Airtel Postpaid: ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. ప్రీ పెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్‌కి మారితే ఎన్నో ప్రయోజనాలు..!
మీ ఇంట్లో నుంచి సులభంగా ప్రీ పెయిట్ నుంచి పోస్ట్ పెయిడ్ కు మారే అవకాశాన్ని భారతీ ఎయిర్ టెల్ సంస్థ అందిస్తోంది. కేవలం ఓటీపీ సాయంతో మీరు ప్రక్రియను పూర్తి చేయొచ్చు. వినియోగదారుల కోసం అవాంతరాలు లేని పోస్ట్‌పెయిడ్ సేవలను క్షణాల్లో పొందొచ్చు. అలాగే బహుళ ప్రయోజనాలు కూడా ఎయిర్ టెల్ అందిస్తోంది. ఒకవేళ మీరు ప్రీ పెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్ కి అప్‌గ్రేడ్ కావాలనే ప్లాన్‌లో ఉంటే ఈ కథనాన్ని మిస్ కాకండి..

ప్రీ పెయిడ్ కనెక్షన్ తో విసిగిపోయారా? అస్తమాను రీచార్జ్ చేసుకోవడం ఇబ్బందిగా ఉందా? అయితే ఈ కొత్త సంవత్సరంలో ఓ కొత్త నిర్ణయాన్ని తీసుకోండి. అదేంటంటే ప్రీ పెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్ ప్లాన్ కు మారిపోండి. సరే మారిపోతాం.. అలా చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? అయినా ఇప్పుడు ప్లాన్ చేయాలంటే ఆఫీస్ కు వెళ్లాలి, దరఖాస్తు చేసుకోవాలి.. అదంతా ఇబ్బంది అని ఇప్పుడెందుకులే అని ఆగిపోతున్నారా? అయితే మీకో శుభవార్త. కేవలం మీ ఇంట్లో నుంచి సులభంగా ప్రీ పెయిట్ నుంచి పోస్ట్ పెయిడ్ కు మారే అవకాశాన్ని భారతీ ఎయిర్ టెల్ సంస్థ అందిస్తోంది. కేవలం ఓటీపీ సాయంతో మీరు ప్రక్రియను పూర్తి చేయొచ్చు. వినియోగదారుల కోసం అవాంతరాలు లేని పోస్ట్‌పెయిడ్ సేవలను క్షణాల్లో పొందొచ్చు. అలాగే బహుళ ప్రయోజనాలు కూడా ఎయిర్ టెల్ అందిస్తోంది. ఒకవేళ మీరు ప్రీ పెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్ కి అప్‌గ్రేడ్ కావాలనే ప్లాన్‌లో ఉంటే ఈ కథనాన్ని మిస్ కాకండి..
నిరంతరాయ సేవలు..
అవాంతరాలు లేని కనెక్టివిటీ అనుభవం కోసం మీ బిజీ వర్క్ లైఫ్ షెడ్యూల్‌ను పరిగణనలోకి తీసుకుని ఎవరైనా మీ మొబిలిటీ సేవలను అప్‌గ్రేడ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, ఎయిర్ టెల్ పోస్ట్‌పెయిడ్ కొంత సహాయం చేస్తుంది. ఎయిర్ టెల్ ఎంట్రీ-లెవల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు ఒక కనెక్షన్‌కు రూ. 399 నుంచి ప్రారంభమవుతాయి. అదే 5 కనెక్షన్‌ల వరకూ తీసుకునే వెసులబాటు రూ. 1,499 ప్లాన్లో ఉంటుంది.
ఓటీపీ ద్వారా అప్‌గ్రేడ్..
ప్రీ పెయిడ్ నుంచి పోస్ట్ పెయెడ్ కి అప్ గ్రేడ్ అవడానికి ఎయిర్‌టెల్ వినియోగదారులు ఎయిర్‌టెల్ స్టోర్‌లను సందర్శించాల్సిన అవసరం లేకుండా కేవలం ఓటీపీతో ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్‌కు అప్‌గ్రేడ్ అవ్వొచ్చు. ఎయిర్ టెల్ తన సెల్ఫ్ కేర్ యాప్ అయిన ఎయిర్ థాంక్స్ ద్వారా చాలా కాలంగా ఈ సదుపాయాన్ని అందిస్తోంది. ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులు అందుకున్న ఓటీపీని నమోదు చేయడం, ప్రాథమిక వివరాలను పంచుకోవడం ద్వారా పోస్ట్‌పెయిడ్‌కు సజావుగా అప్‌గ్రేడ్ చేయవచ్చు. ఈ ప్రక్రియ కేవలం 30 నిమిషాలలోపు పూర్తవుతుంది.
