గుడ్‌న్యూస్‌.. వందేభారత్‌ స్లీపర్‌ వచ్చేస్తోంది.. ఈ రూట్లోనే !!

ప్రస్తుతం దేశమంతా వందేభారత్ సర్వీసులకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. దీంతో ఇండియన్ రైల్వేస్.. వచ్చే నెల నుంచి వందేభారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్ నుంచి తొలి వందేభారత్ స్లీపర్ రైలు పరుగులుపెట్టే అవకాశం ఉందట. ఈ రైలు సికింద్రాబాద్ టూ ముంబై నగరాల మధ్య నడుస్తుందని తెలుస్తోంది. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎంకి సూచించారు.

గుడ్‌న్యూస్‌.. వందేభారత్‌ స్లీపర్‌ వచ్చేస్తోంది.. ఈ రూట్లోనే !!

|

Updated on: Jul 15, 2024 | 6:21 PM

ప్రస్తుతం దేశమంతా వందేభారత్ సర్వీసులకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. దీంతో ఇండియన్ రైల్వేస్.. వచ్చే నెల నుంచి వందేభారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్ నుంచి తొలి వందేభారత్ స్లీపర్ రైలు పరుగులుపెట్టే అవకాశం ఉందట. ఈ రైలు సికింద్రాబాద్ టూ ముంబై నగరాల మధ్య నడుస్తుందని తెలుస్తోంది. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎంకి సూచించారు. ఈ మేరకు ఆయన రైల్వే బోర్డుకు ప్రతిపాదన పంపించారని తెలిసింది. అటు సికింద్రాబాద్-పూణే మధ్య నడిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానంలో వందేభారత్ సిట్టింగ్ రైలు రానున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం కాచిగూడ-బెంగళూరు మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. దీంతో ఆ రైలుకు 8 బదులుగా 16 కోచ్‌లకు పెంచాలన్న డిమాండ్‌ను దక్షిణ మధ్య రైల్వే పరిశీలిస్తోంది. అటు తిరుపతి-నిజామాబాద్ మధ్య నడుస్తోన్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్.. ఇకపై బోధన్ వరకు వెళ్లనుంది. అంతేకాకుండా సికింద్రాబాద్-రాజ్‌కోట్ మధ్య రాకపోకలు సాగిస్తోన్న రాజ్‌కోట్‌ ఎక్స్‌ప్రెస్‌‌ను కచ్ జిల్లా వరకు పొడిగించాలని.. ఆ ప్రాంత వాసులు కోరగా.. దక్షిణ మధ్య రైల్వే జీఎం ఈ ప్రతిపాదనపై కూడా పరిశీలన జరుగుతోందని వివరించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రయాణికులకు అలర్ట్‌ !! ఈ రైళ్ల ప్రయాణ సమయాలు మారుతున్నాయ్‌

స్విమ్మింగ్‌ పూల్‌లో ఈత కొడుతుండగా విద్యుత్‌షాక్‌ !! చివరికి ఏమైందంటే ??

Follow us
ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఆర్మీ.. ఈ ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్..
ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఆర్మీ.. ఈ ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్..
ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా
ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా
తెరపైకి సరికొత్త చర్చ.. ఆ పార్టీలో మొదలైన ప్రోటోకాల్ రచ్చ..
తెరపైకి సరికొత్త చర్చ.. ఆ పార్టీలో మొదలైన ప్రోటోకాల్ రచ్చ..
చూడ ముచ్చటైన డిజైన్‌తో సీఎమ్‌ఎఫ్‌ ఇయర్‌ బడ్స్‌..
చూడ ముచ్చటైన డిజైన్‌తో సీఎమ్‌ఎఫ్‌ ఇయర్‌ బడ్స్‌..
ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణం.. పట్టు తప్పితే అంతే సంగతులు..
ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణం.. పట్టు తప్పితే అంతే సంగతులు..
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. పంత్ ఔట్?
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. పంత్ ఔట్?
కాంగ్రెస్ గూటికి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి..
కాంగ్రెస్ గూటికి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి..
Controversy:వివాదస్పదమైన టీమిండియా మాజీ క్రికెటర్ల స్టెప్పులు..
Controversy:వివాదస్పదమైన టీమిండియా మాజీ క్రికెటర్ల స్టెప్పులు..
ఢిల్లీలో ఘనంగా జగన్నాథుని రథోత్సవం.. పాల్గొన్న కేంద్ర మంత్రులు..
ఢిల్లీలో ఘనంగా జగన్నాథుని రథోత్సవం.. పాల్గొన్న కేంద్ర మంత్రులు..
కూతురు శిక్షణ కోసం కారు, భూమిని అమ్మేసిన తండ్రి.. కట్‌చేస్తే
కూతురు శిక్షణ కోసం కారు, భూమిని అమ్మేసిన తండ్రి.. కట్‌చేస్తే