AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Xiaomi Valentine’s Day Sale: ఈ 5జీ ఫోన్ పై అదిరే ఆఫర్.. గ్రాండ్ లుక్.. టాప్ క్లాస్ ఫీచర్స్..

రెడ్ మీ నోట్ 13 5జీ అనేది చాలా మంచి ఆప్షన్. ఇది రూ. 20,000 బడ్జెట్లోనే అందుబాటులో ఉంటుంది. ఇది ప్రిసమ్ గోల్డ్ షేడ్ హైలైట్ ఫినిష్ తో వస్తుంది. ఇది మీ భాగస్వామికి లేదా గర్ల్ ఫ్రెండ్ కి గిప్ట్ ఇవ్వాలనుకునేవారికి బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. అంతేకాక జియోమీ వాలెంటైన్స్ డే సేల్ 2024 సందర్భంగా దీనిపై బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ చేంజ్ బెనిఫిట్స్ లభిస్తాయి.

Xiaomi Valentine's Day Sale: ఈ 5జీ ఫోన్ పై అదిరే ఆఫర్.. గ్రాండ్ లుక్.. టాప్ క్లాస్ ఫీచర్స్..
Redmi Note 13 5g
Madhu
| Edited By: TV9 Telugu|

Updated on: Feb 14, 2024 | 1:44 PM

Share

జియోమీ వాలెంటైన్స్ డే ప్రత్యేక సేల్ 2024ను ప్రకటించింది. దీనిలో జియోమీ ఉత్పత్తులపై అదిరే ఆఫర్లను అందిస్తోంది. మీ ప్రియమైన వారికి ఏదైనా బహుమతి ఇవ్వాలనుకుంటే ఇదే బెస్ట్ టైం. మంచి స్మార్ట్ ఫోన్ అది కూడా 5జీ ఫోన్లపై టాప్ డీల్స్ ఇక్కడ ఉన్నాయి. అటువంటి బెస్ట్ డీల్స్ ఒకటి రెడ్ మీ 13 సిరీస్. ఈ సిరీస్లో మొత్తం మూడు ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్లను జియోమీ గత నెలలో లాంచ్ చేసింది. వీటిల్లో వెనీలా మోడల్ రెడ్ మీ నోట్ 13 5జీ అనేది చాలా మంచి ఆప్షన్. ఇది రూ. 20,000 బడ్జెట్లోనే అందుబాటులో ఉంటుంది. ఇది ప్రిసమ్ గోల్డ్ షేడ్ హైలైట్ ఫినిష్ తో వస్తుంది. ఇది మీ భాగస్వామికి లేదా గర్ల్ ఫ్రెండ్ కి గిప్ట్ ఇవ్వాలనుకునేవారికి బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. అంతేకాక జియోమీ వాలెంటైన్స్ డే సేల్ 2024 సందర్భంగా దీనిపై బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ చేంజ్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఈ నేపథ్యంలో ఈ రెడ్ మీ నోట్ 13 5జీ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల గురించి తెలుసుకుందాం..

రెడ్ మీ నోట్ 13 5జీ ధర..

ఈ స్మార్ట్ ఫోన్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 17,999 నుంచి ప్రారంభమవుతుంది. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 19,999, 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 21,999కి లభిస్తుంది. ఇది ప్రిసమ్ గోల్డ్ కలర్ తో పాటు ఆర్కిటిక్ వైట్, స్టీల్త్ బ్లాక్ షేడ్లలో లభిస్తోంది. కొనుగోలుదారులు ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డులు, హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ. 1000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ ను పొందొచ్చు. అంతేకాక ఎంఐ ఎక్స్ చేంజ్ పాలసీలో భాగంగా రూ. 1500 వరకూ డిస్కౌంట్ బోనస్ ను పొందొచ్చు.

రెడ్ మీ నోట్ 13 స్పెసిఫికేషన్లు..

ఈ స్మార్ట్ ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ అమోల్డ్ 120హెర్జ్ స్క్రీన్ 1000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో వస్తుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6080 సీపీయూ మాలీ జీ57 ఎంసీ2 జీపీయూ నుంచి శక్తని పొందుతుంది. ఎంఐయూఐ 14 ఆధారంగా పనిచేసే ఆండ్రాయిడ్ 13 పై ఫోన్ పనిచేస్తుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ల ఫాస్ట్ చార్జింగ్ స పోర్టుతో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇక కెమెరా విషయానికి వస్తే ఐపీ 54 రేటింగ్ తో కూడిన 108ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపీ మాక్రో లెన్స్ కెమెరా ఉంటుంది. ముందు వైపు 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. కనెక్టివిటీ ఫీచర్లను పరిశీలిస్తే వైఫై 5, బ్లూటూత్ 5.3, హెడ్ ఫోన్ జాక్, ఐఆర్ బ్లాస్టర్, యూఎస్బీ టైప్ సీ పోర్టు ఇచ్చింది. అలాగే సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..