AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG DSC 2024 Hall Tickets: తప్పులతడకగా డీఎస్సీ హాల్‌టికెట్లు..! దరఖాస్తులో ఓ జిల్లా.. హాల్‌టికెట్‌లో మరో జిల్లా..

తెలంగాణ డీఎస్సీ నియామకాల్లో రోజుకో వివాదం తెరపైకి వచ్చింది. ఒకవైపు డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలంటూ నిదుర్యోగులు పోరుబాట పడుతుంటే.. సర్కార్‌ మొండిపట్టుదలతో పరీక్షలు నిర్వహించే తీరుతాం అంటూ తెగేసి చెప్పారు. అంతేనా.. హాల్‌ టికెట్లు కూడా విడుదల చేసింది. అయితే హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్న అభ్యర్ధులు.. వాటిల్లోని వివరాలు చూసుకుని ఖంగుతింటున్నారు. ఒకే రోజు రెండు పరీక్షలు ఉంటే..

TG DSC 2024 Hall Tickets: తప్పులతడకగా డీఎస్సీ హాల్‌టికెట్లు..! దరఖాస్తులో ఓ జిల్లా.. హాల్‌టికెట్‌లో మరో జిల్లా..
TG DSC 2024 Hall Tickets
Srilakshmi C
|

Updated on: Jul 15, 2024 | 9:12 AM

Share

హైదరాబాద్, జులై 15: తెలంగాణ డీఎస్సీ నియామకాల్లో రోజుకో వివాదం తెరపైకి వచ్చింది. ఒకవైపు డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలంటూ నిదుర్యోగులు పోరుబాట పడుతుంటే.. సర్కార్‌ మొండిపట్టుదలతో పరీక్షలు నిర్వహించే తీరుతాం అంటూ తెగేసి చెప్పారు. అంతేనా.. హాల్‌ టికెట్లు కూడా విడుదల చేసింది. అయితే హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్న అభ్యర్ధులు.. వాటిల్లోని వివరాలు చూసుకుని ఖంగుతింటున్నారు. ఒకే రోజు రెండు పరీక్షలు ఉంటే.. ఉదయం ఒక జిల్లాలో, మధ్యాహ్నం మరొక జిల్లాలో పరీక్ష కేంద్రం ఉండటం చూసి అభ్యర్ధులు గుడ్లు తేలేశారు. దీనిపై గందరగోళం నెలకొనడంతో సర్కార్.. కొన్ని మార్పులు చేసి ఒకే రోజు రెండు పరీక్షలు ఉంటే.. ఒకే కేంద్రంలో రాయొచ్చు. అటువంటి వారికి మళ్లీ హాల్‌ టికెట్లను జారీ చేస్తామని హామీ ఇచ్చింది. హమ్మయ్యా.. అని అనుకునేలోపు తాజాగా మరో విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది.

ఒక జిల్లాలో ఉపాధ్యాయ ఉద్యోగం కోసం డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వారికి, మరోక జిల్లాలో పోస్టుకు అప్లై చేసుకున్నట్లుగా హాల్‌టికెట్‌లో రావడంతో అభ్యర్థులు బెంబేలెత్తిపోతున్నారు. ఏం చేయాలో, ఎవరిని అడగాలో పాలుపోక ఆందోళన చెందుతున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగుకు చెందిన శ్రీపెల్లి జ్యోత్స్నఅనే అభ్యర్ధి, మంచిర్యాల జిల్లాలో ఎస్జీటీ పోస్టుకు దరఖాస్తు చేసుకుంది. ఈ నెల్లో జరగనున్న డీఎస్సీ పరీక్షకు ఆమె తాజాగా హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకుంది. అయితే అందులో నల్గొండ జిల్లాలో ఉపాధ్యాయ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నట్లు ఉంది. ఇక పరీక్ష కేంద్రాన్ని ఆదిలాబాద్‌ జిల్లా మావలలో కేటాయించారు.

మరో ఘటనలో.. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం కొర్కల్‌కు చెందిన పొరెడ్డి సౌజన్య అదే జిల్లాలో స్కూల్ అసిస్టెంట్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకుంది. హాల్‌టికెట్‌లో ఖమ్మం జిల్లాలో పోస్టుకు అప్లై చేసుకున్నట్లుగా ఉంది. ఈ విషయంపై హెల్ప్‌డెస్క్‌కు ఫిర్యాదు చేశామని, చాలామందికి ఇలాగే తప్పుగా వచ్చాయని సౌజన్య మీడియాకు తెలిపింది. దీనిపై స్పందించిన విద్యాశాఖ అధికారులు.. విచారణ జరిపి పొరపాటును సరిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాగా జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌ విధానంలో డీఎస్సీ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు దాదాపు 2,79,966 మంది అభ్యర్థులు రాయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.