AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Copilot: ఏఐలో దూకుడు పెంచిన మైక్రోసాఫ్ట్‌.. ఇమేజ్‌ ఎడిటింగ్ కోసం కొత్తగా..

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ గురించి చర్చ జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఏఐ వినియోగం భారీగా పెరిగింది. టెక్నాలజీ మార్పులో భాగంగా ఏఐని ఉపయోగించడం అనివార్యంగా మారింది. ఇందులో భాగంగానే దిగ్గజ కంపెనీలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగిస్తున్నాయి. ప్రముఖ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సైతం ఏఐలో దూకుడు పెంచింది..

Narender Vaitla
|

Updated on: Feb 11, 2024 | 11:09 PM

Share
 టాప్‌ టెక్‌ కంపెనీలన్నీ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో పెట్టుబడులను పెంచుకుంటూ పోతున్నాయి. మారుతోన్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని పెంచుకుంటూ పోతున్నాయి. ఇందులో భాగంగానే ఏఐ టెక్నాలజీపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి.

1 / 5
ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ టెక్‌ కంపెనీ మైక్రోసాఫ్ట్‌ సైతం ఏఐలో పెట్టుబడులు పెడుతోంది. ఇందులో భాగంగానే తాజాగా తన కోపైలట్ ఆప్షన్‌కు కొత్తగా AI ఇమేజ్ ఎడిటింగ్‌ టూల్స్‌ను యాడ్ చేసింది.

2 / 5
దీనికోసం "స్ట్రీమ్‌లైన్డ్ లుక్ అండ్ ఫీల్"ని తీసుకొచ్చింది. కంపెనీ తన బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొన్నదాని ప్రకారం, కోపైలట్ కొత్త ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంటుంది. వెబ్‌సైట్‌లో, హోమ్‌పేజీ పైభాగంలో ఒకే కోపైలట్ లోగో కనిపిస్తుంది. దానిలో వివిధ కలర్స్‌తో AI ద్వారా రూపొందించిన ఫొటోలు, వాటి చుట్టూ టెక్స్ట్ ప్రాంప్ట్‌లు ఉంటాయి

3 / 5
వాటి కింద యూజర్లు ప్రశ్నలను అడగడానికి టెక్స్ట్ ఫీల్డ్‌ను చూస్తారు. దీంతో పాటు మైక్రోసాఫ్ట్ రూపొందించిన ఫొటోలకు ఇన్-లైన్ ఎడిటింగ్ చేయగల డిజైనర్ అనే కొత్త టూల్‌ను కోపైలట్‌కు యాడ్‌ చేశారు.

4 / 5
ఈ ఫీచర్‌ సహాయంతో యూజర్లు చాట్ విండో నుంచి ఎగ్జిట్‌ కాకుండానే.. ఫొటోలో మార్పులు చేసుకోవచ్చు. ఈ ఎడిటింగ్ టూల్‌ ద్వారా ఫొటోలో మీకు కావాల్సి వస్తువువును హైలెట్ చేసుకోవచ్చు. వాటి కలర్స్‌ను మరింత మెరుగుపరుచుకోవచ్చు.

5 / 5