AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naini Coal: నైనీ బొగ్గు బ్లాక్‌లో ఉత్పత్తి ఎప్పటి నుంచి అంటే..? సింగరేణికి కీలక ఆదేశాలు

సింగరేణి సంస్థకు ఒడిశాలో కేటాయించిన నైనీ బొగ్గు బ్లాక్‌లో నాలుగు నెలల్లో ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ మేరకు సింగరేణి అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించి ఇటీవలే భట్టి ఒడిశాలో పర్యటించి ఆ రాష్ట్ర సీఎం మోహన్ చరణ్‌తో సమావేశమయ్యారు. సింగరేణి తొలిసారిగా తెలంగాణ వెలుపల చేపడుతున్న ఈ ప్రాజెక్ట్‌ పనులను..

Naini Coal: నైనీ బొగ్గు బ్లాక్‌లో ఉత్పత్తి ఎప్పటి నుంచి అంటే..? సింగరేణికి కీలక ఆదేశాలు
Naini Coal Mines
Subhash Goud
|

Updated on: Jul 17, 2024 | 3:37 PM

Share

సింగరేణి సంస్థకు ఒడిశాలో కేటాయించిన నైనీ బొగ్గు బ్లాక్‌లో నాలుగు నెలల్లో ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ మేరకు సింగరేణి అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించి ఇటీవలే భట్టి ఒడిశాలో పర్యటించి ఆ రాష్ట్ర సీఎం మోహన్ చరణ్‌తో సమావేశమయ్యారు. సింగరేణి తొలిసారిగా తెలంగాణ వెలుపల చేపడుతున్న ఈ ప్రాజెక్ట్‌ పనులను సంస్థ ప్రతిష్ట పెంచేలా చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి అధికారులకు సూచించారు.

సింగరేణికి ఒడిశా రాష్ట్ర అటవీశాఖ ద్వారా బదలాయించిన 783.27 హెక్టార్ల అటవీ భూమి స్థలం అప్పగింతపై ఆ రాష్ట్ర సీఎం సానుకూలంగా స్పందించారు భట్టి తెలిపారు. దీనిపై ఆ రాష్ట్ర అటవీశాఖతో నిరంతరం సంప్రదింపులు జరపాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక అధికారిగా నైనీ జనరల్ మేనేజర్‌కు బాధ్యతలు అప్పగించాలని సూచించారు. అక్కడి నిర్వాసిత గ్రామ ప్రజలతో తాను చర్చించిన అంశాలను ప్రస్తావించిన భట్టి.. అక్కడి స్థానికులకు పునరావాస పథకం, కార్పోరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాలు, గ్రామ యువతకు ఉపాధి అవకాశాలపై తగిన ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇది కూడా చదవండి: SIM Card: సిమ్‌ కార్డు తీసుకునే ముందు ఇవి తెలుసుకోండి.. లేకుంటే రూ.2 లక్షల జరిమానా!

2015లో సింగరేణికి నైనీ బొగ్గు బ్లాక్‌ను కేటాయించినప్పటికీ గడిచిన ప్రభుత్వ నిరాసక్తత వల్ల ఇప్పటికీ బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కాలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్ అన్నారు. నైనీ నుండి బొగ్గు ఉత్పత్తికి ఇప్పుడు పూర్తి సానుకూల పరిణామాలు ఉన్నాయని.. నిర్ణీత కాలక్రమ ప్రణాళికను రూపొందించుకుని పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రోజువారీగా నిర్దేశించుకున్న పనుల ప్రగతి పై సమీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

ఇది కూడా చదవండి: Petrol Price Hike: వామ్మో.. మళ్లీ భారీగా పెరిగిన పెట్రోల్‌ ధర.. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి