Viral Video: రైల్వే బ్రిడ్జిపై దంపతుల రీల్స్.. అంతలో రైలు ఎంట్రీ! ఆ తర్వాత జరిగిందిదే.. వీడియో

సోషల్‌ మీడియాలో లైకులు, వ్యూస్‌ తెచ్చుకునేందుకు యువత పిచ్చి పిచ్చి రీల్స్‌ చేసి నెట్టింట వదులుతున్నారు. రీల్స్ పిచ్చిలో వారేం చేస్తున్నారో.. ఎక్కడ ఉంటున్నారో.. అనే విషయం పూర్తిగా పెడచెవిన పెడుతున్నారు. తాజా ఓ జంట రీల్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రాజస్థాన్‌ పాలిలోని గోరంఘాట్‌ బ్రిడ్జిపై సోషల్‌ మీడియాలో రీల్‌ కోసం..

Viral Video: రైల్వే బ్రిడ్జిపై దంపతుల రీల్స్.. అంతలో రైలు ఎంట్రీ! ఆ తర్వాత జరిగిందిదే.. వీడియో
Couple On Photoshoot Jumps Into 90 Ft Gorge
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 15, 2024 | 1:01 PM

పాలి, జూలై 15: సోషల్‌ మీడియాలో లైకులు, వ్యూస్‌ తెచ్చుకునేందుకు యువత పిచ్చి పిచ్చి రీల్స్‌ చేసి నెట్టింట వదులుతున్నారు. రీల్స్ పిచ్చిలో వారేం చేస్తున్నారో.. ఎక్కడ ఉంటున్నారో.. అనే విషయం పూర్తిగా పెడచెవిన పెడుతున్నారు. తాజా ఓ జంట రీల్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రాజస్థాన్‌ పాలిలోని గోరంఘాట్‌ బ్రిడ్జిపై సోషల్‌ మీడియాలో రీల్‌ కోసం శనివారం మధ్యాహ్నం భార్యాభర్తలు వచ్చి ఫొటో షూట్‌ చేస్తున్నారు. అయితే బ్రిడ్జిపైకి అకస్మాత్తుగా ఓ రైలు వచ్చింది. అది ఒకటే ట్రాక్‌ కావడంతో పక్కన నిలబడేందుకు సైతం చోటు లేకపోయింది. దీంతో వారు దిక్కుతోచని స్థితిలో ప్రాణాలకు తెగించి ఏకంగా 90 అడుగుల లోయలోకి దూకేశారు. దీంతో భార్యభర్తలిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.

రైలు వచ్చే సమయంలో ప్రమాదానికి గురైన జంట.. ఫొటో షూట్‌లో బిజీగా ఉన్నారని.. అక్కడే కొంత దూరంలో ఉన్న ప్రత్యక్ష సాక్షలు తెలిపారు. రైలు దాదాపు వారి సమీపంలోకి వచ్చే వరకు వారికి తెలియదు. అకస్మాత్తుగా ఎదురుగా వస్తున్న రైలును చూసి, ప్రాణాలు దక్కించుకోవడానికి 90 అడుగుల కింద ఉన్న వాగులోకి దూకేశారు. గాయపడిన దంపతులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఇద్దరికీ తీవ్రగాయాలు అయ్యాయి. వీరిలో భర్త పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో దృశ్యాలు వైరల్‌గా మారాయి. కాగా, ప్రకృతి అందాలకు గోరంఘాట్‌ బ్రిడ్జి ఫేమస్‌. దీంతో నిత్యం వేల మంది పర్యాటకులు అక్కడికి వచ్చి, ప్రమాదకర పరిస్థితుల్లో ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలుపై జీఎస్టీ బాదుడు.. ఎంత పెంచారంటే..?
సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలుపై జీఎస్టీ బాదుడు.. ఎంత పెంచారంటే..?
చలికాలంలో పచ్చిబఠానీలు తింటే ఆరోగ్యానికి కలిగేప్రయోజనాలు తెలిస్తే
చలికాలంలో పచ్చిబఠానీలు తింటే ఆరోగ్యానికి కలిగేప్రయోజనాలు తెలిస్తే
తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. ఎవరు, ఎంతిచ్చారంటే..?
తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. ఎవరు, ఎంతిచ్చారంటే..?
ఢిల్లీలో ఎన్డీఏ నేతల కీలక సమావేశం.. హాజరైన సీఎం చంద్రబాబు..
ఢిల్లీలో ఎన్డీఏ నేతల కీలక సమావేశం.. హాజరైన సీఎం చంద్రబాబు..
Gold Rates in 2025: పసిడి ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా?
Gold Rates in 2025: పసిడి ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా?
శ్రీ తేజ్‌కుటుంబానికి అండగా వేణు స్వామి.. 2 లక్షల ఆర్థిక సాయం
శ్రీ తేజ్‌కుటుంబానికి అండగా వేణు స్వామి.. 2 లక్షల ఆర్థిక సాయం
వారానికి ఒక గ్లాస్‌ చెరకు రసం తాగితే చాలు..!అద్భుతమైన ప్రయోజనాలు
వారానికి ఒక గ్లాస్‌ చెరకు రసం తాగితే చాలు..!అద్భుతమైన ప్రయోజనాలు
ఇది సార్ టాలీవుడ్ రూలు.. బాలీవుడ్‎ని ఏలేస్తున్న తెలుగు హీరోలు..
ఇది సార్ టాలీవుడ్ రూలు.. బాలీవుడ్‎ని ఏలేస్తున్న తెలుగు హీరోలు..
ఎన్టీఆర్ కథ లీక్ చేసిన దర్శకుడు..
ఎన్టీఆర్ కథ లీక్ చేసిన దర్శకుడు..
ఆ కంపెనీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మతిపోయే బహుమతులు అందజేత
ఆ కంపెనీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మతిపోయే బహుమతులు అందజేత