ICAS: జ్యోతిష్యంలో కోర్సు చేయాలని ఉందా.? మీకోసమే ఈ సదవకాశం..

రోజురోజుకీ ఎంత టెక్నాలజీ పెరుగుతున్నా ఇప్పటికీ వాస్తు, జ్యోతిష్య రంగాలకు ఆదరణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ మనలో చాలా మంది వాస్తుతో పాటు జ్యోతిస్యాన్ని నమ్మేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ఇంటి నిర్మాణాలతో పాటు పెళ్లిళ్లకు శుభకార్యక్రమాలకు జ్యోతిష్యాన్ని విశ్వసిస్తున్నారు. దీంతో జ్యోతిష్య, వాస్తు పండితులకు ఆదరణ లభిస్తోంది...

ICAS: జ్యోతిష్యంలో కోర్సు చేయాలని ఉందా.? మీకోసమే ఈ సదవకాశం..
Icas
Follow us

|

Updated on: Jul 14, 2024 | 8:15 PM

రోజురోజుకీ ఎంత టెక్నాలజీ పెరుగుతున్నా ఇప్పటికీ వాస్తు, జ్యోతిష్య రంగాలకు ఆదరణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ మనలో చాలా మంది వాస్తుతో పాటు జ్యోతిస్యాన్ని నమ్మేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ఇంటి నిర్మాణాలతో పాటు పెళ్లిళ్లకు శుభకార్యక్రమాలకు జ్యోతిష్యాన్ని విశ్వసిస్తున్నారు. దీంతో జ్యోతిష్య, వాస్తు పండితులకు ఆదరణ లభిస్తోంది.

అయితే వాస్తు, జ్యోతిష్యంకు కూడా విద్య అవసరమని మీకు తెలుసా.? వంశపారపర్యంగా కొందరు వాస్తు, జ్యోతిష్య పండితులుగా మారుతుంటారు. అయితే ఇండియన్‌ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రొలాజికల్ సైన్సెస్ జ్యోతిష్యం, వాస్తులో సర్టిఫికేట్ కోర్సులను అందిస్తోంది. పలు విభాగాల్లో ఏడాదితో పాటు ఆరు నెలల వ్యవధి ఉండే కోర్సులను ఆఫర్‌ చేస్తున్నారు. ఇంగ్లిష్‌తో పాటు తెలుగులోనూ ఈ కోర్సును పూర్తి చేయొచ్చు. ఈ కోర్సుల్లో జ్యోతిష్య ప్రవీణ & విశారద, వాస్తు ప్రవీణ, నాడీ ప్రవీణ, హస్తరేఖ ప్రవీణ వంటివి ఉన్నాయి.

కోర్సుల పూర్తి వివరాల విషయానికొస్తే.. జ్యోతిష్య విశారద ఏడాది కోర్సు, జ్యోతిష్య ప్రవీణ ఏడాది కోర్సు. నాడీ ప్రవీణ/ విశారద 6 నెలలు, హస్తరేఖ ప్రవీణ/ విశారద 6 నెలలు, వాస్తు ప్రవీణ/ వాస్తు ఆచార్య 6 నెలలు వంటి కోర్సులను అందిస్తున్నారు. తొలుత దరఖాస్తు చేసుకున్న వారికి సీటు ఇవ్వనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రొలాజికల్ సైన్సెస్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు. అలాగే పూర్తి వివరాల కోసం 9550763909 నెంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రొలాజికల్ సైన్సెస్ను 1984లో ఏర్పాటు చేశారు. డాక్టర్ బి.వి. రామన్ ఈ సంస్థను స్థాపించారు. ఆస్ట్రాలజీ రంగంలో పరిజ్ఞానాన్ని అందించడం, వివిధ కోర్సులను అందించే లక్ష్యంతో ఐసీఏఎస్‌ సంస్థను ఏర్పాటు చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ ఎ.బి. శుక్లా.. ప్రస్తుతం ఈ సంస్థ వ్యవహరాలను చూసుకుంటున్నారు. వాస్తు, జ్యోతిష్యంపై ఆసక్తి ఉన్న వారు వెంటనే అప్లై చేసుకోండి మరి.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఆర్మీ.. ఈ ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్..
ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఆర్మీ.. ఈ ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్..
ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా
ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా
తెరపైకి సరికొత్త చర్చ.. ఆ పార్టీలో మొదలైన ప్రోటోకాల్ రచ్చ..
తెరపైకి సరికొత్త చర్చ.. ఆ పార్టీలో మొదలైన ప్రోటోకాల్ రచ్చ..
చూడ ముచ్చటైన డిజైన్‌తో సీఎమ్‌ఎఫ్‌ ఇయర్‌ బడ్స్‌..
చూడ ముచ్చటైన డిజైన్‌తో సీఎమ్‌ఎఫ్‌ ఇయర్‌ బడ్స్‌..
ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణం.. పట్టు తప్పితే అంతే సంగతులు..
ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణం.. పట్టు తప్పితే అంతే సంగతులు..
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. పంత్ ఔట్?
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. పంత్ ఔట్?
కాంగ్రెస్ గూటికి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి..
కాంగ్రెస్ గూటికి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి..
Controversy:వివాదస్పదమైన టీమిండియా మాజీ క్రికెటర్ల స్టెప్పులు..
Controversy:వివాదస్పదమైన టీమిండియా మాజీ క్రికెటర్ల స్టెప్పులు..
ఢిల్లీలో ఘనంగా జగన్నాథుని రథోత్సవం.. పాల్గొన్న కేంద్ర మంత్రులు..
ఢిల్లీలో ఘనంగా జగన్నాథుని రథోత్సవం.. పాల్గొన్న కేంద్ర మంత్రులు..
కూతురు శిక్షణ కోసం కారు, భూమిని అమ్మేసిన తండ్రి.. కట్‌చేస్తే
కూతురు శిక్షణ కోసం కారు, భూమిని అమ్మేసిన తండ్రి.. కట్‌చేస్తే