AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold: అంతరిక్షంలో టన్నుల కొద్దీ బంగారం..? శాస్త్రవేత్తలు చెబుతున్న ఆసక్తికర విషయాలు..

ఇప్పటి వరకూ బంగారం ఎక్కడి నుంచి వెలికితీస్తారు అంటే మైన్స్ నుంచి అని అందరికీ తెలుసు.. కానీ అంతరిక్షంలో బంగారం ఉద్భవిస్తుందని చెబితే నమ్ముతారా? అయితే కూడా కొన్ని వందల వేల టన్నుల బరువైన బంగారం ఉత్పత్తి అవుతుందంటే విశ్వసిస్తారా? పరిశోధకులు మాత్రం ఇది నమ్మితీరాల్సిన విషయమని నొక్కి చెబుతున్నారు. కిలోనోవా అని పిలిచే నక్షత్రాల విస్పోటనం కారణంగా ఇది జరుగుతుందని వివరిస్తున్నారు.

Gold: అంతరిక్షంలో టన్నుల కొద్దీ బంగారం..? శాస్త్రవేత్తలు చెబుతున్న ఆసక్తికర విషయాలు..
Kilonova Explosion
Madhu
| Edited By: Janardhan Veluru|

Updated on: Jan 01, 2024 | 2:36 PM

Share

విశ్వం ఎప్పుడూ అద్భుతమే. అనంత రహస్యాలు దానిలో దాగి ఉన్నాయి. దానిని ఛేదించడానికి మానవుడు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఇప్పటి వరకూ తెలిసింది గోరంత అయితే తెలియాల్సింది కొండంత. ఖగోళ శాస్త్రవేత్తలు, పరిశోధకులు విశ్వాంతరాలలోకి వెళ్లి కొత్త విషయాలను మనకు తెలియజేస్తూనే ఉంటారు. ఈ క్రమంలో మరో కొత్త అంశం ఒకటి ఇటీవల పరిశోధకులు తెరపైకి తీసుకొచ్చారు. అదేంటంటే నక్షత్రాల నుంచి బంగారం ఉద్భవిస్తుందట. అంతరిక్షంలో జరిగే భారీ పేలుళ్ల కారణంగా అనేక లోహాలు ఉద్భవిస్తాయని, వాటిల్లో బంగారం కూడా ఉంటుందని ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇవి..

కిలోనోవా అంటే..

కిలోనోవా అనేది విశ్వంలోని అత్యంత తీవ్రమైన పేలుళ్లలో ఒకటి. రెండు బలమైన న్యూట్రాన్ నక్షత్రాలు ఢీకొన్న తర్వాత సంభవించే పేలుడును కిలోనోవా అంటారు. కొన్ని వేల ఏళ్ల క్రితం జరిగిన కిలోనోవా పేలుళ్ల వల్ల భూమిపై ఉన్న లోహాలు ఏర్పడ్డాయని పరిశోధకులు చెబుతున్నారు. వీటిల్లో బంగారం కూడా ఒకటి కచ్చితంగా చెబుతున్నారు. అయితే పేలుడు ద్వారా బంగారంతో సహా లోహాలు భూమికి ఎలా చేరాయో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు సరికొత్త నమూనాను రూపొందించారు. అందుకోసం అసలు ఈ కిలోనోవా పేలుడు ఎలా జరుగుతుంది? దాని వల్ల ఏం ఏర్పడుతుందని అధ్యయనం చేశారు.

అధ్యయనం ఇలా..

మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్రావిటేషనల్ ఫిజిక్స్, యూనివర్సిటీ ఆఫ్ పోట్స్‌డామ్ నుంచి పరిశోధకుల బృందం కిలోనోవా పేలుడును 2017 సంవత్సరంలో అధ్యయనం చేసింది. అందుకోసం అధునాతన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించారని ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. 2017 సంవత్సరంలో రికార్డ్ చేయబడినది కాకుండా, ఇతర నక్షత్రాల రేడియో, ఎక్స్-రే పరిశీలన నుంచి పొందిన మరింత డేటా అదనంగా తీసుకున్నానరు. అలాగే భూమిపై నిర్వహించిన తాకిడి ప్రయోగం నుంచి సేకరించిన ఫలితాలు కూడా క్రోడీకరించారు.

ఇవి కూడా చదవండి

బంగారం ఎలా వస్తుందంటే..

పై అధ్యయనం ఆధారంగా.. రెండు నక్షత్రాలు తమ శక్తిని కోల్పోయి కక్ష్య నుంచి పక్కకు జరిగినప్పుడు ఒకదానికొకటి ఢీకొనే అవకాశం ఉంది. అలా జరిగినప్పుడు విపరీతమైన శబ్దంతో పాటు, నమ్మశక్యం కాని కాంతి వెలువడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దానితో పాటు కొన్ని అవశేషాలు, లోహాలు కూడా ఉద్భవిస్తాయని చెప్పారు. ఈ అవశేషాలలో ఒక టీస్పూన్ పదార్థం మిలియన్ టన్నుల బరువు ఉంటుందని పేర్కొన్నారు. ఈ లోహాల్లో బంగారం కూడా ఒకటని నిర్ధారించారు. అదే సమయంలో రెండు నక్షత్రాలు ఒకదానికొకటి ఢీకొని విలీనం అయి మరో కొత్త న్యూట్రాన్ నక్షత్రం తయారవుతుందని వివరించారు.

భూమి వినాశనం..

కిలోనోవా పేలుడు నుంచి అనేక రకాల ఖగోళ డేటాను విశ్లేషించడానికి పరిశోధకులు సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు. వివిధ డేటా మూలాధారాలు విడిగా విశ్లేషించబడతాయని, కొన్ని సందర్భాల్లో విభిన్న భౌతిక నమూనాలను ఉపయోగించి వివరించబడతాయని మాక్స్ ప్లాంక్ సొసైటీ వివరిస్తుంది. నక్షత్ర విలీనాల్లో భారీ మూలకాలు ఎలా ఏర్పడతాయో ఇది వెల్లడిస్తుందని పరిశోధకుడు టిమ్ డైట్రిచ్ పేర్కొన్నారు. ఆగస్ట్ 17, 2017న, లిగో, విర్గో వంటి డిటెక్టర్లు కిలోనోవా పేలుడు తరంగాలను బంధించాయి. ఈ పేలుడు 13 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో జరిగింది. ఒకవేళ భూమికి 36 కాంతి సంవత్సరాలలోపు నక్షత్రం ఢీకొంటే భూమిపై సామూహిక వినాశనం సంభవిస్తుందని అర్బానా-ఛాంపెయిన్‌లోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..