AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముదిరిపాకన పడ్డ ‘ముదురు’ ప్రేమ..10 మంది పిల్లలున్న వ్యక్తితో ఆరుగురు పిల్లల తల్లి జంప్‌!

ప్రేమ గుడ్డిది అంటుంటారు. గుడ్డి మాత్రమేకాదు మూగ, చెవిటి, కుంటిది కూడా అని తాజా సంఘటనతో తేలిపోయింది. వారిది మనవళ్లను ఎత్తుకోవల్సిన వయసు. ఇరువురికి గంపెడు పిల్లలున్నారు. అంతా పెళ్లీడుకు వచ్చారు. వారి అచ్చటా ముచ్చటా చూసి ఆనందించవల్సిన వయసులో ప్రేమలో పడటమేకాకుండా.. ఇళ్ల నుంచి పారిపోయి అందరికీ షాక్‌ ఇచ్చారు. మరో వైపు కూతురు పెళ్లి జరుగుతుంటే.. తల్లి ఇలా చేయడంతో అందరికీ పరువుపోయినట్లైంది..

ముదిరిపాకన పడ్డ 'ముదురు' ప్రేమ..10 మంది పిల్లలున్న వ్యక్తితో ఆరుగురు పిల్లల తల్లి జంప్‌!
Married Woman Eloped With Her Lover
Srilakshmi C
|

Updated on: Jul 17, 2024 | 11:51 AM

Share

లక్నో, జులై 17: ప్రేమ గుడ్డిది అంటుంటారు. గుడ్డి మాత్రమేకాదు మూగ, చెవిటి, కుంటిది కూడా అని తాజా సంఘటనతో తేలిపోయింది. వారిది మనవళ్లను ఎత్తుకోవల్సిన వయసు. ఇరువురికి గంపెడు పిల్లలున్నారు. అంతా పెళ్లీడుకు వచ్చారు. వారి అచ్చటా ముచ్చటా చూసి ఆనందించవల్సిన వయసులో ప్రేమలో పడటమేకాకుండా.. ఇళ్ల నుంచి పారిపోయి అందరికీ షాక్‌ ఇచ్చారు. మరో వైపు కూతురు పెళ్లి జరుగుతుంటే.. తల్లి ఇలా చేయడంతో అందరికీ పరువుపోయినట్లైంది. మరో ట్విస్ట్ ఏంటంటే వీరిద్దరూ వియ్యంకులు కూడా. కనీసం వయసులో ఉన్న ఏదో ఒక జంట ఈ పని చేసి ఉంటే.. ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. వయసు అలాంటిది అని సరిపెట్టుకునేవారు. కానీ తాము కూడా ఏమాత్రం తక్కువ కామని యూపీలో ఈ ముదురు ప్రేమజంట నిరూపించింది. వివరాల్లోకెళ్తే..

ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌కు చెందిన సాక్షాత్తూ పెళ్లయ్యి 10 మంది పిల్లలున్న వ్యక్తి, పెళ్లయ్యి ఆరుగురు సంతానం ఉన్న మరో మహిళతో కలిసి ప్రేమాయణం సాగించారు. అంతటితో ఆగకుండా ఇద్దరూ జంప్‌ కావడం చర్చణీయాంశంగా మారింది. పైగా సదరు మహిళ కుమారుడి కాబోయే అత్త కావడం మరో ట్విస్టు. ఈ సంఘటన జూన్‌ మొదటి వారంలో చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యూపీలోని కాస్‌గంజ్‌లో కూలిపని చేసుకునే వ్యక్తి, ఈ-రిక్షా డ్రైవర్‌గా చేసే షకీల్‌ గత 28 ఏళ్లుగా స్నేహితులు. తన కుమారుడికి అతని కుమార్తెతో వివాహం జరిపించాలని షకీల్‌ అడగడంతో ఆయన కూడా ఓకే అన్నాడు. 2 నెలల క్రితం నిశ్చితార్ధం కూడా జరిపారు. జూన్‌ 17న వివాహం చేసేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య ఏర్పడిన పరిచయాల కొద్దీ వధువు తల్లి, వరుడు తండ్రి (షకీల్‌)తో అడపాదడపా మాటకలుపుతూ ఉండేది. ఈ లోగా ఇరు కుటుంబాలకు షాక్‌ ఇస్తూ జూన్‌ 3న షకీల్‌, పెళ్లికుమార్తె తల్లితో ఉడాయించాడు.

అయితే షకీల్‌ తన భార్యను కిడ్నాప్‌ చేశాడంటూ కొత్వాలి గంజ్‌దుండ్వారా పోలీస్ స్టేషన్‌లో స్నేహితుడు ఫిర్యాదు చేశాడు. బాధిత భర్త ఫిర్యాదు మేరకు ముదురు ప్రియుడు, ముదురు ప్రేయసి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పది మంది సంతానం ఉన్న షకీల్‌, ఆరుగురు పిల్లలున్న పెళ్లి కుమార్తె తల్లి ఇలా చేయడం చూసి బంధువులు, చుట్టుపక్కల వారు ముక్కున వేలుసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.