TOP9 ET: గుడ్ న్యూస్ ఆ నెలలోనే OTTలోకి కల్కీ మూవీ..|ప్రౌడ్ మూమెంట్ మేడమ్ టుస్సాడ్స్‌లో చరణ్ విగ్రహం.
టుస్సాడ్ మ్యూజియంలో మైనపు విగ్రహం అంటే.. అదో గొప్ప విషయంగానే అందరూ ఫీలవుతుంటారు. చాలా గొప్పగా మాట్లాడుకుంటారు. అయితే ఈ గొప్ప మ్యూజియంలో ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహం కూడా పెట్టబోతున్నారు. ఇందుకోసం రీసెంట్‌గా మన స్టార్ హీరో.. లండన్ వెళ్లి తన బాడీ కొలతలను ఇచ్చినట్టు తెలుస్తోంది. తొందర్లో అఫీషియల్ న్యూస్ కూడా.. చరణ్ నుంచి మెడమ్ టుస్సాడ్స్ మ్యూజియం నుంచి బయటికి రాబోతున్నట్టు తెలుస్తోంది.
01.ram charan: ప్రౌడ్ మూమెంట్.. మేడమ్ టుస్సాడ్స్‌లో చరణ్ విగ్రహం.
టుస్సాడ్ మ్యూజియంలో మైనపు విగ్రహం అంటే.. అదో గొప్ప విషయంగానే అందరూ ఫీలవుతుంటారు. చాలా గొప్పగా మాట్లాడుకుంటారు. అయితే ఈ గొప్ప మ్యూజియంలో ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహం కూడా పెట్టబోతున్నారు. ఇందుకోసం రీసెంట్‌గా మన స్టార్ హీరో.. లండన్ వెళ్లి తన బాడీ కొలతలను ఇచ్చినట్టు తెలుస్తోంది. తొందర్లో అఫీషియల్ న్యూస్ కూడా.. చరణ్ నుంచి మెడమ్ టుస్సాడ్స్ మ్యూజియం నుంచి బయటికి రాబోతున్నట్టు తెలుస్తోంది. సో మెగా ఫ్యాన్స్.. బీ రెడీ ఫర్ సెలబ్రేషన్స్.
02.kalki : ధూం ధాంగా జరిగిన కల్కీ సక్సెస్ సెలబ్రేషన్స్
కల్కి మూవీ సక్సెస్ సెలబ్రేషన్ వేడుకలను.. కల్కి మూవీ మేకర్స్ ధూం ధాంగా గా సెలబ్రేట్ చేసుకుంది. ప్రభాస్ ఫ్యాన్స్ భాజా భజంత్రీలతో ఈ విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత అశ్వనీదత్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను వైజయంతి మూవీస్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
03.kalki ott: గుడ్ న్యూస్.. ఆ నెలలోనే OTTలోకి కల్కీ మూవీ..
కల్కి మూవీ సూపర్ డూపర్ హిట్టైంది. వెయ్యి కోట్లను దాటి మరీ కలెక్షన్స్‌ను వసూలు చేస్తోంది. దాంతో పాటే ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడొస్తుందన్న ఆరా… ఫిల్మ్ లవర్స్ నుంచి ఎక్కువవుతోంది. ఇక వారి కోసమే అన్నట్టు కల్కి మూవీకి సంబంధించిన ఓటీటీ న్యూస్ ఇప్పుడు బయటికి వచ్చింది. ఇక అకార్డింగ్ టూ ఆ న్యూస్.. సినిమా రిలీజైన పది వారాల తర్వాతే ఓటీటీలోకి తీసుకురానునన్నట్లు తెలుస్తోంది. అంటే దాదాపు సెప్టెంబరు రెండో వారంలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశముంది.
04.indian 2: మెగా ఫ్యాన్స్‌ను భయపెడుతోన్న భారతీయుడు
ఇండియన్2 రిజెల్ట్ కమల్ ఫ్యాన్సే కాదు.. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌ను కూడా భయపెడుతోంది. శంకర్ డైరెక్షన్లో చరణ్ చేస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ.. అంతకంతకూ డిలే అవుతున్న వేళ.. ఈ మూవీ రిజల్ట్ పై తెలియని భయం మెగా ఫ్యాన్స్ లో కలుగుతోంది. ఇదే విషయాన్ని నెట్టింట కన్వే చేస్తున్న చెర్రీ ఫ్యాన్స్… తమ కామెంట్స్లో .. గేమ్ ఛేంజర్ సూపర్ హిట్ కావాలని దేవున్ని ప్రేర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
05. game changer: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు షాక్.. గేమ్ ఛేంజర్ సీన్ లీక్!
