Airtel Recharge Plans: ఎయిర్‌టెల్ బెస్ట్ రీచార్జ్ ప్లాన్స్ ఇవే.. అపరిమిత 5జీ డేటాతో పాటు ఉచిత ఓటీటీ సబ్ స్క్రిప్షన్స్..
ప్రధాన పోటీ జియో, ఎయిర్ టెల్, వీఐ మధ్యనే ఉంది. ఎయిర్ టెల్, జియో అయితే దేశ వ్యాప్తంగా ఇప్పటికే 5జీ సేవలను సైతం లాంచ్ చేశాయి. వినియోగదారులకు అపరిమిత డేటా కనెక్టివిటీని అందిస్తున్నాయి. వీఐ కూడా త్వరలోనే సరికొత్త సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఎక్కువ రోజుల వ్యాలిడితో ఎక్కువ మంది ప్లాన్లను కోరుకుంటున్నారు.
దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థల మధ్య పోటీ వాతావరణం నెలకొంది. దీంతో వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్త కొత్త ప్లాన్లను లాంచ్ చేస్తున్నాయి. ప్రధాన పోటీ జియో, ఎయిర్ టెల్, వీఐ మధ్యనే ఉంది. ఎయిర్ టెల్, జియో అయితే దేశ వ్యాప్తంగా ఇప్పటికే 5జీ సేవలను సైతం లాంచ్ చేశాయి. వినియోగదారులకు అపరిమిత డేటా కనెక్టివిటీని అందిస్తున్నాయి. వీఐ కూడా త్వరలోనే సరికొత్త సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఎక్కువ రోజుల వ్యాలిడితో ఎక్కువ మంది ప్లాన్లను కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఎయిర్ టెల్ 84 రోజుల వ్యాలిడిటీతో బెస్ట్ ప్లాన్లను అందిస్తోంది. ఆ ప్లాన్ల వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎయిర్‌టెల్ 84 రోజుల రీఛార్జ్ ప్లాన్‌లు..
ఎయిర్‌టెల్ రూ. 455.. ఈ ప్లాన్ 84 రోజుల వాలిడిటీని అందిస్తుంది. ఇది ఎక్కువ కాలం లభించే ప్లాన్లలో చవకైనది. దీనిలో 6జీబీ హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. అపరిమిత కాల్స్, 900 ఉచిత ఎస్ఎంఎస్ లతో పాటు అపోలో 24/7 సర్కిల్, ఉచిత హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలను అందిస్తుంది.
ఎయిర్‌టెల్ రూ.719.. ఈ ప్లాన్ 84 రోజుల వాలిడిటీని అందిస్తోంది. ప్రతి రోజూ 1.5GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. అపరిమిత కాల్‌లు, అపరిమిత 5జీ డేటా, రివార్డ్‌మినీ సబ్‌స్క్రిప్షన్, అపోలో 24/7 సర్కిల్, ఉచిత హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ వంటి ప్రయోజనాలు ఉంటాయి. ప్రతి రోజు 100 ఎస్ఎంఎస్ లు ఉచితంగా చేసుకోవచ్చు.
ఎయిర్‌టెల్ రూ. 869.. ఈ ప్యాక్ 84 రోజుల వాలిడిటీతో వస్తుంది. ప్రతి రోజూ 2జీబీ హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాల్‌లు, అపరిమిత 5జీ డేటా, 15+ ఓటీటీ యాప్‌లతో పాటు ఎయిర్‌టెల్ ఎక్స్ ట్రీమ్, ప్లే, రివార్డ్ మినీ సబ్‌స్క్రిప్షన్, అపోల్లో 24/7 సర్కిల్, ఉచిత హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ వంటి ప్రయోజనాలను అందిస్తోంది. డిస్నీ+హాట్‌స్టార్ 3 నెలల సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది. అలాగే ప్రతి రోజూ 100ఎస్ఎంఎస్ లు ఉచితంగా పొందొచ్చు.
ఎయిర్‌టెల్ రూ. 999.. ఇది కూడా 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ప్రతి రోజూ 2.5జీబీ హై-స్పీడ్ రోజువారీ డేటా అందిస్తుంది. అపరిమిత కాల్‌లు, అపరిమిత 5జీ డేటా, 15+ ఓటీటీ యాప్‌లతో పాటు ఎయిర్‌టెల్ ఎక్స్ ట్రీమ్, ప్లే, రివార్డ్ మినీ సబ్‌స్క్రిప్షన్, అపోల్లో 24/7 సర్కిల్, ఉచిత హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ వంటి ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ప్యాక్ అమెజాన్ ప్రైమ్ వీడియో సభ్యత్వాన్ని 84 రోజుల పాటు ఇస్తుంది. ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్లను అందిస్తుంది.
ఎయిర్‌టెల్ రూ. 1499.. ఈ ప్యాక్ కూడా 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ప్రతి రోజూ 3జీబీ హై-స్పీడ్ డేటా చెల్లుబాటుతో వస్తుంది. అపరిమిత కాల్‌లు, అపరిమిత 5జీ డేటా, 15+ ఓటీటీ యాప్‌లతో పాటు ఎయిర్‌టెల్ ఎక్స్ ట్రీమ్, ప్లే, రివార్డ్ మినీ సబ్‌స్క్రిప్షన్, అపోల్లో 24/7 సర్కిల్, ఉచిత హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ వంటి ప్రయోజనాలను అందిస్తోంది. ప్యాక్ 84 రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్ సభ్యత్వాన్ని అందిస్తుంది. కస్టమర్‌లు ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లను కూడా పొందుతారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..