Anant Ambani Pet Dog: అనంత్ అంబానీ పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్‌గా పెంపుడు కుక్క.. రూ.3కోట్ల ఖరీదైన కారులో షీకారు చేస్తుంది..!

అనంత్ అంబానీ కుక్క "హ్యాపీ"కి కోసం ఈ కారును ప్రత్యేకించి కొనుగోలు చేశారట. ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు కూడా సోషల్ మీడియాలో కనిపించాయి. ఈ SUVని అనంత్ గోల్డెన్ రిట్రీవర్ డాగ్‌ ఉపయోగిస్తుంది. G400dకి ముందు, హ్యాపీ టయోటా ఫార్చ్యూనర్, టయోటా వెల్‌ఫైర్‌లో ప్రయాణించినట్లు పోస్ట్‌లో పేర్కొన్నారు.

Anant Ambani Pet Dog: అనంత్ అంబానీ పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్‌గా పెంపుడు కుక్క.. రూ.3కోట్ల ఖరీదైన కారులో షీకారు చేస్తుంది..!
Ambani's Dog Car
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 16, 2024 | 9:51 PM

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలు ఈ యేడు ప్రారంభం నుండి ఇంటర్నెట్‌లో చర్చనీయాంశంగా మారింది. ఎంతో మంది ప్రముఖులు, బడా బడా వ్యాపారవేత్తలు వీరి వివాహం, ప్రీ-వెడ్డింగ్ వేడుకలకు హాజరు కావడం మనం చూశాము. ఇటీవల పెళ్లి సందర్భంగా చాలా మందిని ఆకర్షించిన మరో ఇంట్రెస్టింగ్‌ విషయం వారి కార్లు. అనంత్ అంబానీ, అతని కుటుంబం అత్యంత సుందరంగా అలంకరించబడిన రోల్స్ రాయిస్, S680 మేబ్యాక్‌లను ఉపయోగిస్తున్నారు. అయితే, అంబానీ కుటుంబానికి మాత్రమే ప్రత్యేకమైన కార్లు ఉండవని మీకు తెలుసా..? వారింట్లో పెంపుడు కుక్క గోల్డెన్ రిట్రీవర్ “హ్యాపీ” కూడా Mercedes-Benz G400d లగ్జరీ SUVని ఉపయోగిస్తుందని తెలిస్తే మీరు షాక్‌ తినాల్సిందే..!

G400d SUV ఫోటోలు ఇటీవల ఆన్‌లైన్‌లో కనిపించాయి. ఈ ఫోటోలు ఆటోమొబిలి ఆర్డెంట్ ఇండియా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. అంబానీ కుటుంబం వారి భద్రతా కాన్వాయ్‌లో అనేక G63 AMG SUVలను ఉపయోగిస్తుంది. కుటుంబానికి G63 AMG కూడా ఉంది. అయితే, G400d వీటన్నింటికీ భిన్నంగా ఉంటుంది. ఇది డీజిల్ SUV. అయితే, ఇది ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం ప్రత్యేకంగా కొనుగోలు చేయబడిన SUV. అనంత్ అంబానీ కుక్క “హ్యాపీ”కి కోసం ఈ కారును ప్రత్యేకించి కొనుగోలు చేశారట. ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు కూడా సోషల్ మీడియాలో కనిపించాయి. ఈ SUVని అనంత్ గోల్డెన్ రిట్రీవర్ డాగ్‌ ఉపయోగిస్తుంది. G400dకి ముందు, హ్యాపీ టయోటా ఫార్చ్యూనర్, టయోటా వెల్‌ఫైర్‌లో ప్రయాణించినట్లు పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఫార్చ్యూనర్, వెల్‌ఫైర్ రెండూ అత్యంత ఖరీదైన కార్లు. మార్కెట్లో టయోటా ఫార్చ్యూనర్ ధర దాదాపు రూ. 50 లక్షలు, వెల్‌ఫైర్ ధర దాదాపు రూ. 1.5 కోట్లు. ఇక్కడ ఇన్‌స్టా పోస్ట్‌లో కనిపించిన G400d SUV ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 2.55 కోట్లు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చాలా మంది షాకింగ్‌ కామెంట్స్‌ పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..