దిల్ రాజు వార్నింగ్ ఇచ్చినా.. శంకర్ స్ట్రిక్ట్ కండీషన్స్ పెట్టినా .. గేమ్ ఛేంజర్ మూవీ లొకేషన్ నుంచి సీన్లు లీక్ అవ్వడం మాత్రం ఆగడం లేదు. ఇక తాజాగా ఈ మూవీ లొకేషన్ నుంచి మరో కీ సీన్ లీకైంది. అందులో రన్ వే పై.. చెర్రీ, విలన్ మధ్య ఏదో పవర్ ఫుల్ డిస్కషన్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడీ సీన్ నెట్టింట వైరల్ అవుతూ.. చరణ్ ఫ్యాన్స్ను పరేషాన్ అయ్యేలా చేస్తోంది. దాంతో పాటు ఈ మూవీపై అంచనాలను కూడా పెరిగేలా చేస్తోంది.
06.prabhas: ప్రభాస్ సినిమాను గేమ్ ఆఫ్ త్రోన్స్‌తో పోల్చిన నాగి
కల్కి మూవీతో ప్రభాస్ ఫ్యాన్స్‌కు బిగ్గెస్ట్ గిఫ్ట్ ఇచ్చిన డైరెక్టర్ నాగి… ఇప్పుడు తన కిష్టమైన ప్రభాస్ సినిమాను గేమ్ ఆఫ్ త్రోన్స్‌తో పోల్చి వారిలో అంతులేని ఆనందాన్ని కలిగించారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగి.. ప్రభాస్ సలార్ సినిమా గేమ్ ఆఫ్ త్రోన్స్‌లా అనిపిస్తుందన్నారు. అందుకే సలార్ 2 కోసం తాను ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ మాటతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు నాగి.
07.malvi: మాల్వీ మల్హోత్రాపై హత్యాయత్నం!
ఆల్రెడీ లావణ్య ఆరోపణలతో.. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో.. చిక్కుల్లో పడిన మాల్వీ మల్హోత్రాపై గతంలో ఓ హత్యాయత్నం జరిగిన న్యూస్ తాజాగా బయటికి వచ్చింది. గతంలో మాల్వి మల్హోత్రా.. అసిస్టెంట్ ప్రొడ్యూసర్ యోగేష్ తో ఎఫైర్ నడిపిందని, ఇద్దరికీ మనస్పర్థలు రాగా మాల్వి మల్హోత్రా పై యోగేష్ కత్తితో దాడి చేశాడని తెలుస్తోంది. అంతేకాదు ఈ దాడి 2020లో ముంబయ్లో జరిగినట్టు..ఈ దాడిలో ఆమెకు తీవ్రగాయాలవడంతో కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందినట్టు రిపోర్ట్. అయితే ఈ దాడిలో అరెస్ట్ అయిన యోగేష్ తల్లే.. తాజాగా మాల్వీ పై పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది.
08.sonu: జోరు వానలోనూ.. సాయం ఆపని సోనూ సూద్.
పరులకు సాయం చేయడాన్నే ప్రధానమైన పనిగా పెట్టుకున్న సోనూ సూద్.. జోరు వానలోనూ.. తను పెట్టుకున్న నియమాన్ని విస్మరించలేదు. తన ఇంటి ముందు ఆపన్న హస్తం కోసం వేచి చూస్తున్న వేలాది మందిని చూసి చలించిపోయిన ఈయన… వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వారి దగ్గరికి వెళ్లి మాట్లాడారు. తమ టీంతో వారికి సాయం గురించి మాట్లాడారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
09.bad news: అతిగా అందాలు ఆరబోస్తే కత్తెరే పాపం! త్రిప్తికి ఇది బ్యాడ్ న్యూసే..!
అతిగా అందాలు ఆరోసే హీరోయిన్లకు.. వాళ్లతో ఆ పని చేయించే మేకర్స్‌కు గట్టి గోడలా.. సన్నని ఫిల్టర్‌గా ఉండే సెన్సార్ బోర్డ్.. బ్యాడ్ న్యూస్ సినిమా విషయంలో తమ పనిని చాలా ఎఫెక్టివ్‌గా చేసినట్టు తెలుస్తోంది. త్రిప్తి, విక్కీ కౌషల్ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన బ్యాడ్ న్యూస్ సినిమాలో.. కాస్త అతిగా ఉన్న మూడు ఇంటిమెసీ సీన్లకు కత్తెర వేసినట్టు న్యూస్ బయటికి వచ్చింది. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన బ్యాడ్ న్యూస్ వీడియో సాంగ్స్‌లో త్రిప్తి రెచ్చిపోయి మరీ ఎక్స్‌పోజ్ చేయడం కాస్త కాంట్రో అయింది. మేకర్స్ పై.. త్రిప్తి పై నెగెటివ్ కామెంట్స్ కు కారణం అయింది. ఈ క్రమంలోనే సెన్సార్ బోర్డ్ ఈ మూవీలోని ఇంటిమసీ సీన్లకు కత్తెర వేయడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.