. 2 లక్షలు విలువైన అమ్మవారి బంగారు అభయ హస్తాలు, పాదాలు, బంగారు కళ్లు, మంగళ సూత్రాలు, బొట్టు అపహరించుకుని వెళ్లిపోయారు. అయితే శివుని నాగాభరణాలు, పానపట్టం వంటి సుమారు పది లక్షల విలువ చేసే వెండి ఆభరణాలు అపహరణకు యత్నించి.. మోయలేక అక్కడే వదిలేసి పారిపోయారు దొంగలు. రెండు లక్షలు విలువ చేసే అమ్మవారి ఆభరణాలు మాత్రం అపహరణకు గురయ్యాయని పోలీసులు తేల్చారు. సీసీ కెమెరాలు సైతం వైర్లు ధ్వంసం చేసి హార్డ్ డిస్కులను కూడా ఎత్తుకెళ్ళారు దుండగులు. ఇదే దేవాలయంలో గతంలో రెండుసార్లు చోరీకి విఫలయత్నం చేశారు దుండగులు. తాజాగా మూడోసారి భారీ చోరీ జరగడంతో స్థానికులలో భయాందోళన నెలకొంది. గత మూడు రోజుల క్రితం భట్టిప్రోలు, వెల్లటూరు గ్రామాలతో సహా కృష్ణాజిల్లాలోని పలు ఆలయాల్లో చోరీ చేసిన ముఠా పనిగా అనుమానిస్తున్నారు స్థానికులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..