Apple 2024: కొత్త ఏడాది, కొత్త ప్రొడక్ట్స్‌.. 2024లో యాపిల్‌ నుంచి వస్తున్న..

యాపిల్‌.. ఈ బ్రాండ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న చిన్న పట్టణాల్లోనూ యాపిల్ స్టోర్స్‌ ఓపెన్‌ అయ్యాయంటనేనే ఈ బ్రాండ్‌ ఎంతలా విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. యూజర్లను ఆకట్టుకుంటూ నిత్యం కొంగొత్త ప్రొడక్ట్స్‌ను లాంచ్‌ చేసే యాపిల్.. 2024లోనూ సరికొత్త ప్రొడక్ట్స్‌తో వినియోగదారుల ముందుకు వస్తోంది. ఇంతకీ కొత్తేడాది యాపిల్‌ నుంచి ఏయే ప్రొడక్ట్స్ రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla

|

Updated on: Jan 01, 2024 | 10:46 AM

యాపిల్‌ అనగానే ఠక్కున గుర్తొచ్చేది ఐఫోన్‌. కొత్త వెర్షన్‌ కోసం ప్రపంచ వ్యాప్తంగా టెక్‌ ప్రియులు ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఏడాది యాపిల్‌ ఐఫోన్‌ 16ని లాంచ్‌ చేయనుంది. ఐఫోన్‌ 15 సమయంలో యూజర్ల నుంచి వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా లోపాలన్నంటినీ సరిచేస్తూ ఐఫోన్‌ 16ని తీసుకురానున్నారు.

1 / 5
ఐఫోన్‌ 16 సిరీస్‌లో మరిన్ని అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లను అందించనున్నారు. ఐఫోన్ 16ప్రోలో కెమెరాను ఈజీగా యాక్సెస్‌ చేయడానికి క్యాప్చర్‌ అనే బటన్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం. అలాగే ఈసారి ఐఫోన్‌ 16 అల్ట్రాను లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. మరింత మెరుగైన కెమెరా, బ్యాటరీని తీసుకొచ్చేందుకు యాపిల్ కృషి చేస్తున్నట్లు సమాచారం.

2 / 5
ఇక ఈ ఏడాది యాపిల్ తీసుకొస్తున్న మరో కొత్త ప్రొడక్ట్‌ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌. ఎం3 చిప్‌తో ఈ మ్యాక్‌బుక్‌ను లాంచ్‌ చేయనున్నారు. 2022లో లాంచ్‌ చేసిన 15 ఇంచెస్‌ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌లో ఎం2 చిప్‌ ఇవ్వగా ప్రస్తుతం తీసుకురానున్న ప్రొడక్ట్‌లో ఎం3 చిప్‌ను అప్‌గ్రేడ్‌ చేయనున్నారు.

3 / 5
యాపిల్‌ 2024లో ఐప్యాడ్‌ యూజర్లను సైతం టార్గెట్ చేస్తోంది. తక్కువ బడ్జెట్‌లోనే ఐప్యాడ్‌ను లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఐప్యాడ్‌ మినీ, ఐప్యాడ్ ఎయిర్‌, ఐప్యాడ్‌ ప్రో ఉత్పత్తలను యాపిల్‌ ఈ ఏడాది మార్కెట్లోకి తీసుకురానుంది.

4 / 5
ఇదిలా ఉంటే ఐప్యాడ్‌ ప్రోను ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో తీసుకురానుంది. మరిన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లను జోడించనున్నారు. ఇక ఈ ఏడాది యాపిల్‌ వాచ్‌ ఎక్స్‌ను మరిన్ని అధునాతన ఫీచర్లతో తీసుకురానున్నట్లు సమాచారం. మొత్తం మీద యాపిల్ లవర్స్‌కి ఈ ఏడాది పండగే అని చెప్పాలి.

5 / 5
Follow us