Telangana: ఏరా.! మీరు మారరా.? ఇతను చేసిన పనితో పోలీసులకు మైండ్ బ్లాంక్
అక్రమార్కుల ఆట కట్టించేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ ఏమాత్రం ఉపయోగం లేకుండా పోతోంది. కేటుగాళ్లు తమ పంధాను మార్చుకుని డ్రగ్స్, గంజాయి లాంటి మాదకద్రవ్యాలను గుట్టుచప్పుడు కాకుండా రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. అయితే..
అక్రమార్కుల ఆట కట్టించేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ ఏమాత్రం ఉపయోగం లేకుండా పోతోంది. కేటుగాళ్లు తమ పంధాను మార్చుకుని డ్రగ్స్, గంజాయి లాంటి మాదకద్రవ్యాలను గుట్టుచప్పుడు కాకుండా రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. అయితే ఇక్కడ పోలీసులు ఏమైనా తక్కువా ఏంటి.? వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటూ.. ఊసలు లెక్కపెట్టిస్తున్నారు. తాజాగా తెలంగాణలో ఇలాంటి తరహా ఘటన ఒకటి జరిగింది. వివరాల్లోకెళ్తే.. గంజాయి సప్లై చేస్తున్న ఓ యువకుడిని సుల్తానాబాద్ పోలీసులు పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని పూసాల రోడ్డు సమీపంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ యువకుడు పట్టుపడ్డాడు. స్కూటీలో 271 గ్రాముల గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. మహారాష్ట్రలోని చంద్రపూర్ నుంచి గంజాయి తీసుకొచ్చి, ఈ ప్రాంతంలో సప్లై చేస్తున్నట్టు తెలిసింది. చంద్రపూర్‌లోని రైల్వే, బస్సు టికెట్ కూడా ఆ వ్యక్తి దగ్గర లభ్యమయ్యాయి. గంజాయితో పాటు స్కూటీని సీజ్ చేశారు పోలీసులు. పంచాయతీ సెక్రటరీలు ప్రమోద్ కుమార్, పాపయ్య, ఎస్సై శ్రావణ్ కుమార్ పంచనామ నిర్వహించి, యువకుడ్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..