AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Instagram Influencer: రీల్స్ చేస్తూ 300 అడుగుల జలపాతంలో పడిపోయిన ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్‌.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ ప్రమాదవశాత్తు జలపాతంలో పడి మృతిచెందింది. మహారాష్ట్రలోని రాయ్‌ఘడ్ సమీపంలోని కుంభే జలపాతంలో వద్ద ఉన్న కొండగట్టులో పడి ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆన్వీ కామ్దార్ (26) మరణించింది. ముంబైకి చెందిన ఆన్వీ కామ్దార్ జూలై 16న రీల్ చిత్రీకరించేందుకు ఏడుగురు స్నేహితులతో కలిసి జలపాతం వద్దకు విహారయాత్రకు వెళ్లింది. ప్రమాదం జరిగిన రోజున ఉదయం 10.30 గంటల ప్రాంతంలో..

Instagram Influencer: రీల్స్ చేస్తూ 300 అడుగుల జలపాతంలో పడిపోయిన ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్‌.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
Instagram Influencer
Srilakshmi C
|

Updated on: Jul 19, 2024 | 5:52 AM

Share

ముంబై, జులై 18: ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ ప్రమాదవశాత్తు జలపాతంలో పడి మృతిచెందింది. మహారాష్ట్రలోని రాయ్‌ఘడ్ సమీపంలోని కుంభే జలపాతంలో వద్ద ఉన్న కొండగట్టులో పడి ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆన్వీ కామ్దార్ (26) మరణించింది. ముంబైకి చెందిన ఆన్వీ కామ్దార్ జూలై 16న రీల్ చిత్రీకరించేందుకు ఏడుగురు స్నేహితులతో కలిసి జలపాతం వద్దకు విహారయాత్రకు వెళ్లింది. ప్రమాదం జరిగిన రోజున ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఆన్వీ 300 అడుగుల లోయ వద్ద వీడియో చిత్రీకరిస్తుండగా జలపాతంలో జారి పడిపోయింది. దీంతో విహారయాత్రలో విషాదం నెలకొంది. స్థానిక అధికారులు త్వరితగతిన స్పందించి రెస్క్యూ టీమ్‌తో సంఘటనా స్థలానికి చేరుకుంది.

కోస్ట్ గార్డ్, కోలాడ్ రెస్క్యూ టీమ్, మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ సిబ్బంది సంఘటన స్థలంలో గాలింపు చర్యలు చేపట్టగా దాదాపు 300-350 అడుగుల లోయలో ఆన్వీ పడిపోయి, తీవ్ర గాయాలపాలైనట్లు గుర్తించారు. ఎంతో కష్టం మీద ఆమె వద్దకు చేరుకున్నప్పటికీ.. అదే సమయంలో భారీ వర్షం కురుస్తున్నందున,  గాయలపాలైన ఆమెను పైకి లేపడం కష్టంగా మారింది. అయినప్పటికీ ఆరు గంటలపాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్ తర్వాత ఆన్వీని కొండగట్టు నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. తీవ్ర గాయాలపాలైన ఆమెను మనగావ్‌ సబ్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే అన్వీ అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ నేపథ్యంలో తహసీల్దార్, మనగావ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌తో సహా స్థానిక అధికారులు పర్యాటకులకు, పౌరులకు విజ్ఞప్తి చేశారు. సహ్యాద్రి శ్రేణుల సుందర దృశ్యాలను వీక్షించేందుకు వచ్చే వారందరూ బాధ్యతాయుతంగా పర్యాటక స్థలంలో ప్రవర్తించాలని కోరారు. పర్యాటకులు తమ భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రాణాలకు ముప్పు కలిగించేలా ప్రమాదకరంగా ప్రవర్తించరాదని విజ్ఞప్తి చేశారు.

కాగా వర్షాకాలం పర్యాటనకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఆన్వీ కామ్దార్‌కు ఆసక్తి ఎక్కువ. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కుంభే జలపాతం వద్ద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. జలపాతం అందాలను తిలకించే ప్రయత్నంలో ఆమె అందులోపడిపోయి మరణించింది. ప్రకృతి అద్భుతాలను అన్వేషించడం పట్ల ఆమెకున్న ప్రేమ ఆమె సోషల్ మీడియా పోస్ట్‌లలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో ఆమె కొన్ని రిస్కీ ప్రాంతాల్లో కూడా రీల్స్ చేసి గతంలో పలు సందర్భాల్లో పోస్టులు పెట్టింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలకు పిచ్చిఫాలోయింగ్‌ ఉంది. ఏకంగా 2,56,000 మంది ఫాలోవర్లు ఆమె ఇన్‌స్టాలో ఉన్నారు. ఆమె వీడియోల్లో ట్రావెల్ డిటెక్టివ్‌గా వ్యవహరిస్తుంటుంది. లగ్జరీ అన్వేషణలు, కేఫ్‌లు, ప్రయాణాలు, చిట్కాలు, వైబ్‌ల గురించి అధికంగా వీడియోలను చిత్రీకరిస్తూ ఉంటుంది. ఈ అలవాటే ఇప్పుడు ఆమె ప్రాణాలను కూడా హరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.