AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బంధువుల నోటిదూలకు నవ దంపతులు బలి.. రైలు కిందపడి సూసైడ్‌!

నిజామాబాద్ జిల్లాలో యువజంట బలన్మరణానికి పాల్పడింది. దంపతులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. తమపై బంధువులు దుష్ర్పచారం చేస్తున్నారని ఆవేదని తెలియజేస్తూ వీడియో చిత్రీకరించి, ఆ సెల్ఫీ వీడియోను పోలీసులకు పంపించారు. అనంతరం ప్రాణాలను తీసుకున్నారు. వారిని కాపాడేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఈ దారుణ ఘటన నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం..

Telangana: బంధువుల నోటిదూలకు నవ దంపతులు బలి.. రైలు కిందపడి సూసైడ్‌!
Nizamabad Couple Committed Suicide
Srilakshmi C
|

Updated on: Jul 16, 2024 | 9:51 AM

Share

నిజామాబాద్, జులై 16: నిజామాబాద్ జిల్లాలో యువజంట బలన్మరణానికి పాల్పడింది. దంపతులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. తమపై బంధువులు దుష్ర్పచారం చేస్తున్నారని ఆవేదని తెలియజేస్తూ వీడియో చిత్రీకరించి, ఆ సెల్ఫీ వీడియోను పోలీసులకు పంపించారు. అనంతరం ప్రాణాలను తీసుకున్నారు. వారిని కాపాడేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఈ దారుణ ఘటన నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్‌-మిట్టాపూర్‌ మధ్యలో సోమవారం ( జులై 15) రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

నిజామాబాద్‌ జిల్లా పొతంగల్‌ మండలం హెగ్డోలికి చెందిన అనిల్‌ (28), అదే మండలానికి చెందిన శైలజ (24)కు ఏడాది కిందట వివాహమైంది. ఎంతో సాఫీగా సాగిపోతున్న వీరి కాపురంలో బంధువులు చిచ్చుపెట్టారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూకు వెళ్తున్నట్లు దంపతులిద్దరూ కుటుంబీకులకు చెప్పి, సోమవారం ఇంటి నుంచి వెళ్లారు. అనంతరం తాను గతంలో ఓ తప్పు చేశానని, దాన్ని భర్త క్షమించినా బంధువులు సూటిపోటి మాటలతో చిత్రహింసలకు గురిచేస్తున్నారని దంపతులు ఇద్దరూ సెల్ఫీ వీడియోను చిత్రీకరించారు. వారు తమపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తట్టుకోలేక ఇద్దరం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నట్లు వీడియో చిత్రీకరించారు. అనంతరం ఈ వీడియోలను కోటగిరి ఎస్సై సందీప్‌కు పంపారు.

ఈ వీడియో చూసిన ఆయన వెంటనే నవీపేట ఎస్సై యాదగిరిగౌడ్‌కు వీడియోతోపాటు వారి సెల్‌ఫోన్‌ నంబరు పంపి, అప్రమత్తం చేశారు. దంపతులు ఆత్మహత్య చేసుకునేందుకు గోదావరి వద్దకు వస్తున్నట్లు వీడియోలో చెప్పారు. ఆ సమాచారం ప్రకారం స్థానిక పోలీసులు బాసర వంతెన దగ్గరకు వెళ్లి మాటువేశారు. ఎంత గాలించినా జాడ కనిపించలేదు. దీంతో బాధితుల ఫోన్‌ నంబరును ట్రాక్‌ చేయగా ఫకీరాబాద్‌-మిట్టాపూర్‌ మధ్య ఉన్నట్లు తెలిసింది. వెంటనే నవీపేట ఎస్సై గుర్తించి అక్కడికి చేరుకునేటప్పటికే ఆలస్యమైంది. అనిల్‌, శైలజ.. ఇద్దరి మృతదేహాలు రైలు పట్టాలపై కనిపించాయి. దీనిపై కేసు నమోదు చేసుకుని, దర్యా్ప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. యువ దంపతులు ఆత్మహత్యతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్