Beat Root: మీ కళ్లు, గోళ్లు తెల్లబడుతున్నాయా? అశ్రద్ధ చేయకండి.. డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లే!

ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుందా? కళ్లు, గోళ్లు తెల్లగా మారుతున్నాయా? ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఇవి రక్తహీనత ప్రధాన లక్షణాలు. విటమిన్ B-12 లోపం కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. శరీరంలో ఉండే ముఖ్యమైన పోషకాలలో విటమిన్ బి-12 ఒకటి. ఇది ఎర్ర రక్త కణాలను తయారు చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ విటమిన్ ఎముకలు, కండరాలను నిర్మించడంలో, మానసిక ఆరోగ్యాన్ని..

Srilakshmi C

|

Updated on: Jul 13, 2024 | 12:31 PM

ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుందా? కళ్లు, గోళ్లు తెల్లగా మారుతున్నాయా? ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఇవి రక్తహీనత ప్రధాన లక్షణాలు. విటమిన్ B-12 లోపం కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది.

1 / 5
శరీరంలో ఉండే ముఖ్యమైన పోషకాలలో విటమిన్ బి-12 ఒకటి. ఇది ఎర్ర రక్త కణాలను తయారు చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ విటమిన్ ఎముకలు, కండరాలను నిర్మించడంలో, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. శరీరంలో విటమిన్ B-12 లోపం తలెత్తితే రక్తహీనత నుంచి ఎముకలు, కండరాల సమస్యలు, మానసిక స్థితి, మెదడు సమస్యలకు కూడా దారితీస్తుంది. కాబట్టి మీ రోజువారీ ఆహారంలో విటమిన్ B-12 సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకోండి.

2 / 5
విటమిన్ B-12 లోపాన్ని భర్తీ చేయడానికి కొవ్వు చేపలు, మాంసం, పాలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు తినాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అయితే మాంసాహారం తీసుకోని వారు ఈ దుంప కూరగాయల ద్వారా విటమిన్ బి-12 లోపాన్ని భర్తీ చేయవచ్చు.

3 / 5
పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బీట్‌రూట్‌ దుంపలు అత్యంత ప్రయోజనకరమైన కూరగాయలలో ఒకటి. ఇందులో విటమిన్ బి-12, ఐరన్, కాల్షియం, వివిధ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తినడం ద్వారా విటమిన్ B-12 లోపాన్ని తీర్చడం సాధ్యమవుతుంది.

4 / 5
దుంపలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి హాని తలపెట్టే కొలెస్ట్రాల్‌ను కూడా అదుపులో ఉంచుతుంది. కొలెస్ట్రాల్ అదుపులో ఉంటే గుండె పనితీరు మెరుగ్గా ఉంటుంది. విటమిన్లు, ఐరన్ అధికంగా ఉండటం వల్ల శరీరంలో పోషక స్థాయిలను పెంచడంలో ఇవి సహాయపడతాయి. రోజూ బీట్ బీట్‌రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరంలో శక్తి పెరిగి అలసట తగ్గుతుంది. లాగే అజీర్ణం, మలబద్ధకం లేదా కడుపు సమస్యలు ఉంటే ఫైబర్ అధికంగా ఉండే బీట్‌రూట్‌ తినవచ్చు. ఇందులో పీచు ఎక్కువగా ఉండటం వల్ల పొట్ట సమస్యలు తగ్గుతాయి.

5 / 5
Follow us