Watch: తల్లిదండ్రులూ బీ అలర్ట్..! మీ పిల్లలు ఇలాగే స్కూల్‌కి వెళ్తున్నారా..? వీడియోపై ఓ లుక్కేయండి
ఇక్కడ తల్లిదండ్రుల తప్పు కూడా ఉందని మరికొందరు వ్యాఖ్యానించారు. ఎందుకంటే.. తమ పిల్లలు స్కూల్‌కి, కాలేజీకి వెళ్లే క్రమంలో ఎలాంటి ప్రయాణం చేస్తున్నారో అప్పుడప్పుడు గమనిస్తుండాలని చెబుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగిన తరువాత ప్రభుత్వాన్ని ఆరోపించటం పరిపాటిగా మారిందంటూ మరికొందరు నెటిజన్లు పేర్కొన్నారు.
చాలా మంది పాఠశాల విద్యార్థులు ఆటోలు, రిక్షాలలో స్కూల్‌కి వెళ్తుంటారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు విన్యాసాలు చేస్తూ రోడ్లపై హల్‌చల్ చేస్తుంటారు. అలాంటిదే కొందరు స్కూల్ విద్యార్థులు చేస్తున్న స్టంట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఢిల్లీ-లక్నో హైవేపై విద్యార్థులు ఇలాంటి స్టంట్ చేయడం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. ఈ మార్గంలో భారీ వాహనాలు హై స్పీడ్‌తో వెళ్తుంటాయి. అలాంటిది ఒకే ఈ-రిక్షాలో దాదాపు 14 మంది విద్యార్థులు ప్రయాణిస్తుండటం అందరినీ షాక్‌కు గురిచేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అనేక మంది పిల్లలు ఈ-రిక్షాపై ప్రయాణిస్తూ, ఘోరమైన రీతిలో సరదాగా ఎంజాయ్ చేశారు. వైరల్ వీడియోలో విద్యార్థులు ఇ-రిక్షా చుట్టూ వేలాడుతూ దాని పైకప్పుపై కూడా కూర్చుని వెళ్తున్నారు. విద్యార్థులు రిక్షాకు వేలాడుతూ క్రమంలో ఆ రిక్షా బోల్తా పడే అవకాశం ఉంది. విద్యార్థులు చేస్తున్న ఈ స్టంట్‌ను అదే రోడ్డుపై ప్రయాణిస్తున్న ఎవరో వీడియో రికార్డ్ చేయగా, అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వైరల్‌గా మారిన వీడియోపై పోలీసులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని పలువురు నెటిజన్లు సూచించారు. ఎట్టకేలకు ఈ వీడియోలకు చేరింది. ఈ షాకింగ్ వీడియో ఢిల్లీ-లక్నో హైవే NH-9కి సంబంధించినదిగా తెలిసింది.
విద్యార్థుల ఈ స్టంట్‌పై సోషల్ మీడియాలో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్లక్ష్యం పోలీసుల వైపు కూడా ఉందని అంటున్నారు. ఎందుకంటే ఈ మార్గంలో డ్యూటీ పోలీసులు లేకపోవటం వల్లే ఆటో డ్రైవర్లు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అంటున్నారు. ఈ పిల్లలు తమ తల్లిదండ్రుల గురించి ఎందుకు ఆలోచించరు అని ఒకరు రాశారు.
ఇక్కడ తల్లిదండ్రుల తప్పు కూడా ఉందని మరికొందరు వ్యాఖ్యానించారు. ఎందుకంటే.. తమ పిల్లలు స్కూల్‌కి, కాలేజీకి వెళ్లే క్రమంలో ఎలాంటి ప్రయాణం చేస్తున్నారో అప్పుడప్పుడు గమనిస్తుండాలని చెబుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగిన తరువాత ప్రభుత్వాన్ని ఆరోపించటం పరిపాటిగా మారిందంటూ మరికొందరు నెటిజన్లు పేర్కొన్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..