AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahbubnagar: రోడ్డుపై కనబడ్డ చెట్లెక్కే చేపలు.. చూసేందుకు ఎగబడ్డ జనాలు! ఎక్కడంటే..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తగా వానలు విస్తారంగా కురుస్తున్నాయి. వానలకు పాములు, చేపలు, కప్పలు రోడ్డపై ప్రత్యక్షమవడం సాధారణమే. గతంలో పలుమార్లు చేపల వానలు కూడా కురిశాయి. అయితే తాజాగా కురిసిన వానలకు రోడ్డుపై రెండు వింత చేపలు కనిపించాయి. మామూలుగా చేపలు నీళ్లలో ఈదుతాయి. ఒడ్డునవేస్తే గిలగిల కొట్టుకుంటాయి. అయితే ఈ చేపలు ఈ రెండూ చేయలేదు. పాములు మాదిరి..

Mahbubnagar: రోడ్డుపై కనబడ్డ చెట్లెక్కే చేపలు.. చూసేందుకు ఎగబడ్డ జనాలు! ఎక్కడంటే..
Climbing Perch Fish
Srilakshmi C
|

Updated on: Jul 15, 2024 | 11:48 AM

Share

పెంట్లవెల్లి, జులై 15: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తగా వానలు విస్తారంగా కురుస్తున్నాయి. వానలకు పాములు, చేపలు, కప్పలు రోడ్డపై ప్రత్యక్షమవడం సాధారణమే. గతంలో పలుమార్లు చేపల వానలు కూడా కురిశాయి. అయితే తాజాగా కురిసిన వానలకు రోడ్డుపై రెండు వింత చేపలు కనిపించాయి. మామూలుగా చేపలు నీళ్లలో ఈదుతాయి. ఒడ్డునవేస్తే గిలగిల కొట్టుకుంటాయి. అయితే ఈ చేపలు ఈ రెండూ చేయలేదు. పాములు మాదిరి చక్కగా పాకుకుంటూ ఎంత దూరమైనా వెళ్తున్నాయి.. అంతేనా.. ఏకంగా చెట్లు కూడా ఎక్కేస్తాయట. ఈ విచిత్ర ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా పెంట్లవెల్లి మండలంలో చోటుచేసుకుంది.

పెంట్లవెల్లి నుంచి మంచాలకట్ట వెళ్లే దారిలో ఈ చేపలు కనిపించాయి. ఈ చేపలను చూడటానికి ప్రజలు, రైతులు గుంపులుగా వచ్చారు. చేపలు పాకుతూకుంటూ రోడ్డుపై పోవడం ఆశ్యర్యానికి గురి చేసింది. దీంతో ఈ విచిత్ర చేపలను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. చేపల వింత ప్రవర్తన గురించి మత్స్యశాఖ ఏడీ లక్ష్మప్పను వివరణ కోరగా.. ఈ రకం చేప నదులు, చెరువులు, కుంటలు, వాగుల్లో జీవిస్తుందని తెలిపారు. ఈ చేపను గురక చేప (ఎక్కే చేప) అని అంటారని అన్నారు. దీని శాస్త్రీయ నామం అనబాస్‌ టెస్టుడ్యూనియస్. సుమారు 25 సెంటీమీటర్ల వరకు పెరుగుతుందని తెలిపారు. ఈ విధమైన చేపల తలకు ఇరువైపులా ఉన్న మొప్ప కుహరంపై రంపం వంటి పళ్లు ఉంటాయి.

వీటి ద్వారా నేలపై పాకుతూ వెళ్తాయి. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఇవి చెట్లను కూడా సులువుగా ఎక్కేస్తాయట. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మత్స్యకారులు ఆహారపు చేపగా చెరువుల్లో ప్రత్యేకంగా వీటిని సాగు చేస్తుంటారని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.