అయ్యో దేవుడా.. ఈ కష్టం ఏ తండ్రికీ రాకూడదు.. టెట్ పరీక్షకు తీసుకెళ్తుండగా..
తండ్రి ఆటో డ్రైవర్.. రెక్కలు ముక్కలు కష్టంతో కూతుర్ని ఉన్నతంగా చదివించాడు.. ఆ తండ్రి కష్టానికి తగ్గట్టుగా ఆమె కూడా ఎంతో ఇష్టంతో చదివింది.. టీచర్ కావాలని ఆశతో ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. అందుకోసం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ - టెట్ కు దరఖాస్తు చేసుకుంది.

తండ్రి ఆటో డ్రైవర్.. రెక్కలు ముక్కలు కష్టంతో కూతుర్ని ఉన్నతంగా చదివించాడు.. ఆ తండ్రి కష్టానికి తగ్గట్టుగా ఆమె కూడా ఎంతో ఇష్టంతో చదివింది.. టీచర్ కావాలని ఆశతో ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. అందుకోసం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ – టెట్ కు దరఖాస్తు చేసుకుంది. హాల్ టికెట్ చేతికి అందుకొని.. పరీక్ష కోసం సిద్ధమైంది. పరీక్ష కేంద్రానికి తండ్రితో కలిసి బయలుదేరింది. తన ఆటోలోనే కూతుర్ని కూర్చోబెట్టుకొని తండ్రి ఇంటి నుంచి బయలుదేరారు. కంగారు పడకుండా పరీక్ష రాయమ్మా.. అన్నాడు తండ్రి. అంతే కాన్ఫిడెంట్గా బదులిచ్చింది కూతురు.. ఇలా వెళుతున్న క్రమంలో ఊహించని ఘటన. ఒక్కసారిగా ఆటో బోల్తా పడింది.. కూతురు కుప్పకూలింది.. తండ్రి కళ్ళ ముందే ప్రాణాలు విడిచింది. దీంతో గుండెలు పట్టుకుని రోదించాడు ఆ తండ్రి..
అనకాపల్లి జిల్లాలో హృదయ విదారకర ఘటన చోటుచేసుకుంది. విశాఖ లోని ఎన్ఏడీ ప్రాంతానికి చెందిన లక్ష్మణరావు ఆటో డ్రైవర్. అతని కుమార్తె సునీత. కూతురు ఉపాధ్యాయ పరీక్ష కోసం ఆసక్తి చూపడంతో తండ్రి ప్రోత్సహించాడు. టెట్ పరీక్షకు అప్లై చేసింది సునీత. శనివారం నాడు పరీక్ష కావడంతో హాల్టికెట్ తీసుకుంది. పరీక్షా కేంద్రం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సమీపంలోని మాకవరపాలెం దగ్గర ఉన్న అవంతి కాలేజ్.. కూతుర్ని తనతో పాటే పరీక్షకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్న తండ్రి.. ఆమెను ఆటోలో కూర్చోబెట్టుకుని బయలుదేరాడు. గూగుల్ మ్యాప్ చూసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఆటో అనకాపల్లి సుంకరమెట్ట వద్దకు చేరేసరికి కాస్త కన్ఫ్యూజన్. దీంతో రోడ్లు తెలియక సతమతమయ్యారు.
ఈ క్రమంలో స్పీడ్ బ్రేకర్ రావడంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. సునీత ఆటో నుంచి కింద పడింది. తీవ్ర గాయాల పాలై కుప్పకూలిపోయింది. తండ్రి తండ్రి తెరుకుని చూసేలాగానే ప్రాణాలు కోల్పోయింది కూతురు. అప్పటివరకు తనతో సరదాగా మాట్లాడుతూ ఉన్న కూతురు ఒక్కసారిగా కళ్లెదుటే విగత జీవిగా మారడంతో ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు. ఘటనా స్థలంలో ఆ తండ్రి పడిన వేదన అందరినీ కంటతడి పెట్టించింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




