AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ధరణి సమస్యలపై సీఎం రేవంత్ ఉన్నతస్థాయి సమీక్ష.. కీలక ఆదేశాలు..

ధరణి సమస్యల పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ధరణి పోర్టల్‎లో తలెత్తిన సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలన్నారు. సవరణలపై కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఉన్నతాధికారుల సమావేశంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతుల పట్టాదారు పాసుబుక్కులకు సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

Telangana: ధరణి సమస్యలపై సీఎం రేవంత్ ఉన్నతస్థాయి సమీక్ష.. కీలక ఆదేశాలు..
Revanth Reddy
Prabhakar M
| Edited By: Srikar T|

Updated on: Jul 26, 2024 | 7:56 PM

Share

ధరణి సమస్యల పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ధరణి పోర్టల్‎లో తలెత్తిన సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలన్నారు. సవరణలపై కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఉన్నతాధికారుల సమావేశంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతుల పట్టాదారు పాసుబుక్కులకు సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సవరణలపై ప్రజాభిప్రాయం పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించి, అందరి అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల అభిప్రాయాలు, సూచనల ఆధారంగా సమగ్ర చట్టం రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే అసెంబ్లీలోనూ చర్చ పెడదామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ఆ తరువాత పంచాయత్ రాజ్‌ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ హాజరు అయ్యారు. ఎల్.ఆర్‌.ఎస్ విధివిధానాల‌పై పూర్తి స్థాయిలో క‌స‌ర‌త్తు నిర్వ‌హించారు. ఎల్.ఆర్.ఎస్ వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాల‌ని అధికారులకు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క సూచించారు. ఎల్.ఆర్.ఎస్ అనుమ‌తుల కోసం ప్ర‌జ‌లు చేసుకున్న ద‌ర‌ఖాస్తులు వీలైనంత వేగంగా ప‌రిష్క‌రించాల‌ని తెలిపారు. ఇందుకోసం 33 జిల్లాల్లో ప్ర‌త్యేకంగా ఒక టీముల‌ను రూపొందుకోవాల‌ని చెప్పారు. సిబ్బంది కొర‌త ఉంటే ఇత‌ర శాఖ‌ల నుంచి డెప్యుటేష‌న్ పై పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాల‌న్నారు. ఈ సమావేశానికి మంత్రులతో పాటూ.. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, మాజీమంత్రి జానారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ధరణి కమిటీ సభ్యులు కోదండ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ వకులాభారణం కృష్ణ మోహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..