- Telugu News Photo Gallery Technology photos Xiaomi launching new smartphone Xiaomi 14 Ultra, Xiaomi 14 on february 25th
Xiaomi 14: లాంచింగ్‌కు సిద్ధమైన షావోమీ 14 సిరీస్.. స్టన్నింగ్ లుక్, సూపర్ ఫీచర్స్..
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. షావోమీ 14 సిరీస్‌కు సంబంధించి గతకొన్ని రోజులు వార్తలు వస్తున్నా. లాంచింగ్ తేదీ ఎప్పుడన్నదానిపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. అయితే తొలిసారి షావోమీ 14 సిరీస్ లాంచింగ్‌కు సంబంధించి అధికారిక ప్రకటన చేసింది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్స్ ఉండనున్నాయో ఇప్పుడు చూద్దాం..
Updated on: Feb 11, 2024 | 11:07 PM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. షావోమీ 14 సిరీస్ ఫోన్‌లను ఈ నెల 25వ తేదీన గ్లోబల్ మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా షావోమీ 14 అల్ట్రాతో పాటు, షావోమీ 14, 14 ప్రో మోడల్స్‌ను లాంచ్ చేయనున్నారు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే షావోమీ 14 అల్ట్రాలో 6.73 ఇంచెస్‌తో కూడిన క్యూ హెచ్డీ+ అమోఎల్ఈడీ ఎల్టీపీఓ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం.

ఈ ఫోన్‌లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ఎస్వోసీ చిప్ సెట్‌ను ఇవ్వనున్నారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ ఓఎస్ వర్షన్ పై పని చేస్తుంది. అయితే వీటికి ధరకు సంబంధించిన కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఇక కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్‌లో లైకా బ్యాక్డ్ ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్‌ను ఇవ్వనున్నారు. 50-మెగా పిక్సెల్ 1-అంగుళం ప్రైమరీ కెమెరా, 50-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రా వైడ్ లెన్స్, మరో రెండు 50-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాలు ఉంటాయి.

రెండు 50-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాల్లో ఒకటి 3ఎక్స్, మరొకటి 5ఎక్స్ జూమ్ కెపాసిటీ కలిగి ఉంటాయి. అలాగే 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు. ఇక ఈ ఫోన్‌లో 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5300 ఎంఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నారు.




