Hardik Pandya: నటాషాతో విడాకులు.. అఫీషియల్‏గా ప్రకటించిన హార్దిక్ పాండ్యా..

గత కొన్నాళ్లుగా టిమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితంపై అనేక రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. తన భార్య నటాషాతో హార్దిక్ విడిపోయారని.. వీరిద్దరు విడాకులు తీసుకున్నారంటూ ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు ఆ రూమర్స్ నిజమేనంటూ తేల్చేశారు హార్దిక్ పాండ్యా.

Hardik Pandya: నటాషాతో విడాకులు.. అఫీషియల్‏గా ప్రకటించిన హార్దిక్ పాండ్యా..
Hardik Pandya, Natasa Stank
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 18, 2024 | 10:00 PM

గత కొన్నాళ్లుగా టిమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితంపై అనేక రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. తన భార్య నటాషాతో హార్దిక్ విడిపోయారని.. వీరిద్దరు విడాకులు తీసుకున్నారంటూ ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు ఆ రూమర్స్ నిజమేనంటూ తేల్చేశారు హార్దిక్ పాండ్యా. భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషాతో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. డివోర్స్ విషయాన్ని వీరిద్దరు తమ సోషల్ మీడియా ఖాతాలలో అధికారికంగా వెల్లడించారు. ఇది తమకు చాలా కఠినమైన నిర్ణయమని పేర్కొన్నారు. ఇద్దరూ విడిపోయినా.. తమ మూడేళ్ల కొడుకు అగస్త్య బాధ్యతలను తల్లిదండ్రులుగా కొనసాగిస్తామని తెలిపారు.

“నాలుగు సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత, నటాషా, నేను పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మేము కలిసి ఉండేందుకు చాలా ప్రయత్నం చేసాము. మా ఇద్దరికి ఇది కఠినమైన నిర్ణయమే.. కానీ మా ఇద్దరికీ ఇది మంచి ప్రయోజనం చేకూరుస్తుందని మేము నమ్ముతున్నాము. మేము కలిసి ఆనందించిన సమయం, పరస్పర గౌరవం, ఒక కుటుంబంగా ఎదిగాము. ఈ ప్రయాణాన్ని మేము సంతోషించాము. మా అబ్బాయి అగస్త్యకు మంచి కో పేరెంట్స్ గా ఉంటాం. అతడిని సంతోషంగా ఉంచడం కోసం ఏం చేయడానికైనా సిద్ధమే. ఈ కష్ట సమయంలో మా గోప్యతను గౌరవిస్తూ.. మద్దతు ఇవ్వాలని అందరిని కోరుకుంటున్నాను.. ” అని పాండ్యా, నటాషా తమ ఇన్ స్టాలలో షేర్ చేశారు.

ఇదిలా ఉంటే.. నటాషా తన ఇన్ స్టాలో పాండ్యా ఇంటి పేరుతోపాటు తమ పెళ్లి ఫోటోలను తొలగించినప్పటి నుంచి విడాకుల రూమర్స్ ఊపందుకున్నాయి. ఆ తర్వాత వీరిద్దరు కలిసి కనిపించలేదు. ఇటీవల టీ20 వరల్డ్ కప్ విజేతగా టీమిండియా నిలిచిన తర్వాత నటాషా తీరుపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఇటీవల జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలలోనూ హార్దిక్ పాండ్యా ఒంటరిగా హాజరవ్వడంతో వీరిద్దరి విడాకుల రూమర్స్ కు మరింత బలం చేకూరింది. ఇటీవలే తన కుమారుడు అగస్త్యను తీసుకుని నటాషా సెర్పియాకు వెళ్లిపోవడంతో విడాకులు నిజమేనని అందరూ ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు తాము నిజంగానే విడిపోతున్నామంటూ అధికారికంగా ప్రకటించారు. కానీ వీరిద్దరు విడిపోవడానికి కారణాలు తెలియరాలేదు.

View this post on Instagram

A post shared by @natasastankovic__

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.