Poco X6 Pro: పోకో నుంచి మరో ఇంట్రెస్టింగ్ ఫోన్.. సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌తో..
పోకోఎక్స్6 ప్రో షావోమీకి చెందిన ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్‌ఓఎస్‌తో పనిచేయనుంది. షావోమీకి చెందిన కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ హైపర్ఓఎస్‌ను ఇందులో అందిస్తున్నారు. ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను షావోమీ గతేడాది డిసెంబర్‌లో లాంచ్ చేసింది. ఎంపిక చేసిన కొన్ని డివైజ్‌ల మాత్రమే ప్రస్తతం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అందుబాటులో ఉంది...

చైనాకు చెంది స్మార్ట్‌ఫోన్ దిగ్గజం పోకో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. పోకో ఎక్స్6 సిరీస్‌లో భాగంగా రెండు ఫోన్‌లను లాంచ్ చేయనున్నారు. పోకో ఎక్స్6, పోకో ఎక్స్6 ప్రో పేర్లతో రెండు ఫోన్స్‌ను తీసుకొస్తున్నారు. జనవరి 11వ తేదీన ఆన్‌లైన్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. అనంతరం ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్‌లో అందుబాటులోకి రానుంది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పోకోఎక్స్6 ప్రో షావోమీకి చెందిన ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్‌ఓఎస్‌తో పనిచేయనుంది. షావోమీకి చెందిన కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ హైపర్ఓఎస్‌ను ఇందులో అందిస్తున్నారు. ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను షావోమీ గతేడాది డిసెంబర్‌లో లాంచ్ చేసింది. ఎంపిక చేసిన కొన్ని డివైజ్‌ల మాత్రమే ప్రస్తతం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అందుబాటులో ఉంది. ఇక కంపెనీ ఈ ఫోన్ ఫీచర్లకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ నెట్టింట వైరల్ అవుతోన్న సమాచారం ఆధారంగా ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో ఇప్పుడు చూద్దాం.
* పోకో ఎక్స్6 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా చిప్‌సెట్‌తో పనిచేయనున్నట్లు సమాచారం.
* ఇక ఈ స్మార్ట్ ఫోన్ వేడెక్కకుండా 5000 ఎమ్‌ఎమ్ వీసీ కూలింగ్ టెక్నాలజీతో వస్తోంది. అలాగే ఇందులో గేమింగ్ ఆప్టిమైషన్ కోసం వైల్డ్‌బూస్ట్ 2.0ని అందించారు.
More power to performance on the #POCOX6Pro,Powered by #XiaomiHyperOS.
Global launch on 11th Jan, 5:30 PM on @flipkart.
Know More👉https://t.co/JdcBOET57Z#POCOIndia #POCO #MadeOfMad #Flipkart #TheUtimatePredator pic.twitter.com/wujI4fvZ1Y
— POCO India (@IndiaPOCO) January 5, 2024
* పోకో ఎక్స్6 ప్రోలో 6.67 ఇంచెస్‌తో కూడా ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారని తెలుస్తోంది. 1.5కే డిస్‌ప్లే విత్ 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 2160 హెచ్‌జెడ్ టచ్ సాంప్లింగ్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఈ స్క్రీన్ సొంతం.
* ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 16జీబీ ర్యామ్, 1 టీబీ వరకు స్టోరేజ్‌ను అందించనున్నారని తెలుస్తోంది.
* కెమెరా విషయానికొస్తే పోకో ఎక్స్6 ప్రోలో 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరా, సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారని తెలుస్తోంది.
* ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నారని సమాచారం.
Powered by Xiaomi HyperOS!#POCOX6Pro is truly the speedy performance quasi-flagship.🚀 You don’t want to miss the global launch event on January 11th at 20:00 GMT+8! pic.twitter.com/6msNTZNBpy
— POCO (@POCOGlobal) January 4, 2024
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..




