చెల్లెలి మృతదేహాన్ని 5 కి.మీ. భుజంపై మోసుకెళ్లిన అన్నలు
ఉత్తరప్రదేశ్ లోని లఖీంపూర్ ఖేరీ జిల్లాలో గుండెల్ని పిండేసే ఘటన చోటుచేసుకుంది. టైఫాయిడ్ బారిన పడిన ఓ టీనేజ్ బాలిక మెరుగైన వైద్యం అందక చనిపోవడంతో ఆమె మృతదేహాన్ని ఇద్దరు సోదరులు భుజంపై మోసుకుంటూ ఏకంగా 5 కిలోమీటర్లు నడిచిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. లఖీంపూర్ ఖేరీ జిల్లాలోని పాలియాలో శివానీ అనే బాలిక తన ఇద్దరు సోదరులతో కలిసి నివసిస్తూ 12వ తరగతి చదువుతోంది.
ఉత్తరప్రదేశ్ లోని లఖీంపూర్ ఖేరీ జిల్లాలో గుండెల్ని పిండేసే ఘటన చోటుచేసుకుంది. టైఫాయిడ్ బారిన పడిన ఓ టీనేజ్ బాలిక మెరుగైన వైద్యం అందక చనిపోవడంతో ఆమె మృతదేహాన్ని ఇద్దరు సోదరులు భుజంపై మోసుకుంటూ ఏకంగా 5 కిలోమీటర్లు నడిచిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. లఖీంపూర్ ఖేరీ జిల్లాలోని పాలియాలో శివానీ అనే బాలిక తన ఇద్దరు సోదరులతో కలిసి నివసిస్తూ 12వ తరగతి చదువుతోంది. రెండు రోజుల కిందట శివానీ టైఫాయిడ్ బారినపడింది. ఆమెను సోదరులు స్థానిక వైద్యుడికి చూపించగా మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆసుపత్రికి తరలించాలని సూచించారు. కానీ కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా పాలియాలోని రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. శారదా నది ఉప్పొంగడంతో జిల్లా కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. వాహన రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈలోగా ఆమె పరిస్థితి విషమించింది. ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే దారిలో మరణించింది. దీంతో ఇక చేసేదిలేక సోదరులు విలపిస్తూనే ఆమె మృతదేహన్ని 5 కిలోమీటర్లమేర భూజాన మోసుకుంటూ తిరిగి ఇంటికి తీసుకెళ్లారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోజుకు ఒక్కసారైనా నవ్వాలి.. జపాన్‌లో చట్టం
పాడుబడ్డ బావిలో వింత శబ్దాలు.. ఏంటని తొంగి చూసిన వారికి మైండ్ బ్లాక్
గుడ్‌న్యూస్.. వందేభారత్ స్లీపర్ వచ్చేస్తోంది.. ఈ రూట్లోనే !!
ప్రయాణికులకు అలర్ట్ !! ఈ రైళ్ల ప్రయాణ సమయాలు మారుతున్నాయ్
స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతుండగా విద్యుత్‌షాక్ !! చివరికి ఏమైందంటే ??
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