బిల్ తగ్గింపు..
ఇది మాత్రమే కాకుండా, ప్రీపెయిడ్ వినియోగదారులను పోస్ట్‌పెయిడ్ వైపు మళ్లించడానికి, పోస్ట్‌పెయిడ్ సేవలను ప్రోత్సహించడానికి, ఎయిర్ టెల్ ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తోంది. వినియోగదారులకు మొదటి నెల నుంచి 6 నెలల వరకు బిల్ తగ్గింపులను అందిస్తోంది. నెలవారీ బిల్లులో రూ. 100 తగ్గించి చెల్లింపు చేయొచ్చు.
ఎయిర్‌టెల్ 399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్..
ఎయిర్‌టెల్ ఎంట్రీ-లెవల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ రూ. 399తో ప్రారంభమవుతుంది. ఇది వినియోగదారులకు అపరిమిత కాల్‌లను (లోకల్ + ఎస్టీడీ + రోమింగ్), 200 జీబీ వరకు రోల్‌ఓవర్‌తో 40జీబీ హై-స్పీడ్ నెలవారీ డేటా కోటాను అందిస్తుంది. అలాగే ఎయిర్‌టెల్ థాంక్స్ బెనిఫిట్‌లతో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్ లు అందిస్తుంది.
థాంక్స్ బెనిఫిట్‌లలో భాగంగా ఎయిర్‌టెల్ బ్లూ రిబ్బన్ బ్యాగ్ – ప్రీమియం సర్వీస్‌ను కలిగి ఉంది. ఇది మీ డెలివరీ చేయని బ్యాగేజీని ట్రాక్ చేయడంలో, వేగవంతం చేయడంలో సహాయపడుతుంది, 20 ఓటీటీ ప్రయోజనాలతో పాటు ఎక్స్ ట్రీమ్ ప్లే ప్రీమియం, అపల్లో సర్కిల్ 24/7 మెంబర్‌షిప్, హలో ట్యూన్స్, వింక్ సంగీతం
అదనంగా, ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారుగా, మీరు 5జీ నెట్‌వర్క్ లభ్యత ఉన్న ప్రాంతాల్లో అపరిమిత 5జీ డేటాను ఆస్వాదించవచ్చు. 5జీ లేని ప్రాంతాల్లో, మీరు డేటా రోల్‌ఓవర్‌తో పాటు బండిల్ చేసిన డేటాను ఆస్వాదించవచ్చు. ప్లాన్ గురించిన మరిన్ని వివరాలను పై కథనం లింక్ నుంచి తనిఖీ చేయవచ్చు.
ప్రీపెయిడ్ కు ప్రత్యామ్నాయం..
మీరు తక్కువ డేటా వినియోగంతో ప్రీపెయిడ్‌లో సమాన ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నట్లయితే, ఎయిర్ టెల్ రూ. 296 ప్రీపెయిడ్ ప్లాన్‌ని కలిగి ఉంది. ఇది 25జీబీ హై-స్పీడ్ డేటా, అపరిమిత వాయిస్, రోజుకు 100 ఎస్ఎంఎస్ అందిస్తుంది. థాంక్స్ బెనిఫిట్‌లలో భాగంగా, ఎయిర్ టెల్ వినియోగదారులు మీ ప్లాన్ పరిమితికి మించి అపరిమిత 5జీ డేటాను ఆస్వాదించగలరు. అయితే ఇది 5జీ నెట్‌వర్క్ ప్రాంతాలలో మాత్రమే ఉపయోగించవచ్చు. 3 నెలల పాటు అపోల్లో 24|7 సర్కిల్ సభ్యత్వం, వింక్ సంగీతం, ఉచిత హలో ట్యూన్‌లు ఉంటాయి. ఎయిర్‌టెల్ వినియోగదారుల అభీష్టానుసారం ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్ అప్‌గ్రేడ్ అయితే రూ. 100 నుంచి రూ. 600 వరకు బిల్లు తగ్గింపుల నుంచి ప్రయోజనం పొందుతారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








