- Telugu News Photo Gallery Corn Side Effects: Popcorn, roasted corn can harm the health of these people
Corn Side Effects: స్వీట్ కార్న్ ఆరోగ్యానికి మంచిదేగానీ.. వీరికి మాత్రం విషంతో సమానం! ఎందుకంటే..
పాప్‌కార్న్ చాలా మందికి ఇష్టమైన చిరుతిండి. సినిమా, పార్క్.. ఇలా ఎక్కడికైనా వెళ్లినప్పుడు మొక్క జోన్నతో చేసిన పాప్ కర్న్ లేదంటే స్వీట్ కార్న్ లాంటివి తింటూ ఎంజాయ్ చేస్తుంటారు. మొక్కజొన్నలో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే మొక్క జొన్న శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా మొక్కజొన్నలో కార్బోహైడ్రేట్లు, యాంటీఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి..
Updated on: Jul 13, 2024 | 12:46 PM

పాప్‌కార్న్ చాలా మందికి ఇష్టమైన ఆహారం. సినిమాకు, పార్క్.. ఇలా ఎక్కడికైనా వెళ్లినప్పుడు మొక్క జోన్నతో చేసిన పాప్ కర్న్ లేదంటే స్వీట్ కార్న్ లాంటివి తింటూ ఉంటారు. మొక్కజొన్నలో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే మొక్క జొన్న శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా మొక్కజొన్నలో కార్బోహైడ్రేట్లు, యాంటీఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి.

వివిధ పోషకాలు సమృద్ధిగా ఉండే మొక్కజొన్న గుండె, కళ్ళు, చర్మానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ అందరూ మొక్కజొన్న తినకూడదు. మొక్కజొన్న చాలా మందికి హానికరం.

నిపుణుల ప్రకారం అజీర్ణం, మలబద్ధకం లేదా కడుపు సమస్యలు ఉంటే.. ఫైబర్ అధికంగా ఉండే మొక్కజొన్న తినకపోవడమే మంచిది. పీచు ఎక్కువగా తినడం వల్ల పొట్ట సమస్యలు పెరుగుతాయి.

మొక్కజొన్నలో తగినంత కార్బోహైడ్రేట్లు ఉంటాయి. మధుమేహం ఉంటే మొక్కజొన్న తినడం అస్సలు మంచిదికాదు. మొక్కజొన్న తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అలాగే బరువు తగ్గాలని ప్రయత్నించేవారు మొక్కజొన్న తినడం మంచిదికాదు. మొక్కజొన్నలోని కార్బోహైడ్రేట్లు, చక్కెరలు శరీర బరువును సులువుగా పెంచుతుంది.

మొక్కజొన్నలో అదనపు ప్రోటీన్ ఉంటుంది. అందువల్ల మొటిమలు, చర్మ సమస్యలు ఉన్నవారికి అదనపు ప్రోటీన్ చర్మ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది.





























