ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది చెంప చెళ్లుమ‌నిపించిన మహిళ అరెస్ట్‌

ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది చెంప చెళ్లుమ‌నిపించిన మహిళ అరెస్ట్‌

Phani CH

|

Updated on: Jul 15, 2024 | 6:35 PM

జైపూర్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది చెంప ఛెళ్లుమనిపించిన స్పైస్‌జెట్ మహిళా ఉద్యోగినిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఉద్యోగినికి ఎయిర్‌లైన్స్ సంస్థ అండ‌గా నిలిచింది. సీఐఎస్‌ఎఫ్‌ అధికారి ఆమెప లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. ఆమెకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఇచ్చిన ఎంట్రీ పాస్ కూడా ఉందని పేర్కొంది. సదరు పోలీసు అధికారి అనుచితంగా ప్రవర్తించాడ‌ని, అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించాడ‌ని తెలిపింది.

జైపూర్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది చెంప ఛెళ్లుమనిపించిన స్పైస్‌జెట్ మహిళా ఉద్యోగినిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఉద్యోగినికి ఎయిర్‌లైన్స్ సంస్థ అండ‌గా నిలిచింది. సీఐఎస్‌ఎఫ్‌ అధికారి ఆమెప లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. ఆమెకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఇచ్చిన ఎంట్రీ పాస్ కూడా ఉందని పేర్కొంది. సదరు పోలీసు అధికారి అనుచితంగా ప్రవర్తించాడ‌ని, అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించాడ‌ని తెలిపింది. డ్యూటీ తరువాత తన ఇంటికి రావాలని తమ ఉద్యోగినిని సదరు అధికారి కోరినట్టు ప్రకటన విడుదల చేసింది. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఉద్యోగిని తరపున ఎయిర్‌‌లైన్స్ పోలీసులను ఆశ్రయించింది. ఆమెకు పూర్తి అండ‌గా ఉంటామ‌ని తెలిపింది. కాగా అనురాధ రాణి అనే మహిళ స్పైస్‌జెట్ సంస్థలో ఫుడ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తుంది. ఇతర సిబ్బందితో కలిసి ఆమె ఇటీవల ఉదయం 4 గంటల సమయంలో ఎయిర్‌పోర్టులోకి వెళుతుండగా అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ గిరిరాజ్ ప్రసాద్ ఆమెను అడ్డుకున్నాడు. బాడీ చెకింగ్‌కు మహిళా సిబ్బంది అందుబాటులో లేరని ఆ గేటు మీదుగా ఎయిర్‌పోర్టులోకి వెళ్లేందుకు ఆమెకు అనుమతి లేదన్నాడు. ఎయిర్‌లైన్స్ సిబ్బంది కోసం ఉద్దేశించిన స్క్రీనింగ్ పోస్టు వద్ద తనిఖీ చేయించుకుని వెళ్లాలని ఆదేశించాడు. ఈ క్రమంలో ఏఎస్ఐ మహిళా సిబ్బందిని పిలిపించే ప్రయత్నం చేయగా అప్పటికే ఆయనకు, అనురాధ రాణికి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో ఆమె ఒక్కసారిగా ఆయన చెంప ఛెళ్లుమనిపించింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తుపాకీ గురిపెట్టి.. వంట చేయించుకున్న ఉగ్రవాదులు

చెల్లెలి మృతదేహాన్ని 5 కి.మీ. భుజంపై మోసుకెళ్లిన అన్నలు

రోజుకు ఒక్కసారైనా నవ్వాలి.. జపాన్‌లో చట్టం

పాడుబడ్డ బావిలో వింత శబ్దాలు.. ఏంటని తొంగి చూసిన వారికి మైండ్ బ్లాక్

గుడ్‌న్యూస్‌.. వందేభారత్‌ స్లీపర్‌ వచ్చేస్తోంది.. ఈ రూట్లోనే !!