TG DSC 2024 Hall Tickets: ‘నిన్న జిల్లా మార్చేశారు.. ఇవాళ ఏకంగా ఫొటోలే తారుమారు’ డీఎస్సీ హాల్‌ టికెట్లలో సిత్రాలు

తెలంగాణ ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)కు సంబంధించి రోజుకో వివాదం తెరపైకి వస్తుంది. తాజాగా విద్యాశాఖ విడుదల చేసిన హాల్‌ టికెట్లు కూడా సరికొత్త వివాదాలకు తెరలేపాయి. నిన్నటికి నిన్న ఒక జిల్లాలో ఉపాధ్యాయ ఉద్యోగం కోసం డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వారికి, మరోక జిల్లాలో పోస్టుకు అప్లై చేసుకున్నట్లుగా హాల్‌టికెట్‌లో రావడంతో చర్చణీయాంశంగా మారింది. ఇలా ఒకరిద్దరికి మాత్రమే కాదు అనేక మంది హాల్‌ టికెట్లలో..

TG DSC 2024 Hall Tickets: 'నిన్న జిల్లా మార్చేశారు.. ఇవాళ ఏకంగా ఫొటోలే తారుమారు' డీఎస్సీ హాల్‌ టికెట్లలో సిత్రాలు
TG DSC 2024 Hall Tickets
Follow us

|

Updated on: Jul 16, 2024 | 11:34 AM

హైదరాబాద్‌, జులై 16: తెలంగాణ ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)కు సంబంధించి రోజుకో వివాదం తెరపైకి వస్తుంది. తాజాగా విద్యాశాఖ విడుదల చేసిన హాల్‌ టికెట్లు కూడా సరికొత్త వివాదాలకు తెరలేపాయి. నిన్నటికి నిన్న ఒక జిల్లాలో ఉపాధ్యాయ ఉద్యోగం కోసం డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వారికి, మరోక జిల్లాలో పోస్టుకు అప్లై చేసుకున్నట్లుగా హాల్‌టికెట్‌లో రావడంతో చర్చణీయాంశంగా మారింది. ఇలా ఒకరిద్దరికి మాత్రమే కాదు అనేక మంది హాల్‌ టికెట్లలో ఇలాగే తప్పులు దొర్లినట్లు తేలింది. దీంతో విద్యాశాఖ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇక తాజాగా ఓ అభ్యర్ధి హాల్‌ టికెట్‌లో ఏకంగా మనిషినే మార్చేశారు. అబ్బాయి హాల్‌ టికెట్‌పై అమ్మాయి ఫొటో, అమ్మాయి హాల్‌ టికెట్‌పై అబ్బాయి ఫొటో, సంతకం ఉండటాన్ని అభ్యర్థులు గుర్తించి గందరగోళంలో పడ్డారు.

మేడ్చెల్‌ జిల్లా దమ్మాయి గూడ బాలాజీ నగర్‌కు చెందిన పల్లెపు రామచంద్రయ్య అనే అభ్యర్ధి స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకోగా.. తాజాగా హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్ చేసుకున్నాడు. అందులో అతని పేరు సక్రమంగానే ఉన్నా, ఫొటో మాత్రం ఎవరో అమ్మాయిది వచ్చింది. సంతకం కూడా తనది కాదని గుర్తించి పరేషాన్‌ అయ్యాడు. నల్గొండ జిల్లా చిట్యాలకు చెందినన రుద్రారపు భవ్య ఎస్‌ఏ పోస్టుకు అప్లై చేయగా.. హాల్‌ టికెట్‌లో ఆమె ఫొటో బదులు వేరే అబ్బాయి ఫొటో వచ్చింది. దీంతో అధికారుల నిర్లక్ష్యం వల్ల తాము విద్యాశాఖ అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుందని పలువురు అభ్యర్ధులు వాపోతున్నారు. హాల్‌ టికెట్ల రూపకల్పనలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.

డీఎస్సీ పరీక్షలు మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్నాయి. పరీక్షలు సమీపిస్తున్న వేళ సీరియస్‌గా సన్నద్ధమవుతున్న అభ్యర్ధులు ఇలా హాల్‌ టికెట్ల కోసం అధికారుల చుట్టూ తిరుగుతుండటంతో గందరగోళం నెలకొంది. అయితే ఈ తప్పిదాలకు విద్యాశాఖ కారణం కాదని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తు చేసేటప్పుడు అభ్యర్థులు చేసిన పొరపాట్ల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు. అసలు తామెలా ఫొటోలు, సంతకాలు మారుస్తామని అధికారులు ప్రశ్నిస్తున్నారు. సిస్టమ్‌ జనరేటెడ్‌ హాల్‌ టికెట్లను తాము చూసే అవకాశమే లేదని, తప్పులు దొర్లినట్టు వచ్చిన అభ్యర్థులకు తక్షణమే సరిచేసి, కొత్తవి జారీ చేస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

కాగా డీఎస్సీ నిర్వహణ మొదట్నుంచీ వివాదాస్పదంగానే ఉంది. అభ్యర్ధుల ప్రిపరేషన్‌కు సరైన సమయం లేకుండా డీఎస్సీ పెట్టడంపై అభ్యర్థులు, రాజకీయ నేతల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఇవన్నీ కోచింగ్‌ కేంద్రాలు, రాజకీయ పార్టీల ప్రాపకం కోసం పాకులాడే వారు సృష్టించినవేనని ప్రభుత్వం కొట్టి పారేసింది. ఈ నెల 11 నుంచి హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించినా.. చాలా చోట్ల అవి డౌన్‌లోడ్‌ కావడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిని పరిష్కిరించడంతో సోమవారం విద్యార్థులు పెద్ద ఎత్తున హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..