అప్పుడు సారాయికి ఇప్పుడు గంజాయికి హైదరాబాద్ నగరం నడిబొడ్డు అడ్డా

దూల్‌పేట్‌ అంటే హైదరాబాద్‌లో తెలియనివారుండరు. కళా నైపుణ్యాలతోపాటు సారాయి తయారీగా కొంత కాలం విరాజిల్లింది. సారాయిని తెలంగాణలో లేకుండా ఎక్సైజ్‌ శాఖ చేసింది. ఇప్పుడు దూల్‌పేట్‌ అంటే గంజాయికి పెట్టింది పేరుగా మారింది. నాడు సారాయిని తుదిమిట్టిని ఎక్సైజ్‌శాఖ.. ఇప్పుడు దూల్‌పేట్‌లో గంజాయి అనవాళ్లు లేకుండాచేయడానికి అడుగులు కదుపుతోంది..

అప్పుడు సారాయికి ఇప్పుడు గంజాయికి హైదరాబాద్ నగరం నడిబొడ్డు అడ్డా
Excise Department Raids
Follow us
Sravan Kumar B

| Edited By: Subhash Goud

Updated on: Jul 17, 2024 | 8:38 PM

దూల్‌పేట్‌ అంటే హైదరాబాద్‌లో తెలియనివారుండరు. కళా నైపుణ్యాలతోపాటు సారాయి తయారీగా కొంత కాలం విరాజిల్లింది. సారాయిని తెలంగాణలో లేకుండా ఎక్సైజ్‌ శాఖ చేసింది. ఇప్పుడు దూల్‌పేట్‌ అంటే గంజాయికి పెట్టింది పేరుగా మారింది. నాడు సారాయిని తుదిమిట్టిని ఎక్సైజ్‌శాఖ.. ఇప్పుడు దూల్‌పేట్‌లో గంజాయి అనవాళ్లు లేకుండాచేయడానికి అడుగులు కదుపుతోంది. హైదరాబాద్‌ను డ్రగ్స్‌ ఫ్రీ ప్రాంతంగా చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ మేరకు ఎక్సైజ్‌శాఖ, ఎన్‌ఫోర్స్‌ మెంట్‌, ఎస్టీఎప్‌, డీటీఎప్‌ ఎక్సైజ్‌ పోలీసులు రెండు నెలల నుంచి నిరంతరం దాడులు నిర్వహిస్తున్నారు.

చరిత్ర కలిగిన దూల్‌పేట్‌..

నిజాం కాలంలో ఉత్తర ప్రదేశ్‌ నుంచి జీవోనోపాధికి హైదరాబాద్‌కు వలస వచ్చారు.ఈ కుటుంబాల జీవనోపాదికి అనాటి నిజాం ప్రభువు పూర్తిగా సహకరించారు. ఉత్తర ప్రదేశ్‌ నుంచి వలస వచ్చిన లోదా సామాజిక వర్గీయులే దూళిపేట నివాసులు. సహాసానికి ప్రతీకగా, కళానైపుణ్యానికి వేదికగా, జవనోపాదియే పరమావధిగా దూల్‌పేటలో దశాబ్దాలుగా జీవిస్తున్న ఉత్తరాధిల జీవన విధానం, భక్తిభావం చూస్తే అందరిని ఇట్టే అకట్టుకుంటారు. సకల దేవతల అధిపతి, పరమపూజ్యుడైన గణేష్‌ ( వినాయకుడి) విగ్రహాల తయారీ దూల్‌పేటలో ప్రధాన ఉపాధి. వినాయకుడితోపాటు అమ్మవారు, ఇతర దేవత విగ్రహాలు తయారీకి దూల్‌పేట ప్రసిద్ది. విగ్రహాలతోపాటు రాఖీలు, పతంగులు తయారు చేయడంతో పాటు అన్ని రకాలు కులవృతులకు పనులు చేస్తు జీవిస్తు ఉంటారు. దూల్‌పేట ప్రాంతంలో ఐదు ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఏడు లక్షల మేర జనాభా ఉంటుంది. భక్తి భావంలో జీవించే లోదా ప్రజల్లోకి ఒకప్పుడు సారాయి, ఇప్పుడు గంజాయి పట్టి పీడిస్తున్నాయి.

దారి మళ్లించడమే లక్ష్యంగా ..

