AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JNTU: నిన్న చట్నీలో ఎలుక.. నేడు పెరుగు తాగుతూ పిల్లి.. జేఎన్‌టీయూలో పరిస్థితి ఇదీ.. వామ్మో వీడియో చూస్తే..

నిన్న చట్నీలో ఎలుక.. నేడు పెరుగు తాగుతూ పిల్లి.. ఇవీ జేఎన్టీయూ కాలేజీ కేంటీన్లలో కనిపించిన దృశ్యాలు.. హైదరాబాద్‌ KPHBలోని జేఎన్టీయూ క్యాంపస్‌లో ఉన్న మంజీరా హాస్టల్‌ వంటశాలలో ఓ పిల్లి పెరుగు తాగిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రెండ్రోజులు క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

JNTU: నిన్న చట్నీలో ఎలుక.. నేడు పెరుగు తాగుతూ పిల్లి.. జేఎన్‌టీయూలో పరిస్థితి ఇదీ.. వామ్మో వీడియో చూస్తే..
Jntu
Shaik Madar Saheb
|

Updated on: Jul 17, 2024 | 1:50 PM

Share

నిన్న చట్నీలో ఎలుక.. నేడు పెరుగు తాగుతూ పిల్లి.. ఇవీ జేఎన్టీయూ కాలేజీ కేంటీన్లలో కనిపించిన దృశ్యాలు.. హైదరాబాద్‌ KPHBలోని జేఎన్టీయూ క్యాంపస్‌లో ఉన్న మంజీరా హాస్టల్‌ వంటశాలలో ఓ పిల్లి పెరుగు తాగిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రెండ్రోజులు క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీంతోపాటు యూనివర్సిటీ క్యాంటీన్లలో విద్యార్థులకు పెట్టే ఆహారంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందోనని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాగా.. జేఎన్‌టీయూ కళాశాల మంజీరా వసతిగృహం క్యాంటీన్లోని ఆహార పదార్థాల గిన్నెల్లో పిల్లి మూతి పెట్టిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. గ్రేటర్‌ ఫుడ్ సేఫ్టీ అధికారులు అప్రమత్తమయ్యారు. వసతిగృహంలోని వంటగది, నిత్యావసరాల స్టోర్‌ రూమ్‌లను తనిఖీ చేశారు. వంటగది, కూరగాయలు నిల్వ ఉంచే ప్రాంతాన్ని పరిశీలించారు. అపరిశుభ్రంగా.. నీరు నిలిచి ఉండడాన్ని గమనించి పలు సూచనలు చేశారు. కొన్ని కూరగాయలు పాడైపోవడంతో సిబ్బందిని మందలించి పారబోయించారు. వంటపాత్రలపై మూతలు, కిటికీలకు మెష్‌లు లేవని..వాటిని అమర్చాలన్నారు. కేర్‌టేకర్లు మెస్‌లో 24గంటలూ ఉండాలన్నారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించిన తర్వాత వారి ఆదేశాలకు అనుగుణంగా చర్యలుంటాయని తెలిపారు.

వీడియో చూడండి..

ఇటీవల సుల్తాన్‌పూర్‌ జేఎన్టీయూ బ్రాంచ్‌ హాస్టల్‌లో చట్నీలో ఎలుక పడింది. ఇప్పుడు KPHBలోని జేఎన్టీయూ హాస్టల్‌లో విద్యార్థులకు వడ్డించే భోజనంపై మూత పెట్టకపోవడంతో.. ఓ పిల్లి పెరుగు తాగుతుండగా విద్యార్థులు గమనించి వీడియో తీసి వర్సిటీ హాస్టళ్ల దుస్థితిని బయట ప్రపంచానికి చూపించారు. ఈ ఘటనతో వర్సిటీ హాస్టళ్లలోని శుచీశుభ్రత చర్చనీయాంశమైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..