పాడుబడ్డ బావిలో వింత శబ్దాలు.. ఏంటని తొంగి చూసిన వారికి మైండ్ బ్లాక్

పాడుబడ్డ బావిలో వింత శబ్దాలు.. ఏంటని తొంగి చూసిన వారికి మైండ్ బ్లాక్

Phani CH

|

Updated on: Jul 15, 2024 | 6:22 PM

పిల్లిని చూస్తే ఎలుకకి ప్రాణ భయం.. కుక్కను చూస్తే పిల్లికి హడల్‌.. ఇలా ప్రతి జంతువు మరొక జంతువును చూస్తే ప్రాణభయంతో పారిపోవడం సాధారణం. కానీ ఒకేజాతికి చెందిన రెండు జీవుల మధ్య కూడా ఇలాంటి భయం ఉంటుందా.. ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే ఓ కింగ్‌ కోబ్రా ను చూసిన జెర్రిపోతు ప్రాణ భయంతో దాన్నుంచి తప్పించుకునే క్రమంలో బావిలో పడిపోయింది. అయినా ఆ కింగ్‌ కోబ్రా దానిని వదల్లేదు. వెంటపడింది.

పిల్లిని చూస్తే ఎలుకకి ప్రాణ భయం.. కుక్కను చూస్తే పిల్లికి హడల్‌.. ఇలా ప్రతి జంతువు మరొక జంతువును చూస్తే ప్రాణభయంతో పారిపోవడం సాధారణం. కానీ ఒకేజాతికి చెందిన రెండు జీవుల మధ్య కూడా ఇలాంటి భయం ఉంటుందా.. ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే ఓ కింగ్‌ కోబ్రా ను చూసిన జెర్రిపోతు ప్రాణ భయంతో దాన్నుంచి తప్పించుకునే క్రమంలో బావిలో పడిపోయింది. అయినా ఆ కింగ్‌ కోబ్రా దానిని వదల్లేదు. వెంటపడింది. చివరికి రెండూ ఆపదలో పడ్డాయి. ఒకరు ప్రాణం కోల్పోయారు.. మరొకరిని స్నేక్‌ క్యాచర్‌ కాపాడాడు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లాలోని వి.మాడుగుల గ్రామ శివారు పోతల ఈశ్వరరావు అనే రైతుకు బావిలో ఏదో శబ్దం వినిపించింది. ఏమై ఉంటుందా అని బావిలోకి చూసిన అతనికి రెండు పాములు కనిపించాయి. ఓ పాము ప్రాణాలు కోల్పోయి పైకి తేలుతున్నట్టు ఉంది. ఆ పక్కనే.. మరో భారీ పాము బావి నుంచి బయట పడేందుకు ప్రయత్నం చేస్తుంది. సుమారు 12 అడుగుల గిరినాగు జెర్రిపోతు వెంటాడుతూ బావిలో పడిపోయాయి. అది చూసిన రైతు ఒక్కసారి భయభ్రాంతులకు గురయ్యాడు. అయినా ఆ పామును ప్రాణాపాయం నుంచి తప్పించ్చాలనుకున్నాడు. ఫారెస్ట్ అధికారులు, స్నేక్ క్యాచర్ వెంకటేష్ కి సమాచారం అందించాడు ఆ రైతు . సమాచారం అందుకున్న వెంకటేష్ ఘటనా స్థలికి చేరుకున్నాడు. దాదాపు రెండు గంటలు పాటు శ్రమించి అతి కష్టం మీద భారీ కింగ్ కోబ్రా ను బావి నుంచి బయటకు తీసారని రైతు ఈశ్వర్ తెలిపాడు. రెస్క్యూ చేసిన గిరినాగును సమీపంలోనే అడవుల్లో విడిచిపెట్టారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుడ్‌న్యూస్‌.. వందేభారత్‌ స్లీపర్‌ వచ్చేస్తోంది.. ఈ రూట్లోనే !!

ప్రయాణికులకు అలర్ట్‌ !! ఈ రైళ్ల ప్రయాణ సమయాలు మారుతున్నాయ్‌

స్విమ్మింగ్‌ పూల్‌లో ఈత కొడుతుండగా విద్యుత్‌షాక్‌ !! చివరికి ఏమైందంటే ??