ధూల్‌పేట్‌ జీవించే వారు ఎక్కువగా సామాన్య, మధ్యతరగతి ప్రజలే. రెక్కాడితేకాని డోక్కాడని పరిస్థితులు. ఉదయం నుంచి సాయంత్రం కష్టపడి శ్రమకు ఉపశమనంగా మద్యానికి బదులు ఒకప్పుడు నాటుసారా, ఇప్పుడు గంజాయిని అలవాటు చేసుకున్నారు. నార్కోటిక్‌ డ్రగ్‌గా ఉన్న గంజాయిని వాడకం వల్ల యువత,నుంచి పెద్ద వారి వరకు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. గంజాయి నుంచి ధూల్‌పేట వాసులను రక్షించడానికి ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ ఇ.శ్రీధర్‌, ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టర్‌ విబి కమలాసన్‌రెడ్డిలు ప్రత్యేక దాడులు నిర్వహించాలని అదేశించారు. ఈ మేరకు రెండు నెలల నుంచి ఎక్సైజ్‌ శాఖ పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌, డిస్ట్రిక్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ఇంటింటి సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 13న ఎక్సైజ్‌ శాఖ 8 బృందాలతో 120 మంది సిబ్బంది కలిసి ఇంటింటి సోదాలు నిర్వహించారు. గంజాయి పట్టుబడక పోయిన గంజాయి అమ్మకందార్లు, కొనుగోలుదారుల ప్రాంతాల్లోని కొందరిని గుర్తించి దాడులు నిర్వహించారు. కొందరు గంజాయి బాధితులను పట్టుకొని విచారించారు. మరో మూడు రోజుల పాటు ధూల్‌పేటలోని ఎక్సైజ్‌ పోలీస్‌ పరిధిలో గంజాయిని వినియోగిస్తున్న యువతకు, వారి తల్లిదండ్రులకు గంజాయి వల్ల కలిగే నష్టాలు, కొత్తగా వచ్చిన చట్టాల వల్ల కలిగే నష్టాలపై కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఎక్సైజ్‌ పోలీసులు మూకుమ్మడి దాడులు నిర్వహిస్తు ఉండడంతో చాల మంది అమ్మకం దారులు, రవాణ నిందితులు, వినియోగదారుల్లో గుబులు చోటు చేసుకుంది. ఈ దాడుల్లో ఎక్సైజ్‌ జాయింట్‌ కమిషనర్లు ఖురేషి,శాస్త్రీతోపాటు అసిస్టెంట్‌ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌, ఏఈఎస్‌లు శ్రీనివాసరావు, సౌజన్య, ధూల్‌పేట్‌ సీఐ ముధుబాబుతోపాటు 120పైగా సిబ్బంది 37 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధ్వర్యంలో..

మంగళవారం హైదరాబాద్‌ ఎక్సైజ్‌ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్‌ హెడ్‌ అంజీరెడ్డి అధ్వర్యంలో ఐదు టీమ్‌లతో 50 మందిపైగా ఎస్టీఎప్‌, డీటీఎప్‌, ఎన్‌ఫోర్స్‌ యంత్రాంగం కలిసి మళ్లీ దాడులు నిర్వహించారు. బుధవారం రాత్రి 11 గంటల వరకు దాడులు నిర్వహించి 2 కేజీల గంజాయిని పట్టుకొని ఇద్దరిని అరెస్టు చేశారు.ధూల్‌పేటలో గంజాయి అమ్మకాలు, రవాణ, వినియోగం అంతం అయ్యేవరకు నిరంతర దాడులు నిర్వహంచడానికి ఎక్సైజ్‌శాఖ ప్రణాళికలు తయారు చేశారు.

మార్పు వైపు అడుగులు వేయాలి: విబి కమలాసన్‌రెడ్డి, డైరెక్టర్‌ ఎక్సైజ్‌ఎన్‌ఫోర్స్‌మెంట్‌

కేంద్రం తీసుకవచ్చిన కొత్త చట్టాలు, తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్‌, గంజాయిని లేకుండా చేయాలనే లక్ష్యానికి ధూల్‌పేట్‌ ప్రజలు పూర్తిగా సహకరించాలి. గతం ఎలా ఉన్నా.. ప్రస్తుతం డ్రగ్స్‌, గంజాయి అమ్మకాలు, రవాణ, వినియోగాలపై ఎక్సైజ్‌శాఖ గట్టి నిఘా పెట్టింది. ధూల్‌పేట్‌లో గంజాయిని తుది ముట్టించే వరకు దాడులుజరుపుతుంటాం. ఈ విషయంలో ప్రజలు గంజాయి అమ్మకాలు, రవాణ, వినియోగంపై ఎక్సైజ్‌శాఖకు సహకరించాలి.గంజాయిని వినియోగించిన, అమ్మకాలు జరిపినా, రవాణ చేసిన సమయంలో ఎక్సైజ్‌ పోలీసులకు లభిస్తే కఠిన కేసులతో కటకటాల్లోకి వెళ్లాల్సి వస్తుంది. గంజాయి, ఇతర డ్రగ్స్‌ సమాచారాన్ని 18004252523 ట్రోల్‌ ఫ్రీ నెంబరుకు సమాచారాన్ని ఇవ్వండి