ఎమ్మెల్యేనే ప్రశ్నిస్తావా అంటూ యువకుడిపై థర్డ్ డిగ్రీ !!
ఎమ్మెల్యేనే ప్రశ్నిస్తావా? సోషల్ మీడియాలో పోస్టులు పెడతావా అంటూ ఎస్‌ఐ చితకబాదాడంటూ ఓ యువకుడు ఆరోపించడం సంచలనంగా మారింది. పాలకుర్తి నియోజకవర్గంలో పొలిటికల్ పంచాయతీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఇప్పటికే నియోజకవర్గంలో MLA వర్గానికీ, మాజీ మంత్రి ఎర్రబెల్లి వర్గానికీ మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఈ టైమ్‌లో ఓ రాజకీయ పోస్టు అగ్గి రాజేయడం, ఆ పోస్టు పెట్టిన వ్యక్తిని SI చితకబాదారనే ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.
ఎమ్మెల్యేనే ప్రశ్నిస్తావా? సోషల్ మీడియాలో పోస్టులు పెడతావా అంటూ ఎస్‌ఐ చితకబాదాడంటూ ఓ యువకుడు ఆరోపించడం సంచలనంగా మారింది. పాలకుర్తి నియోజకవర్గంలో పొలిటికల్ పంచాయతీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఇప్పటికే నియోజకవర్గంలో MLA వర్గానికీ, మాజీ మంత్రి ఎర్రబెల్లి వర్గానికీ మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఈ టైమ్‌లో ఓ రాజకీయ పోస్టు అగ్గి రాజేయడం, ఆ పోస్టు పెట్టిన వ్యక్తిని SI చితకబాదారనే ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. ఈ వివాదంలో తొర్రూరు ఎస్‌ఐ జగదీష్‌పై ఆరోపణలు వచ్చాయి. పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఆయన తనపై థర్డ్‌డిగ్రీ ప్రయోగించాడని ఓ యువకుడు ఆరోపిస్తున్నారు. పాలకుర్తి MLA పీఏ ముందే తనను చిత్రహింసలు పెట్టినట్టు చెబుతున్నాడు బాధితుడు. పాలకుర్తి MLA యశస్వినిరెడ్డిని ప్రశ్నిస్తూ ఇటీవల మాలోతు సురేష్ కొన్ని పోస్టులు పెట్టారు. ఎమ్మెల్యేనే ప్రశ్నిస్తావా అంటూ తనను పీఎస్‌కి తీసుకెళ్లి కొట్టారని సురేష్ ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతం నడవలేని స్థితిలో బాధితుడు మాలోతు సురేష్ ఉన్నారు. ఎస్సై జగదీష్‌ను ఉద్యోగం నుంచి తొలగించాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Manchu Vishnu: తెలుగు యూట్యూబర్‌లకు.. మంచు విష్ణు వార్నింగ్ !!
ఎయిర్‌పోర్ట్ సిబ్బంది చెంప చెళ్లుమనిపించిన మహిళ అరెస్ట్
తుపాకీ గురిపెట్టి.. వంట చేయించుకున్న ఉగ్రవాదులు